India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
✒ తేది: ఆగస్టు 10, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:41 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:58 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:45 గంటలకు
✒ ఇష: రాత్రి 8.01 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
✒ తేది: ఆగస్టు 10, శనివారం
✒ షష్ఠి: తెల్లవారుజాము 05.45 గంటలకు
✒ చిత్త: తెల్లవారుజాము 5.48 గంటలకు
✒ వర్జ్యం: ఉదయం 11.45 గంటల నుంచి 1.34 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 05.51 నుంచి 06.42 గంటల వరకు
* తెలంగాణకు ‘ఫ్యూచర్ స్టేట్’ ట్యాగ్‌లైన్: సీఎం రేవంత్
* ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ: భట్టి విక్రమార్క
* సుంకిశాల ఘటనకు రేవంతే బాధ్యుడు: కేటీఆర్
* అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే నా ఆకాంక్ష: CM CBN
* వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా
* రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను నాశనం చేస్తున్నారు: YS జగన్
* మనీశ్ సిసోడియాకు బెయిల్.. జైలు నుంచి విడుదల
AP: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరిశా, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఎస్.భార్గవి, ఫైబర్ నెట్ ఎండీగా కె.దినేశ్ కుమార్, ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శిగా అనంత్ శంకర్, గుంటూరు కార్పోరేషన్ కమిషనర్‌గా పి.శ్రీనివాసులును నియమించింది. వీరితో పాటు పలు జిల్లాలకు జేసీలను బదిలీ చేసింది.
పారిస్ ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించేందుకు వివిధ దేశాల అథ్లెట్లు శ్రమిస్తున్నారు. అయితే, మెడల్స్ సాధించిన అథ్లెట్లకు ఆయా దేశాలిచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసుకుందాం. నార్వే దేశం ఒక్క రూపాయి ఇవ్వదు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ప్రైజ్‌మనీలు వరుసగా.. ఇండియాలో రూ.75 లక్షలు,రూ. 50లక్షలు,రూ.25 లక్షలు. USAలో $37,000, $22,500, $15,000. సింగపూర్‌లో $7,44,000, $3,72,000, $1,86,000లు అథ్లెట్లు పొందనున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. రెజ్లింగ్ పురుషుల 57కేజీల విభాగంలో ప్యూర్టో రికోకు చెందిన డేరియన్ క్రజ్‌తో జరిగిన మ్యాచులో 13-5 పాయింట్ల తేడాతో అమన్ గెలుపొందారు. దీంతో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. కాగా రెజ్లింగ్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.
AP: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికలో కూటమి అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో CM చంద్రబాబు కమిటీ వేశారు. ఇందులో TDP నుంచి పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, JSP నుంచి పంచకర్ల రమేశ్, BJP నుంచి విష్ణుకుమార్‌కు అవకాశం దక్కింది. అర్బన్, రూరల్‌లో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది వీరు CMకు నివేదిక ఇస్తారు.
పారిస్ ఒలింపిక్స్2024లో భారత్ తొలి సిల్వర్ మెడల్ అందుకుంది. నిన్న అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి సిల్వర్ గెలిచిన విషయం తెలిసిందే. కాగా ఆ మెడల్‌ను తాజాగా ప్రదానం చేశారు. మెడల్‌తో నీరజ్ ఫొటోలకు పోజులిచ్చారు. పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌కు గోల్డ్, మూడో స్థానంలో నిలిచిన గ్రెనెడా అథ్లెట్ పీటర్సన్‌కు బ్రాంజ్ మెడల్ వచ్చింది.
Sorry, no posts matched your criteria.