news

News February 9, 2025

వన్డేల్లో అత్యధిక సిక్సర్లు

image

*షాహిద్ అఫ్రిదీ- 351 సిక్సర్లు (369 ఇన్నింగ్సులు)
*రోహిత్ శర్మ- 334 (259)
*క్రిస్ గేల్- 331 (294)
*జయసూర్య- 270 (433)
*ధోనీ- 229 (297)
*మోర్గాన్- 220 (230)
*డివిలియర్స్- 204 (218)
*మెక్‌కల్లమ్- 200 (228)
*సచిన్- 195 (452)

News February 9, 2025

నక్సలిజాన్ని పూర్తిగా పెకిలిస్తాం: అమిత్ షా

image

వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా పెకిలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ట్వీట్ చేశారు. ‘ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోలు మరణించారు. ఈ పోరులో ఇద్దరు జవాన్లను కోల్పోయాం. వీరికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఇకపై దేశంలో ఏ పౌరుడూ నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోకూడదు’ అని ఆయన పేర్కొన్నారు.

News February 9, 2025

మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

image

మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడారు. అమిత్ షాను కలిసిన అనంతరం బీరెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భళ్లాకు పంపారు. కాగా బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు నిన్న కాంగ్రెస్ ప్రకటించింది. ఈలోపే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.

News February 9, 2025

ఆగిన ఫ్లడ్ లైట్లు.. మ్యాచ్ నిలిపివేత

image

భారత్-ఇంగ్లండ్ రెండో వన్డేకు అంతరాయం కలిగింది. రోహిత్ శర్మ జోరు మీదున్న టైంలో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. వెలుతురు లేక అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ఇరు జట్ల ప్లేయర్లు మైదానాన్ని వీడారు. దీంతో ప్రేక్షకులు సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేసి సందడి చేస్తున్నారు.

News February 9, 2025

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌కు ఆదేశం

image

AP: తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్‌పై <<15400758>>ఆరోపణలు వస్తున్న<<>> వేళ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఆరోపణలపై క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌ను ఆదేశించింది. జనసైనికులు, వీర మహిళలు ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని, సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

News February 9, 2025

థాంక్యూ మీట్‌కు హాజరుకాకపోవడంపై రష్మిక పోస్ట్

image

‘పుష్ప-2’ థాంక్యూ మీట్‌కు హాజరుకాని హీరోయిన్ రష్మిక ఆసక్తికర పోస్ట్ చేశారు. సుకుమార్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కలిసి తమ శ్రమతో ఇలాంటి అద్భుతాన్ని అందించినందుకు థాంక్యూ చెప్పారు. శ్రీవల్లి హృదయంలో తమకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగం చేసినందుకు, గుర్తుండిపోయే రోల్ ఇచ్చినందుకు మరోసారి థాంక్యూ అని రాసుకొచ్చారు.

News February 9, 2025

చిలుకూరు అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

image

TG: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు <<15408903>>రంగరాజన్‌పై దాడి<<>> చేసిన వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారని.. దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

News February 9, 2025

వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌లో మాదే అధికారం: ధర్మేంద్ర ప్రధాన్

image

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. 2019 నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీకి ఓటింగ్ 30-40 శాతంగా ఉంటోందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు మరో 10శాతం ఓట్లు అవసరమని చెప్పారు. మరోవైపు బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సీఎం మమతా బెనర్జీ అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

News February 9, 2025

గ్రేట్.. చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ

image

HYD నార్సింగిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డా.భూమిక (కర్నూలు) చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయ్యారు. దీంతో జీవన్‌దాన్, అవయవ దానం కోసం వారి కుటుంబసభ్యులను సంప్రదించగా.. తీవ్రమైన దుఃఖంలోనూ వారు అంగీకరించారు. దీంతో భూమిక గుండె, లివర్, రెండు కిడ్నీలు, ఊపిరితిత్తులను ఇతర వ్యక్తులకు అమర్చారు. మరణంలోనూ డాక్టరమ్మ తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

News February 9, 2025

కాంగ్రెస్, BRS మధ్య ఒప్పందం: బండి సంజయ్

image

TG: కాంగ్రెస్, BRSవి కాంప్రమైజ్ పాలిటిక్స్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలను అరెస్టు చేయకుండా ఉండేందుకు BRS ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందన్నారు. ఎంఐఎం ఒత్తిడితోనే ముస్లింలను బీసీల్లో కలిపారని, బీసీ సంఘాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.