news

News February 3, 2025

‘తీన్మార్ మల్లన్న ఏ పార్టీ?’

image

TG: కాంగ్రెస్ MLC నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న) ఇటీవల చేసిన వ్యాఖ్యలు జనాల్లో గందరగోళానికి తెరలేపాయి. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై పార్టీ ఇప్పటికీ స్పందించకపోవడం ఏంటని జనాలు చర్చించుకుంటున్నారు. అధికారపార్టీ నేతగా ఉండి సొంత పార్టీపైనే విమర్శలు చేయడం ఏంటని విస్తు పోతున్నారు. దీంతో ఆయన ఏ పార్టీ నేత అని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

News February 3, 2025

రాహుల్ వ్యాఖ్యలు అవాస్తవం: జయశంకర్

image

లోక్‌సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని విదేశాంగమంత్రి జయశంకర్ ఫైరయ్యారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధానిని ఆహ్వానించామని కోరడానికి తాను అమెరికాకు వెళ్లాననడం పూర్తిగా అబద్ధం అన్నారు. విదేశాంగ కార్యదర్శిని కలవటానికే అక్కడికి వెళ్లానని స్పష్టం చేశారు. ఎంతో ప్రతిష్ఠ కలిగిన మోదీ లాంటి నాయకుడిపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయటం సరికాదని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

News February 3, 2025

తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

image

TG: ఎమ్మెల్సీ నవీన్ కుమార్(<<15344708>>తీన్మార్ మల్లన్న<<>>)పై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. మల్లన్న స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఖర్చు పెట్టి నల్గొండలో ఆయనను గెలిపించినట్లు తెలిపారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసి ఆయన మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

News February 3, 2025

సోషల్ మీడియాలో ఏపీ, తెలంగాణ ఫుడ్ వార్

image

సోషల్ మీడియాలో అభిమాన తారల గురించి వార్స్ చాలానే చూస్తున్నాం. తాజాగా Xలో కొందరు ఫుడ్ వార్‌కు తెరలేపారు. ఆంధ్ర, తెలంగాణ ఫుడ్‌లలో ఏది గొప్ప అంటూ చర్చ ప్రారంభించారు. కొందరు తమ ఫుడ్ గొప్ప అంటే తమ ఫుడ్ గొప్ప అని పోస్టులు చేస్తున్నారు. అయితే ఇలాంటి విషయాలపై కాకుండా ఏదైనా సమాజానికి మేలు చేసే అంశాలపై చర్చించాలని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

News February 3, 2025

కోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్ కూతురు

image

ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై కొన్ని వెబ్‌సైట్లలోని తప్పుడు కథనాలను తొలగించేలా ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు. దీనిపై కోర్టు గూగుల్‌కు నోటీసులు జారీ చేసింది. గతంలోనూ ఇదే విషయమై ఆమె కోర్టును ఆశ్రయించగా గూగుల్, యూట్యూబ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

News February 3, 2025

స్వదేశంలో దుమ్మురేపుతోన్న భారత టీమ్

image

సొంత గడ్డపై మ్యాచ్ అనగానే టీమ్ఇండియా ప్లేయర్లకు పూనకాలొస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో టీమ్ఇండియా 4-1తో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇలా 2019 నుంచి ఇప్పటివరకు టీమ్ఇండియా సొంత గడ్డపై 17 టీ20 సిరీస్‌లు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు వారి సొంత గడ్డపై 2006-10 వరకు ఎనిమిది సార్లు, 2007-2010 వరకు సౌతాఫ్రికా 7 సార్లు, 2008-12 వరకు న్యూజిలాండ్ ఆరు సార్లు తమ గడ్డపై విజయాలు సాధించాయి.

News February 3, 2025

ప్రభుత్వానికి అంబులెన్సులు ఇచ్చిన సోనూసూద్

image

AP: రాష్ట్ర ప్రభుత్వానికి సినీనటుడు సోనూసూద్ 4 అంబులెన్సులు ఇచ్చారు. ఇవాళ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లిన ఆయన సీఎం చంద్రబాబును కలిసి వాటిని అందజేశారు. సోనూసూద్ ఫౌండేషన్ తరఫున ఇచ్చిన ఆ అంబులెన్సులను ప్రారంభించిన సీఎం ఆయన్ను అభినందించారు. కరోనా సమయం నుంచి అవసరం ఉన్నవారికి సాయం చేస్తూ సోనూసూద్ మంచి మనసు చాటుకుంటున్నారు.

News February 3, 2025

ఫిబ్రవరి 14న ఆ స్కూళ్లకు సెలవు

image

TG: షబ్-ఎ-బరాత్(ముస్లింలకు పవిత్రమైన రాత్రి) సందర్భంగా ప్రభుత్వం ఫిబ్రవరి 14న సెలవు ప్రకటించింది. నెలవంక కనిపించడంతో ఆ రోజున షబ్-ఎ-బరాత్ నిర్వహించాలని మతపెద్దలు ఖరారు చేశారు. అయితే ఇది సాధారణ సెలవుదినం కాకుండా ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. ఫిబ్రవరి 14న కొన్ని పాఠశాలలకు సెలవు ఉండగా మరికొన్ని మైనారిటీ స్కూళ్లు మరుసటి రోజు సెలవు పాటిస్తాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే వర్తించనుంది.

News February 3, 2025

ఢిల్లీలో ముగిసిన ప్రచారం.. ఎల్లుండి పోలింగ్

image

ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. 70 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 8న ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నారు. ముఖ్యంగా బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం నడిచింది. వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న ఆప్.. హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు 23 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.

News February 3, 2025

అలాగైతే.. పులివెందులకు ఉపఎన్నిక: RRR

image

AP: MLA ఎవరైనా లీవ్ అడగకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందని Dy. స్పీకర్ రఘురామ‌కృష్ణరాజు(RRR) హెచ్చరించారు. ఒకవేళ మాజీ CM జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉపఎన్నిక వస్తుందని చెప్పారు. ఆయన అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలు పంచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష హోదాను స్పీకర్, CM కాదు ప్రజలు ఇవ్వాలని తెలిపారు. తన కస్టోడియల్ కేసులో సునీల్ కుమార్ పాత్ర స్పష్టమైందన్నారు.