news

News February 11, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 11, 2025

శుభ ముహూర్తం (11-02-2025)

image

✒ తిథి: శుక్ల చతుర్దశి రా.7.00 వరకు
✒ నక్షత్రం: పుష్యమి సా.6.51 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.3.00 నుంచి సా.4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00 నుంచి ఉ.10.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: సా.4.29 నుంచి సా.6.05 వరకు

News February 11, 2025

1,036 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

రైల్వే మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి ఆర్ఆర్‌బీ దరఖాస్తు గడువును పొడిగించింది. వివిధ విభాగాల్లో మొత్తం 1,036 పోస్టులకు ఈ నెల 16 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్ సైట్: www.rrbapply.gov.in

News February 11, 2025

TODAY TOP STORIES

image

* ఏపీలో లిక్కర్ ధరలు పెంపు!
* ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక: రేవంత్
* 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్: చంద్రబాబు
* TGలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు
* రేవంత్ రాజీనామా చేసి రా: KTR సవాల్
* YCP టార్గెట్‌గా పృథ్వీ సెటైర్లు.. క్షమాపణ చెప్పిన విశ్వక్ ‌సేన్
* చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్ మాథ్యూ బ్రిట్జ్‌కే
* ప్రశాంతంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలి: మోదీ

News February 11, 2025

మీకూ గాఢ నిద్రలో ఇలా జరుగుతోందా?

image

కొందరు రాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏడుస్తుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇష్టమైనవారు చేజారిపోతున్నట్లు, మరణిస్తున్నట్లు కల వస్తే ఏడుస్తారు. జీవితంలో మానసిక దెబ్బలు తిన్నవారు కూడా అసంకల్పితంగా నిద్రలో ఏడుస్తుంటారు. అణిచిపోయిన భావోద్వేగాలతోనూ నిద్రలో ఏడ్చే అవకాశం ఉంది. బైపోలార్ డిజార్డర్, స్లీప్ ఆప్నియా, ఇన్సోమ్నియా, మూడ్ స్వింగ్స్ ఉన్నవారూ ఇలాగే ప్రవర్తిస్తారు.

News February 11, 2025

BIG BREAKING: బీర్ల ధరలు పెంపు

image

తెలంగాణలో మందుబాబులకు షాక్. బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఏపీలో రూ.99 మద్యం, బీర్ల ధరలు తప్ప మిగతా మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది.

News February 11, 2025

APSRTC ఉద్యోగులకు తీపికబురు

image

APSRTC ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2017 పీఆర్సీ బకాయిలో మరో 25 శాతం చెల్లింపునకు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దాదాపు రూ.60 కోట్ల మేర ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా ఇప్పటికే 50 శాతం బకాయిలు చెల్లించినట్లు ఆయన గతంలో వెల్లడించారు.

News February 11, 2025

మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

image

TG: రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 30,11,329 మంది రైతులకు ₹1,834.09 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 27న 577 ఎంపిక చేసిన గ్రామాల్లో 4.41 లక్షల మందికి, ఫిబ్రవరి 5న ఎకరం లోపు సాగు చేస్తున్న 17.03లక్షల మందికి, ఇవాళ 2 ఎకరాలలోపు సాగు చేస్తున్న 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసినట్లు తెలిపింది. మరి మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

News February 10, 2025

ALERT.. నోటిఫికేషన్ విడుదల

image

AP మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి జూనియర్ ఇంటర్, 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. FEB 15 నుంచి MAR 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 6, 7, 8, 9, తరగతుల్లో బ్యాక్ లాగ్ అడ్మిషన్లకు సైతం అప్లై చేయవచ్చు. జూనియర్ ఇంటర్‌కు ఏప్రిల్ 20, 5వ తరగతికి ఏప్రిల్ 27, బ్యాక్ లాగ్ క్లాసుల్లో చేరే వారికి ఏప్రిల్ 28న పరీక్ష ఉంటుంది.

News February 10, 2025

మస్తాన్ సాయి కస్టడీకి కోర్టు అనుమతి

image

TG: మహిళల వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న కేసులో అరెస్టైన మస్తాన్ సాయి పోలీస్ కస్టడీకి రాజేంద్రనగర్ కోర్టు అనుమతించింది. 5 రోజుల కస్టడీకి నార్సింగి పోలీసులు అనుమతి కోరగా, 2 రోజులకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ నెల 13న మస్తాన్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.