news

News February 10, 2025

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వినియోగం

image

TG: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 16 వేల మెగావాట్లకు చేరువలో డిమాండ్ ఉంది. ఈ నెల 7న అత్యధికంగా 15,920 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. యాసంగి పంటలు, వేసవి ప్రభావంతో డిమాండ్ పెరిగింది. మరోవైపు, విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.

News February 10, 2025

5 కిలోమీటర్లకు 5 గంటల సమయం

image

కుంభమేళాకు వెళ్లిన ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 300 కి.మీ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. 5 కి.మీ 5 గంటల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్ నుంచి ట్రాఫిక్ ఉండటంతో చాలామంది ఇంకా UPలోకే ఎంటర్ కాలేదు. ఇక త్రివేణీ సంగమానికి చేరుకోవడం గగనంలా మారింది. గంటలకొద్దీ వాహనాల్లోనే కూర్చోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News February 10, 2025

ప్రశాంతమైన జీవితానికి 8 సూత్రాలు

image

– ఎదుటివారు చెప్పేది విన్నాక మాట్లాడు
– ఎక్కువ గమనించు
– తక్కువ మాట్లాడు
– ఎప్పుడూ నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు
– నేర్చుకోవడం మానేయకు
– ఈగో, వాదించడం, కోపాన్ని కంట్రోల్ చేసుకో
– ఎక్కువ నవ్వుతూ తక్కువ చింతించు
– ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అని తెలుసుకో

News February 10, 2025

13 ఏళ్లుగా ఒకే ఒక్కడు.. రోహిత్ శర్మ

image

ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు వరుసగా POTM అవార్డు అందుకున్న ప్లేయర్‌గా నిలిచారు. 2013 నుంచి 2025 వరకు ఏటా కనీసం ఒక మ్యాచ్‌లో అయినా హిట్‌మ్యాన్ ఈ అవార్డు అందుకుంటున్నారు. నిన్న ఇంగ్లండ్‌పై 90 బంతుల్లో 119 రన్స్ చేసిన రోహిత్ విమర్శకులకు బ్యాట్‌తో సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.

News February 10, 2025

ప్రముఖ నటుడు కన్నుమూత

image

మలయాళ నటుడు అజిత్ విజయన్(57) కన్నుమూశారు. తన నివాసంలో మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒరు ఇండియన్ ప్రణయకథ, బెంగళూరు డేస్, అమర్ అక్బర్ అంథోని, అంజు సుందరికల్ తదితర సినిమాల్లో ఆయన నటించారు. ఆయన మృతిపై మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

News February 10, 2025

ఇండియా కూటమిలో ఉండాలా వద్దా: ఆప్‌ సందిగ్ధం

image

ఢిల్లీ ఓటమితో ఆమ్‌ఆద్మీ పార్టీలో నిస్తేజం నెలకొంది. ఒకవైపు పంజాబ్‌లో పార్టీ చీలిపోతుందేమోనని భయం. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, అవధ్ ఓజా, సత్యేందర్ జైన్ అడుగుపెట్టలేని పరిస్థితి. పార్టీని ఆతిశీ టేకోవర్ చేస్తారేమోనన్న ఆందోళన. వీటన్నిటి నడుమ ఇండియా కూటమిలో కొనసాగాలో లేదో తేల్చుకోలేని పరిస్థితిలో ఆప్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ఉన్న కూటమిని వీడొచ్చని వారి అంచనా.

News February 10, 2025

జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

YCP అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌(NCLT)లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మార్చి 6కు వాయిదా పడింది. ఆ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల తరఫు లాయర్లు సమయం కోరారు. సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను తనకు తెలియకుండా బదిలీ చేసుకున్నారని, అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News February 10, 2025

పెళ్లి చేసుకున్న నటి

image

మలయాళీ నటి పార్వతి నాయర్ పెళ్లి చేసుకున్నారు. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్‌ను ఆమె వివాహమాడారు. ఈ క్రమంలో ఆ జంటకు విషెస్ చెబుతూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పాపిన్స్, నిమిరిందు నిల్, ఎన్నై అరిందుల్(ఎంతవాడు గానీ), ఉత్తమ విలన్, ఓవర్ టేక్ వంటి సినిమాల్లో ఆమె నటించారు.

News February 10, 2025

స్కిల్ వర్సిటీకి నిధులివ్వలేం: కేంద్రం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీకి కేంద్రం షాక్ ఇచ్చింది. దానికి నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా INC MP చామల కిరణ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం పైవిధంగా సమాధానం ఇచ్చింది. రాష్ట్రాలు తమ చట్టాల ప్రకారం స్కిల్ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాయని, వీటికి నిధులిచ్చే పథకమేమీ కేంద్రం వద్ద లేదని మంత్రి జయంత్ చౌదరి తేల్చి చెప్పారు.

News February 10, 2025

కామెడీ షోలో బూతులు.. పోలీసులకు ఫిర్యాదు

image

కామెడీ షోలో అసభ్యంగా బూతులు మాట్లాడిన వారిపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా, ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వ మఖీజా, కమెడియన్ సమయ్ రైనా అనుచిత పదజాలాన్ని ఉపయోగించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. బూతులే కామెడీ అనుకుంటున్నారా? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.