news

News August 9, 2024

కనీసం 6 గంటలైనా నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా?

image

రోజంతా అలుపెరగకుండా పనిచేసే మన అవయవాలకు నిద్రపోయినప్పుడే తగినంత విశ్రాంతి దొరుకుతుంది. అందుకే కనీసం 6 గంటలైనా నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘ఆ నిద్ర కూడా లేకపోతే డయాబెటిస్, హృద్రోగాలు, బీపీ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. డిప్రెషన్‌ ముప్పుతో పాటు అకాల మరణం పొంచి ఉంటుంది’ అని నేషనల్ స్లీప్ క్లినిక్ వ్యవస్థాపకుడు డాక్టర్ జేసీ సూరి హెచ్చరిస్తున్నారు.

News August 9, 2024

తెలంగాణకు ‘ఫ్యూచర్ స్టేట్’ ట్యాగ్‌లైన్: సీఎం రేవంత్

image

తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్’ అనే ట్యాగ్‌లైన్‌తో పిలవాలని CM రేవంత్ అన్నారు. కాలిఫోర్నియాలో AI బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ‘AI హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రాజెక్టులతో ఫ్యూచర్ స్టేట్‌కు TG పర్యాయపదంగా నిలుస్తుంది. అందరం కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం’ అని టెక్ యూనికార్న్ CEOలను ఆహ్వానించారు. బయోటెక్ కంపెనీ ‘Amgen’ HYDలో కొత్త సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

News August 9, 2024

పిల్ల‌లూ.. మీ మ‌నీశ్ అంకుల్ తిరిగి వ‌చ్చేస్తున్నారు: రాఘవ్ చద్దా

image

ఆప్ సీనియ‌ర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియాకు బెయిల్ ద‌క్క‌డంపై ఆ పార్టీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా స్పందిస్తూ ‘ఢిల్లీ విద్యా విప్ల‌వ వీరుడు మ‌నీశ్ సిసోడియాకు బెయిల్ రావ‌డంతో దేశం మొత్తం స‌ంతోషంగా ఉంది. పేద పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్తును అందించ‌డ‌మే ఆయ‌న చేసిన నేరం. పిల్ల‌లూ.. మీ మ‌నీశ్ అంకుల్ తిరిగి వ‌చ్చేస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.

News August 9, 2024

మహేశ్‌ అన్నా.. హ్యాపీ బర్త్ డే: ఎన్టీఆర్

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్‌లో విషెస్ తెలిపారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మహేశ్ అన్నా. ఈ ఏడాదంతా మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మహేశ్ తరఫున ఆయన ఫ్యాన్స్ వారిద్దరూ కలిసున్న ఫొటోలను పెట్టి తారక్‌కు థాంక్స్ చెబుతున్నారు. సూపర్ స్టార్, యంగ్‌ టైగర్‌ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే.

News August 9, 2024

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: అంబటి

image

AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ‘విజయవాడలోని అంబేడ్కర్ స్మృతివనంపై దాడి చేయడం దారుణం. చంద్రబాబు, లోకేశ్ ప్రమేయంతోనే ఈ దాడి జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దీనిని కూలగొట్టాలని ప్రయత్నించారు. ఇప్పుడు ధ్వంసం చేశారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

News August 9, 2024

యువ రైతు ప్రాణం తీసిన ‘ధరణి’!

image

TG: ‘ధరణి’లో భూమి రిజిస్టర్ కాలేదనే మనస్తాపంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు రాజేశ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. జక్రాన్‌పల్లి మం. అర్గుల్‌కు చెందిన రాజేశ్ వ్యవసాయంతో పాటు వ్యాపారంలో రూ.12 లక్షలు నష్టపోయాడు. తన 2 ఎకరాల భూమిని అమ్మేసి బాకీని తీర్చాలని ప్రయత్నించాడు. ధరణి పోర్టల్‌లో భూమి నమోదు కాకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.

News August 9, 2024

అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలి: సీఎం చంద్రబాబు

image

AP: టీడీపీ హయాంలో ఏటా ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని CM చంద్రబాబు విమర్శించారు. విజయవాడలో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఆదివాసీలు. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే నా ఆకాంక్ష. ఏకలవ్యుడు, అల్లూరి, టీచర్ నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన ద్రౌపదీ ముర్మును ఆదర్శంగా తీసుకుని రాణించాలి’ అని పిలుపునిచ్చారు.

News August 9, 2024

9 ఏళ్లకే పెళ్లి.. ఇరాక్ పార్లమెంట్‌లో షాకింగ్ బిల్లు!

image

ఆడపిల్లల కనీస వివాహ వయసును 9 ఏళ్లకు తగ్గించేలా ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ఆ దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు దుమారం రేపుతోంది. ప్రస్తుతం కనీస వయసు 18 ఏళ్లుగా ఉంది. బిల్లు పాసైతే 15 ఏళ్లకే బాలురికి, 9 ఏళ్లకే బాలికలకు వివాహం చేసేయొచ్చు. దీనిపై హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. అమ్మాయిలు చిన్నవయసులోనే తప్పుదోవ పట్టకుండా బిల్లు ఉపకరిస్తుందని కొంతమంది MPలు చెబుతున్నారు.

News August 9, 2024

‘రెడ్డి-బీసీ’ ఫ్యాక్ట‌ర్‌పై బీజేపీ దృష్టి?

image

TG: రాష్ట్ర అధ్య‌క్షుడి ఎంపికలో బీజేపీ అధిష్ఠానం సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు పెద్ద‌పీట వేస్తోంది. ఇప్ప‌టికే అసెంబ్లీలో ఫ్లోర్ లీడ‌ర్‌గా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డిని నియ‌మించిన హైకమాండ్, అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను బీసీలకు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు ఈట‌ల, అర‌వింద్‌ ముందువరసలో ఉన్నట్లు తెలుస్తోంది.

News August 9, 2024

‘లాపతా లేడీస్’ సినిమాలో ఏముంది?

image

<<13811383>>లాపతా లేడీస్<<>> అంటే ‘తప్పిపోయిన స్త్రీలు’. చదువుకోవాలనే కోరిక ఉన్నా ఇష్టంలేని పెళ్లి చేసుకున్న ఓ యువతి, కట్టుకున్న వాడి ఊరు, పేరు తెలియని మరో అమాయకురాలి కథ ఇది. రైలులో ప్రయాణిస్తూ భార్యల తలపై కొంగు వల్ల ఓ వ్యక్తి మరో మహిళను ఇంటికి తీసుకెళ్తాడు. అసలు భార్య స్టేషన్‌లో ఉండిపోతుంది. వాళ్లు మళ్లీ ఎలా కలిశారు? మనసులు కలవని, మనుషులు తెలియని మనువులతో ఇబ్బందులు, లింగ సమానత్వ అవసరాన్ని చక్కగా చూపించారు.

error: Content is protected !!