India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత స్టాక్‌మార్కెట్లపై DIIs పట్టు పెరుగుతోంది. పెట్టుబడుల పరంగా FIIsతో పోలిస్తే 0.3 శాతమే వెనుకంజలో ఉన్నారు. NSEలో ఫారిన్ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 12 నెలల కనిష్ఠమైన 17.23 శాతానికి పడిపోయాయి. మరోవైపు DIIs హోల్డింగ్స్ 16.9 శాతానికి చేరాయి. ఇక MFs హోల్డింగ్స్ జీవితకాల గరిష్ఠమైన 9.9% వద్ద ఉన్నాయి. 2015లో మన మార్కెట్లలో FIIs పెట్టుబడులు DIIs కన్నా రెట్టింపు ఉండేవి. క్రమంగా పరిస్థితి మారుతోంది.

‘తండేల్’ సినిమా విడుదల నేపథ్యంలో చిత్రయూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అయితే, అనారోగ్య సమస్యలతో హీరోయిన్ సాయి పల్లవి చాలా ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారు. ఈక్రమంలో సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ చేసేందుకు ఆమె ముందుకొచ్చారు. హీరో చైతూతో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నానని, ఏవైనా అడిగే ప్రశ్నలుంటే చెప్పాలని సాయి పల్లవి ట్వీట్ చేశారు. ఈనెల 7న ‘తండేల్’ విడుదలవనుంది.

తిరుపతి ఎమ్మెల్సీ కిడ్నాప్ అయ్యారని జరుగుతున్న ప్రచారంపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. ‘ఎమ్మెల్సీని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయనే వీడియో విడుదల చేశారు. తిరుపతిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్‌తో పాటు బందోబస్త్ పెంచాం. బాలాజీ కాలనీ నుంచి ఎస్వీయూ వరకు వాహనాలు మళ్లించాం’ అని ఎస్పీ స్పష్టం చేశారు.

పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

వివిధ దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించిన అక్రమ వలసదారులను ట్రంప్ తిరిగి పంపించేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు వచ్చేసింది. భారత్‌కు చెందిన 205 మంది అక్రమ వలసదారులతో US మిలిటరీ విమానం టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుంచి ఇండియాకు బయలుదేరింది. కాగా అక్కడ 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు భారత్, US గుర్తించాయని ఇటీవల బ్లూమ్‌బెర్గ్ న్యూస్ పేర్కొంది.

నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 517 పాయింట్ల లాభంతో 77,704 వద్ద, నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 23,511 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.2గా ఉంది.

సీనియర్ నటి కుష్బూ సుందర్ గాయపడ్డారు. చేతికి కట్టుతో ఉన్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. అనుకోని గాయాలు మన ప్రయాణాన్ని ఆపాలని చూసినా ఆగిపోవద్దని, చిరునవ్వుతో ముందుకు సాగాలని రాసుకొచ్చారు. కాగా ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

రాష్ట్రంలో నిన్న వాయిదా పడిన 5 చోట్ల ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఎన్టీఆర్(D) నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్, పిడుగురాళ్ల, తుని మున్సిపల్ ఛైర్మన్, పాలకొండ నగరపంచాయతీ ఛైర్ పర్సన్ పదవులకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. పలు కారణాలతో నిన్న ఈ ఐదు చోట్ల ఎలక్షన్ వాయిదా పడింది.

TG: ఎస్సీ వర్గీకరణపై మంత్రి వర్గ సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4 కేటగిరీలుగా విభజించాలని ప్రతిపాదించింది. మొదటి కేటగిరిలో అత్యంత వెనుకబడిన ఉపకులాలు, రెండో కేటగిరీలో మాదిగ, మాదిగ ఉపకులాలు, మూడో కేటగిరీలో మాల, మాల ఉపకులాలు, నాలుగో కేటగిరీలో ఇతర ఉపకులాలుగా విభజించాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.