news

News August 9, 2024

గంజాయి సమాచారమిస్తే రూ.5,000: మంత్రి సుభాష్

image

AP: గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంతోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యాసంస్థలు, పరిశ్రమల వద్ద గంజాయి అమ్ముతున్న/తాగుతున్న వారి సమాచారం తనకు లేదా పోలీసులకు చేరవేయాలని ప్రజలకు సూచించారు. ఇలా తెలిపిన వారికి రూ.5,000 నగదు బహుమానం తన సొంత నిధుల నుంచి ఇస్తానని ప్రకటించారు.

News August 9, 2024

ఐదు సినిమాలతో ప్రభాస్ బిజీ బిజీ

image

కొన్నాళ్లుగా షూటింగ్‌లకు విరామం తీసుకున్న ప్రభాస్ మళ్లీ బిజీ కానున్నారు. హను డైరెక్షన్‌లో ఈ నెల 17న కొత్త మూవీ ప్రారంభం కానుంది. దీనికి ఫౌజీ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో మృణాల్ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. రాజాసాబ్ కొత్త షెడ్యూల్ ఈ నెలలోనే షురూ కానుంది. సలార్, కల్కి సీక్వెల్స్‌తోపాటు సందీప్‌రెడ్డి డైరెక్షన్‌లో మూవీ ఈ ఏడాదే మొదలవనుంది. మొత్తంగా డార్లింగ్ చేతిలో 5 సినిమాలున్నాయి.

News August 9, 2024

మీ ప్రొఫైల్ పిక్చర్‌గా జాతీయ జెండాను పెట్టుకోండి: మోదీ పిలుపు

image

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నందున ‘హర్‌ఘర్‌తిరంగా’ను గుర్తుండిపోయే ఈవెంట్‌గా మార్చుదామంటూ ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చాను. మీరు కూడా అలాగే చేయండి. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను https://harghartiranga.comలో పంచుకోండి’ అని ట్వీట్ చేశారు.

News August 9, 2024

రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ

image

TG: ఆరోగ్య శ్రీ పథకానికి అర్హత, పాత కార్డుల అప్డేట్, కొత్త పేర్ల ఎంట్రీ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. మార్గదర్శకాల తయారీ కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రేషన్‌కార్డును పరిగణనలోకి తీసుకోకుండా ఆదాయ ధ్రువీకరణ పత్రం ద్వారా అర్హులను గుర్తించనున్నారు. ఆరోగ్యశ్రీ కోసం దాదాపు 10 లక్షలు, కార్డుల్లో సభ్యులను చేర్చేందుకు మరో 11 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

News August 9, 2024

140 కోట్ల జనాభా.. గోల్డ్ మెడల్ ఏది?

image

140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఈసారి విశ్వక్రీడల్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆఖరికి పాకిస్థాన్ కూడా స్వర్ణం సాధించిందని, మనకేం తక్కువని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు క్రికెట్‌తో పాటు ఇతర ఆటలను తప్పకుండా ప్రోత్సహించాలని కోరుతున్నారు. క్రీడల్లో రాజకీయాలు ఉండొద్దని, కులం, మతం, ప్రాంతం కాకుండా ప్రతిభ ఆధారంగా అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News August 9, 2024

‘కాంస్యం’ దక్కేనా?

image

పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ భారత్ కాంస్యం కోసం బరిలోకి దిగనుంది. రెజ్లింగ్ పురుషుల 57కేజీల విభాగంలో ప్యూర్టో రికోకు చెందిన డేరియన్ క్రజ్‌తో అమన్ తలపడనున్నారు. అథ్లెటిక్స్ 4*400 రిలేలో పురుషుల, మహిళల టీమ్స్ బరిలోకి దిగనున్నాయి. షెడ్యూల్ కోసం పైన చూడండి.

News August 9, 2024

మున్ముందు మన జాతీయ గీతం కచ్చితంగా వినిపిస్తుంది: నీరజ్ చోప్రా

image

ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శనపై సిల్వర్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సంతృప్తి వ్యక్తం చేశారు. జావెలిన్ త్రోలో తానింకా మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. ‘ప్రతి ఆటగాడికి ఓ రోజు వస్తుంది. ఈరోజు అర్షద్‌ది. నా శాయశక్తులా ప్రయత్నించా. ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. మన దేశం ఒలింపిక్స్‌లో బాగా ఆడింది. నేడు మెడల్ స్వీకరణ వద్ద జనగణమన వినిపించకపోవచ్చు కానీ భవిష్యత్తులో కచ్చితంగా వినిపిస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

News August 9, 2024

ఇ-కామర్స్‌లో 10 లక్షల ఉద్యోగాలు

image

ఈ సారి పండగల సీజన్‌లో ఆన్‌లైన్ సేల్స్ 35 శాతం పెరిగే అవకాశం ఉందని ఇ-కామర్స్ అంచనా వేస్తోందని టీమ్ లీజ్ సర్వీసెస్ తెలిపింది. దీనికి తగ్గట్లుగా సేవలు అందించేందుకు 10 లక్షల గిగ్ కార్మికులు, 2.5 లక్షల మంది కాంట్రాక్టు సిబ్బందిని నియమించుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో 2025 కల్లా 5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేందుకు తోడ్పాటు కానుందని అభిప్రాయపడింది.

News August 9, 2024

పాక్ టెస్ట్ జట్టు కోచ్‌గా నీల్సన్

image

పాకిస్థాన్ టెస్టు జట్టు హై ఫర్ఫార్మెన్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ టిమ్ నీల్సన్‌ను పీసీబీ నియమించింది. ఈ నెల 21 నుంచి బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే పాక్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా జాసన్ గిలెస్పీ ఉన్నారు. వీరిద్దరూ కలిసి జట్టును నడిపించనున్నారు. కాగా నీల్సన్ 2007 నుంచి 2011 వరకు ఆసీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు.

News August 9, 2024

నాగచైతన్య, శోభిత ఎక్కడ కలిశారంటే?

image

సమంతతో 2021లో విడాకుల తర్వాత నాగచైతన్య కొంతకాలం సింగిల్‌గానే ఉన్నారు. 2022లో ‘మేజర్’ ప్రమోషన్లలో శోభితను చైతూ తొలిసారి కలిసినట్లు తెలుస్తోంది. చైతూ ఆమెకు తన కొత్త ఇంటిని చూపించడం, ఇద్దరూ ఒకే కారులో కనబడటంతో డేటింగ్ రూమర్స్ స్టార్టయ్యాయి. 2023 మార్చిలో ఇద్దరూ లండన్‌లో కలిసి దిగిన ఫొటో వైరల్ కావడంతో రిలేషన్‌షిప్ వార్తలు మరింత పెరిగాయి. తాజాగా డేటింగ్ వార్తలను నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకున్నారు.

error: Content is protected !!