India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలకు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25వేలకు పెంచారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకూ ఇదే విధంగా నిధులు ఇస్తామన్నారు. స్కూళ్లలో ఫ్రీడమ్ ఫైటర్లను సత్కరించాలని, విద్యార్థులకు క్రీడలతో పాటు క్విజ్ తదితర పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.
TG: సుంకిశాల ప్రాజెక్టు కూలడానికి గత BRS ప్రభుత్వ అవినీతే కారణమని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించారు. ఘటనా స్థలంలో పర్యటించిన సందర్భంగా మంత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఘటన చాలా చిన్నది. ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం లేదు. నష్టాన్ని కాంట్రాక్టర్ భరిస్తారు. BRS నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ప్రాజెక్టు పనులు వాళ్ల హయాంలోనే జరిగాయి’ అని అన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో వెండి పతకాన్ని గెలుచుకున్న దక్షిణ కొరియా షూటర్ కిమ్ యె-జీ ప్రెస్ మీట్‌లో కళ్లు తిరిగి పడిపోయారు. ఒత్తిడి, అలసట కారణంగా ఆమె నీరసంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. షూటింగ్ సమయంలో ఆమె కూల్‌గా వ్యవహరించి వెండి పతకం గెలుచుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. టర్కీ షూటర్ యూసుఫ్ తరహాలోనే ఆమెకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.
బంగ్లా అల్లర్ల కారణంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. మరి ఆమెకు స్వదేశానికి తిరిగి వెళ్లే ఆలోచన ఉందా? ఈ ప్రశ్నకు ఆమె తనయుడు సజీబ్ వాజెద్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ‘మా అమ్మకు బంగ్లాదేశ్ అంటే ప్రాణం. అది తన దేశం. పరిస్థితులు కుదుటపడిన తర్వాత కచ్చితంగా అక్కడికి వెళ్తారు. భారత్ సహకారంతో అక్కడ స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని మేం ఆశిస్తున్నాం’ అని తెలిపారు.
పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సెషన్‌లో కేంద్ర బడ్జెట్‌తో పాటు, నీట్ యూజీ పేపర్ లీకేజీ, వయనాడ్ ప్రకృత్తి విపత్తు, రాహుల్‌పై అనురాగ్ ఠాకూర్ కుల వ్యాఖ్యలు, వినేశ్ ఫొగట్ అంశంపై అధికార, విపక్షాల మధ్య వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై విపక్షాలు పట్టువీడకపోవడంతో కేంద్రం JPC ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
TG: కొడంగల్‌లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని CM రేవంత్, ఆయన సోదరుడు తమను బెదిరిస్తున్నారంటూ దౌల్తాబాద్ మండల రైతులు KTRను కలిశారు. దుద్యాల్ మండలంలో దాదాపు 3000 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు KTRకు వివరించినట్లు BRS ట్వీట్ చేసింది. భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని రైతులు చెప్పారని, వారికి అండగా ఉంటామని KTR హామీ ఇచ్చారని పేర్కొంది.
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేరు ధర స్టాక్ మార్కెట్‌లో లిస్టైన తొలిరోజే అదరగొట్టింది. పబ్లిక్ ఇష్యూకు స్పందన అంతంతమాత్రంగానే ఉన్నా ఇన్వెస్టర్లకు 20% లాభాలు అందించింది. రూ. 76 ఐపీఓ ధరతో ట్రేడింగ్ ప్రారంభమవ్వగా రూ.91.20 వరకు చేరుకొని డే అప్పర్ సర్క్యూట్‌ని తాకింది. ఓలా లిస్టింగ్‌తో సంస్థ ఫౌండర్ భవీశ్ అగర్వాల్ బిలియనీర్ల జాబితాలో చేరారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న ‘NTR31’ మూవీ స్టోరీ ఇదేనంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్, క్యాప్షన్ ఆధారంగా 1969లో మహారాష్ట్ర తారాపూర్‌లో ప్రారంభమైన తొలి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం చుట్టూ కథ నడుస్తుందంటున్నారు. అందులో NTR కార్మికుడిగా పనిచేస్తారేమోనంటూ ఊహించుకుంటున్నారు. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మీరేమంటారు?
TG: ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ‘ఇప్పటివరకు రెండు విడతలుగా రూ.12,289 కోట్లు రుణమాఫీ చేశాం. రూ.లక్షన్నర వరకు రుణం ఉన్న వారికి నేరుగా అకౌంట్లలో డబ్బులు వేశాం. రెండు విడతల్లో కలిపి 16 లక్షల 29వేల కుటుంబాలకు రుణమాఫీ జరిగింది. 3వ విడత రుణమాఫీని వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రారంభిస్తారు’ అని భట్టి ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.