India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎస్బీఐ ఖాతాదారులకు రివార్డ్స్ పాయింట్స్ పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు అకౌంట్‌కు రివార్డ్స్ పాయింట్స్ వచ్చాయని, వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఓ APK ఫైల్ పంపిస్తున్నారు. ఇది ఫేక్ మెసేజ్ అని, ఎస్బీఐ ఇలాంటి APK ఫైల్స్‌ను వాట్సాప్/SMSలలో పంపదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించింది.
ఒలింపిక్స్‌లో ఓటమి తర్వాత బాక్సర్ నిఖత్ జరీన్ ’X‘లో భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న నా ఒలింపిక్ కల ఆశించినట్లుగా ముగియలేదు. ఎన్నో రోజుల శిక్షణ ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. ఓటమిని భరించలేకపోతున్నా. కానీ దీనిని అంగీకరించాల్సిందే. ఒలింపిక్ పతకం కోసం శ్రమించినా విధి మరోలా చేసింది. మరింత కష్టపడి మీ అందరినీ గర్వపడేలా చేస్తా. సపోర్ట్ చేసిన వారికి థాంక్స్’ అని ట్వీట్ చేశారు.
AP: ప్రముఖ క్లాసికల్ డాన్సర్ యామినీ కృష్ణమూర్తి (84) మరణంపై CM చంద్రబాబు సంతాపం తెలిపారు. ‘దేశం గర్వించదగ్గ నృత్యకారిణి ఇక లేరని తెలిసి తీవ్రమైన ఆవేదన చెందాను. మదనపల్లెలో జన్మించిన ఆమె టీటీడీ ఆస్థాన నర్తకిగా పని చేశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టారు. ఆమె లేని లోటు నృత్య కళారంగంలో ఎవరూ తీర్చలేరు’ అని ట్వీట్ చేశారు.
AP: మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అతిత్వరలోనే దీనిపై శుభవార్త చెప్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వీర్యమైందని అన్నారు. చిత్తూరు ఆర్టీసీ బస్ డిపోలో 17 నూతన బస్సులను ఆయన ఇవాళ ప్రారంభించారు.
నిన్న గెలవాల్సిన మ్యాచ్ టై కావడంతో అర్ష్‌దీప్ సింగ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ధోనీ స్టైల్‌లో ఫినిష్ చేసేందుకు వచ్చి, టై చేశారని కామెంట్స్ చేస్తున్నారు. బాల్స్ ఉన్నప్పటికీ అనవసర షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నారని విమర్శిస్తున్నారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ.. అర్ష్‌దీప్ సింగ్‌పై కోప్పడినట్లు తెలుస్తోంది. పై ఫొటో చూసి, రోహిత్ ఏమని ఉంటారో కామెంట్ చేయండి.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్ జోడీ సాత్విక్-చిరాగ్ ఓడిపోయి పతకం లేకుండానే వెనుదిరిగింది. దీంతో వారికి కోచ్‌గా వ్యవహరించిన మథియాస్ బో(హీరోయిన్ తాప్సీ భర్త) బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడా కోచ్‌గా ఉండబోనని స్పష్టం చేశారు. తనకు అవకాశం ఇచ్చిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఓడినా ఆత్మవిశ్వాసంతో ఆడిన చిరాగ్, సాత్విక్‌ను ప్రశంసించారు.
AP: అల్లూరి, ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, YSR జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
TG: BRSను తిట్టడం తప్ప CM రేవంత్ ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పడం లేదని BJP MLA వెంకట రమణారెడ్డి విమర్శించారు. రేవంత్ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఆయన హితవు పలికారు. బ్లాక్ టికెట్లు అమ్మేవారు కూడా బాగా మాట్లాడుతారని, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడటం బాధాకరమన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు.
భారతదేశ క్రీడాకారులు మనూ భాకర్, సరబ్జోత్ సింగ్ పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ పోటీల్లో కాంస్య పతకాన్ని గెలిచిన విషయం తెలిసిందే. అయితే, వీరు షూట్ చేసే టార్గెట్ సైజ్ ఎంత చిన్నగా ఉంటుందో తెలుసా? కేవలం రెండు ఇంచులే ఉండే టార్గెట్ సైజ్ పేపర్ ఫొటో వైరలవుతోంది. షాట్ పేపర్ మధ్యలోని చుక్కను తాకితే 10 పాయింట్లు. రైఫిల్‌కు సాధ్యమయ్యే అత్యధిక స్కోరు 654 అయితే పిస్టల్‌కు 600 మాత్రమే.
TG: హీరా గోల్డ్ కుంభకోణంలో నిందితురాలు నౌహీరా షేక్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బంజారాహిల్స్‌లోని సంస్థతో పాటు నౌహీరా షేక్ ఇంట్లో ED సోదాలు చేపట్టింది. టోలీచౌకిలోని ఆమె ప్లాట్లను స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు మొత్తం ₹380కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే 36% లాభాలు వస్తాయని చెప్పి సామాన్యుల నుంచి ₹వేలకోట్లు వసూలు చేసి, ఆ నిధులు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.
Sorry, no posts matched your criteria.