news

News August 9, 2024

ఆగస్టు 9: చరిత్రలో ఈ రోజు

image

1910: పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య జననం
1945: జపాన్‌లోని నాగసాకి పట్టణంపై అమెరికా అణుబాంబు ప్రయోగించింది
1948: ప్రముఖ సైంటిస్ట్ యల్లాప్రగడ సుబ్బారావు మరణం
1965: సింగపూర్ స్వాతంత్ర్యం పొందింది
1975: సూపర్ స్టార్ మహేశ్ ‌బాబు జననం
✯ నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

News August 9, 2024

ఒలింపిక్స్‌లో రికార్డు బ్రేక్

image

పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్ ఉత్కంఠగా సాగుతోంది. పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ సంచలనం సృష్టించారు. ఫైనల్లో బల్లెం ఏకంగా 92.97m విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పారు. దీంతో 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నార్వే అథ్లెట్ ఆండ్రియాస్(90.57m) రికార్డును అధిగమించారు. మరోవైపు ఈ ఫైనల్లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా 89.45m విసిరారు.

News August 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 9, 2024

ఎన్ని రూ.కోట్లు ఇచ్చినా..!

image

పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ రేసు నుంచి డిస్‌క్వాలిఫై అయిన వినేశ్ ఫొగట్‌ హరియాణా ప్రభుత్వం రూ.4కోట్ల నజరానా ప్రకటించింది. ఆమె చదువుకున్న లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ రూ.25లక్షలు ఇస్తామని తెలిపింది. ఆమెపై గౌరవం, సానుభూతితో రివార్డులు ప్రకటిస్తున్నా.. మెడల్ సాధించలేకపోయాననే బాధే వినేశ్‌ను తొలిచేస్తోందేమో! ఎన్ని రూ.కోట్లు ఇచ్చినా ఒలింపిక్స్‌ పతకానికి సాటి రావు. సగటు క్రీడాకారుడి జీవితలక్ష్యమది.

News August 9, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఆగస్టు 9, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:41 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:58 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:45 గంటలకు
✒ ఇష: రాత్రి 8.02 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 9, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: ఆగస్టు 9, శుక్రవారం
✒ పంచమి: రాత్రి 3.14 గంటలకు
✒ హస్త: రాత్రి 2.44 గంటలకు
✒ వర్జ్యం: ఉదయం 9.04 గంటల నుంచి 10.53 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: 1.ఉదయం 08.23 నుంచి 09.14 గంటల వరకు
✒ 2.మధ్యాహ్నం 12.38 గంటల నుంచి 1.29 గంటల వరకు

News August 9, 2024

నేటి ముఖ్యాంశాలు

image

☞ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు
☞ ఇది తరాలపాటు గుర్తుండే విజయం: ప్రధాని మోదీ
☞ ఏపీలో జన్మభూమి కార్యక్రమాలు: TDP
☞ కర్ణాటకతో AP ప్రభుత్వం ఒప్పందాలు
☞ CM రేవంత్ US పర్యటనలో పెట్టుబడులపై ఒప్పందాలు
☞ TG: రేషన్ కార్డులపై సబ్ కమిటీ ఏర్పాటు
☞ కీలక వడ్డీరేట్లలో మార్పులు చేయని RBI
☞ JPCకి వక్ఫ్ చట్ట సవరణ బిల్లు
☞ రిటైర్మెంట్ ప్రకటించిన రెజ్లర్ వినేశ్ ఫొగట్

News August 9, 2024

ప్లేయర్లకు హాకీ ఇండియా నజరానా

image

పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన భారత టీమ్‌కు ‘హాకీ ఇండియా’ నజరానా ప్రకటించింది. ఒక్కో ప్లేయర్‌కు రూ.15 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.7.5 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. మరోవైపు జట్టులోని తమ రాష్ట్ర ప్లేయర్లకు రూ.కోటి చొప్పున బహుమతి ఇస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు.

News August 8, 2024

అలా చేస్తే అరగంటలోనే జైల్లో: రామ్ పోతినేని

image

‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో శంకర్ పాత్ర మెంటల్, మాస్, మ్యాడ్ నెస్‌తో ఉంటుందని హీరో రామ్ పోతినేని అన్నారు. ముంబైలో ‘బిగ్ బుల్’ పాట రిలీజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను శంకర్‌ను ప్రమోట్ చేయడం లేదని చెప్పారు. ఒకవేళ మీరు శంకర్‌లా ఉండాలని అనుకుంటే అరగంటలోనే జైల్లో ఉంటారని అభిమానులను ఉద్దేశించి అన్నారు. ఆ పాత్ర కేవలం స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయడానికే బాగుంటుందని తెలిపారు.

error: Content is protected !!