news

News February 3, 2025

శక్తిమంతమైన టూల్‌ను తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ

image

ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేయగల డీప్ రీసెర్చ్ అనే శక్తిమంతమైన టూల్‌ను ఓపెన్ ఏఐ తీసుకొచ్చింది. అత్యంత కష్టమైన పరిశోధనను కూడా ఈ టూల్ సమర్థంగా పూర్తి చేస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది. ‘మనిషి గంటల తరబడి చేసే పనిని డీప్ రీసెర్చ్ కేవలం నిమిషాల వ్యవధిలో చేయగలదు. ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. నెట్టింట సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించి నివేదికను రిసెర్చ్ అనలిస్ట్ స్థాయిలో తయారుచేసి మీకు అందిస్తుంది’ అని పేర్కొంది.

News February 3, 2025

CBSE 10, 12వ తరగతి అడ్మిట్ కార్డులు

image

CBSE టెన్త్, 12వ తరగతులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, టెన్త్ పరీక్షలు మార్చి 18న, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. దేశ వ్యాప్తంగా 8,000 స్కూళ్ల నుంచి సుమారు 44 లక్షల మంది ఈ బోర్డు పరీక్షలకు హాజరుకానున్నారు. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 3, 2025

‘లక్కీ భాస్కర్’ తరహాలో డబ్బు సంపాదించాలనుకుని..

image

AP: లక్కీ భాస్కర్ మూవీలో హీరో బ్యాంకు సొమ్మును వాడుకుని మనీ సంపాదిస్తాడు. అదే తరహాలో చేయాలనుకుని ఓ ఉద్యోగి పోలీసులకు చిక్కాడు. మార్కాపురంలోని సచివాలయ కార్యదర్శి P.వెంకటేశ్వర్లు పింఛన్ల సొమ్ము ₹2.66L తీసుకుని JAN 31న పారిపోయాడు. వివిధ బెట్టింగ్ యాప్‌లలో పెట్టి ఒక్క రోజులోనే ₹10L సంపాదించాలనుకుని మొత్తం పోగొట్టుకున్నాడు. బంధువులు డబ్బు చెల్లించడంతో పోలీసులు అతడిని హెచ్చరించి వదిలేశారు.

News February 3, 2025

కుంభమేళాలో భక్తుల భద్రతపై నేడు సుప్రీంలో విచారణ

image

కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గైడ్‌లైన్స్ ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యర్థులుగా పిటిషనర్ పేర్కొన్నారు.

News February 3, 2025

ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న అడ్మిషన్లు.. సర్కార్ కీలక నిర్ణయం

image

TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ విద్యాసంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలు, వస్తున్న ఫలితాల గురించి ప్రజలకు తెలిసేలా వివరించనుంది. అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టనుంది. దీనికోసం FB, X, WHATSAPP వంటి సోషల్ మీడియా వేదికల్లో స్పెషల్ గ్రూపులను క్రియేట్ చేయనుంది. వీటిని స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారని సమాచారం.

News February 3, 2025

ఆత్మీయ భరోసా.. నిలిచిపోయిన డబ్బుల జమ?

image

TG: MLC ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ కారణంగా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ డబ్బుల జమ నిలిచిపోయినట్లు సమాచారం. తొలి విడతలో 18,180 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ₹10.90crకు పైగా ప్రభుత్వం జమ చేసింది. ఈ స్కీమ్‌కు 5.80L మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించింది. కొత్త దరఖాస్తులను పరిశీలిస్తోంది. కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా ఆ ఫ్యామిలీలోని వారిని అనర్హులుగా గుర్తిస్తున్నట్లు సమాచారం.

News February 3, 2025

TTD UPDATE: తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లు

image

రేపు రథ సప్తమి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అష్టాదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు, ఊంజల్ సేవల్ని టీటీడీ రద్దు చేసింది. అటు ఎన్ఆర్ఐలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు కేటాయించే ప్రత్యేక దర్శనాలను, నేటి నుంచి 3రోజుల వరకూ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది. నేడు సిఫార్సు లేఖల్ని స్వీకరించబోమని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.

News February 3, 2025

ముద్రగడకు YS జగన్ పరామర్శ

image

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని మాజీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. నిన్న ఆయన నివాసంపై <<15338401>>దాడి<<>> జరిగిన ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఆయనకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిన్న తెల్లవారుజామున మద్యం మత్తులో ఓ యువకుడు ముద్రగడ ఇంటిని ట్రాక్టర్‌తో ఢీకొట్టిన సంగతి తెలిసిందే.

News February 3, 2025

పారిశ్రామికవేత్తలకు మోదీ, కేజ్రీ బానిసలు: ప్రియాంక

image

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ‘ఇద్దరిదీ ఒకే తరహా మైండ్‌సెట్. పారిశ్రామిక వేత్తలకు బానిసత్వం చేస్తుంటారు. వారిలాంటి పిరికిపందల్ని నేనెప్పుడూ చూడలేదు. అభివృద్ధి జరగకపోవడానికి నెహ్రూ కారణమని మోదీ ఆరోపిస్తుంటారు. అటు కేజ్రీవాల్ తన వైఫల్యాలకు మోదీ కారణమంటారు. ఆయన శీశ్‌మహల్ కడితే మోదీ రాజ్‌మహల్ కట్టారు’ అని విమర్శించారు.

News February 3, 2025

చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్

image

ENGతో T20 సిరీస్‌లో 14 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించారు. ఓ ద్వైపాక్షిక T20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచారు. 2021లో AUSపై కివీస్ స్పిన్నర్ ఇష్ సోధీ 13 వికెట్లు తీయగా, వరుణ్ ఇప్పుడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేశారు. ఓవరాల్‌గా ఓ T20 సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా వరుణ్ నిలిచారు. 2022లో ENGపై 15 వికెట్లు పడగొట్టిన హోల్డర్(విండీస్) టాప్‌లో ఉన్నారు.