news

News August 4, 2024

రాయన్ మూవీ కలెక్షన్లు ఎంతంటే?

image

ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు చేసింది. ఒక్క భారత్‌లోనే రూ.72.75 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గతంలో ధనుష్ నటించిన ‘తిరు’, ‘సార్’ సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి. ప్రస్తుతం రాయన్ ఇదే జోరును కొనసాగిస్తే ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచే అవకాశముంది.

News August 4, 2024

ఆగస్టు 4: చరిత్రలో ఈరోజు

image

1755 : పెన్సిల్ కనిపెట్టిన నికోలస్ జాక్వె కోంటె జననం
1929 : హిందీ సినీ గాయకుడు కిషోర్ కుమార్ జననం
1948 : భారత రాజకీయ నాయకుడు శత్రుచర్ల విజయరామరాజు జననం
1961 : అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా జననం
1965 : డైరెక్టర్, రచయిత, సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్ జననం

News August 4, 2024

ఒలింపిక్స్‌: భారత్‌కు నిరాశ

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. పురుషుల బాక్సింగ్ 71 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచులో నిశాంత్ దేవ్ ఓటమి పాలయ్యారు. మెక్సికో ప్లేయర్ మార్కో అల్వరెజ్ చేతిలో 4-1 తేడాతో పరాజయం చెందారు. అంతకుముందు మహిళల విభాగంలో నిఖత్ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఓటమితో బాక్సింగ్‌లో పతకంపై భారత్ ఆశలు లవ్లీనా ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయి.
<<-se>>#Olympics2024<<>>

News August 4, 2024

విశాఖ రైల్వేజోన్‌కే మా తొలి ప్రాధాన్యత: కేంద్ర మంత్రి

image

AP: విశాఖ రైల్వేజోన్‌ తమ తొలి ప్రాధాన్యత అంశమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గతంలోనే నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. కేంద్రం అడిగిన భూమిని సేకరించడంలో గత ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. దీంతో ఈ అంశం అక్కడే నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం కేంద్రం అడిగిన భూమిని సేకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

News August 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 4, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఆగస్టు 4, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:39 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:56 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:50 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:48 గంటలకు
✒ ఇష: రాత్రి 8.05 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 4, 2024

ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది: ఈటల

image

TG: 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులతో అడ్డదారిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కాక రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని BJP MP ఈటల రాజేందర్ ఆరోపించారు. శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన BJP కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయన్నారు.

News August 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 4, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: ఆగస్టు 4, ఆదివారం
✒ అమావాస్య: సాయంత్రం 4.42 గంటలకు
✒ పుష్యమి: మధ్యాహ్నం 1.26 గంటలకు
✒ వర్జ్యం: తెల్లవారుజాము 3.15 నుంచి 4.59 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: సాయంత్రం 4.54 నుంచి 5.45 గంటల వరకు

News August 4, 2024

TODAY HEADLINES

image

* భూ కబ్జాదారులపై కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
* నాట్యమయూరి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
* కౌలు రైతులకు బ్యాంకు రుణాలు: మంత్రి అచ్చెన్నాయుడు
* అమెరికా పర్యటనకు TG CM రేవంత్
* మహిళలకు రూ.20వేల కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి
* రాబోయే రోజుల్లో రేవంత్‌ సీట్లో సీఎంగా KTR: సబిత
* ఒలింపిక్స్‌: 25m పిస్టల్ ఈవెంట్‌లో మనూ భాకర్ ఓటమి
* ఈనెల 21న భారత్‌ బంద్‌కు బహుజన సంఘాల పిలుపు