India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, వైద్య సంస్థల్లో వైద్యుల రక్షణకు నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. వైద్యుల రక్షణకు దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేలా వైద్య నిపుణులకు టాస్క్‌ఫోర్స్‌లో చోటు కల్పిస్తామని సీజేఐ బెంచ్ తెలిపింది.
సాఫ్ట్‌వేర్, ఇతర ఉద్యోగులు గంటల తరబడి కూర్చోవడం వల్ల ఊబకాయం, హైపర్ టెన్షన్, డయాబెటిస్, హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఈక్రమంలో ఓ చిన్న జాగ్రత్తతో రోగాలు దరిచేరకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ అరగంటకి ఒకసారి బ్రేక్ తీసుకోవాలని సూచించారు. కుర్చీలోంచి లేచి 2-5 నిమిషాలు నడవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే వ్యాధుల బారిన పడరని, అకాల మరణాలు సంభవించవని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. వచ్చే మంగళవారం విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా, ఈడీ సమయం కోరింది. కోర్టు ఈడీకి ఈ నెల 23 వరకు అవకాశం ఇచ్చింది. కాగా, ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ తిరస్కరించడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేసిన హీరో ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన<<13885603>> వ్యాఖ్యలు<<>> దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయన వ్యాఖ్యలకు టాలీవుడ్ నటీనటులు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా హీరో సుధీర్ బాబు స్పందించారు. ‘నిర్మాణాత్మకంగా విమర్శించినా ఫర్వాలేదు. కానీ ఇలా తప్పుగా మాట్లాడొద్దు. వార్సీలో వృత్తి నైపుణ్యం లోపించింది. ప్రభాస్ స్థాయి చాలా పెద్దది’ అని ట్వీట్ చేశారు.
AP: రేషన్ సరకుల్లో బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార ఇస్తామని ప్రభుత్వం 2 నెలలుగా చెబుతున్నా అమలు జరగడం లేదు. వచ్చే నెలలోనూ బియ్యం మాత్రమే సరఫరా అవుతుందని సమాచారం. KG కందిపప్పు ₹67, పంచదార ₹17కే అందుతుందని ఆశలు పెట్టుకున్న పేదలకు నిరాశే ఎదురవనుంది. జులైలో కందిపప్పు సేకరణకు టెండర్లు పిలవగా, జుడీషియల్ ప్రివ్యూలో న్యాయమూర్తి వివరణ కోరారు. సమాధానం పంపడంలో అధికారులు అలసత్వం వహించినట్లు తెలుస్తోంది.
TG: HYDలో తెల్లవారుజాము నుంచే భారీ వర్షాలు పడటంతో రంగారెడ్డి జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 8.30 వరకూ ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు ఇబ్బంది పడ్డామని తల్లిదండ్రలు Xలో పేర్కొంటున్నారు. చాలా స్కూళ్లు 8 గంటలకే స్టార్ట్ అవుతాయని, గతేడాదిలానే సెలవుపై లేట్‌గా స్పందించారని ఫైరవుతున్నారు. విద్యాశాఖ IMD హెచ్చరికలను పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు.
ఇండియన్ బ్యాంక్‌లో 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై, 1-7-2024 నాటికి 20-30 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.48,480-85,920 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
వెబ్‌సైట్: https://www.indianbank.in/
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా లేటరల్ ఎంట్రీ ద్వారా నియమితులయ్యారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గుర్తు చేశారు. RSSకి చెందిన వారిని ప్రభుత్వ శాఖల్లో నియమిస్తున్నారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. నిబంధనలు రూపొందించే బాధ్యతను UPSCకి ఇచ్చి లేటరల్ ఎంట్రీ విధానాన్ని ప్రధాని మోదీ క్రమబద్ధీకరించారని మంత్రి పేర్కొన్నారు.
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనుంది. ఆయన క్రీడా ప్రయాణాన్ని మూవీగా తీసుకురానున్నట్లు Tసిరీస్ అధికార ప్రకటన వెల్లడించింది. ఈ సినిమాలో యువరాజ్ సింగ్ అద్వితీయ క్రికెట్ ప్రయాణం, ఆయన పాత్ర వంటి అంశాల నేపథ్యంలోనే సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 2007 టీ20WC, 2011 వరల్డ్ కప్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించారు. క్యాన్సర్‌తో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
TG: హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో GHMC జలమండలి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జీఎం, డీజీఎం, మేనేజర్లతో ఎండీ అశోక్‌రెడ్డి అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఉద్యోగులు, సిబ్బందికి అన్ని రకాల సెలవులూ రద్దు చేశారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాలకు ట్యాంకర్లతో సురక్షిత జలాలను సరఫరా చేయాలని ఆదేశించారు. మ్యాన్‌హోళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు సూచించారు.
Sorry, no posts matched your criteria.