news

News March 1, 2025

పాపం ఇంగ్లండ్: 17 మ్యాచ్‌లలో ఓటమి.. ఒక్కటే గెలుపు

image

ఇంగ్లండ్ మెన్స్, ఉమెన్స్ క్రికెట్ జట్లు టెస్టు, వన్డే, టీ20ల్లో ఓటముల పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది బట్లర్ సేన వరుసగా 8 సహా 10 మ్యాచ్‌లు ఓడిపోయింది. కేవలం ఒక్కదాంట్లోనే గెలిచింది. CT గ్రూప్ స్టేజీలో 3 మ్యాచుల్లోనూ ఓడిన తొలి జట్టుగానూ అపఖ్యాతి మూటగట్టుకుంది. మహిళల జట్టు కూడా వరుసగా ఏడు గేమ్స్ ఓడింది. ఈ ఏడాది ఇప్పటికీ గెలుపు ఖాతా తెరవలేదు. దీంతో ఆ దేశ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News March 1, 2025

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్

image

ఐపీఎల్ తరహాలో రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్(TPL) రానుంది. జూన్‌లో ఈ లీగ్‌ను ప్రారంభిస్తామని HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో క్రికెట్ సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు సహకారం ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు పేర్కొన్నారు. ఈ లీగ్ అందుబాటులోకి వస్తే టీమ్స్‌కు ఏ పేర్లు పెడితే బాగుంటాయో కామెంట్ చేయండి?

News March 1, 2025

ఇంగ్లండ్‌కు నిరాశ.. సౌతాఫ్రికా విజయం

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచులో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని 29.1 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో డస్సెన్ (72), క్లాసన్ (64) రాణించారు. ఇప్పటికే సౌతాఫ్రికాకు సెమీస్ బెర్తు ఖరారు కాగా, ఇంగ్లండ్ ఒక్క విజయం కూడా లేకుండానే నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

News March 1, 2025

ఫార్మాసిటీలో ప్రమాదం.. విషవాయువులు లీక్

image

AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఏక్టోరియా యూనిట్-6లో ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువులు పీల్చి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతడిని వెంటనే గాజువాకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విష వాయువులు లీకవడంతో వాటిని అదుపు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 1, 2025

సంక్రాంతికి వస్తున్నాం OTTలో చిన్న ట్విస్ట్!

image

ఇవాళ OTTలోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రన్ టైమ్ తగ్గింది. థియేటర్‌లో 2గం. 24ని.లు స్క్రీన్ అయిన ఈ సినిమా జీ5లో 2గం. 16 ని.లే అందుబాటులో ఉంది. రన్ టైమ్ కారణంగా థియేటర్ వెర్షన్‌లో కట్ చేసిన కొన్ని సీన్లను OTTలో యాడ్ చేస్తారని ప్రచారం జరిగింది. తీరా చూస్తే కొసరు మాట పక్కనబెడితే అసలుకే కత్తెరేశారు. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది.

News March 1, 2025

ముదిరిన వివాదం.. 22న కర్ణాటక బంద్

image

మహారాష్ట్రలో KSRTC సిబ్బందిపై దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో వివాదం ముదిరింది. దాడులకు నిరసనగా ఈ నెల 22న కన్నడ సంఘాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నెల 7న ఛలో బెళగావి, 11న అత్తిబెలె సరిహద్దు బంద్, 16న హోస్కెట్ టోల్ బంద్ చేస్తామని ప్రకటించాయి. త్వరలో బెంగళూరులో భారీ ర్యాలీ చేస్తామని తెలిపాయి. మరాఠీలో మాట్లాడలేదనే కారణంతో KSRTC సిబ్బందిపై పలువురు దాడి చేసిన విషయం తెలిసిందే.

News March 1, 2025

కేరళలో వరుస హత్యలు.. కారణమిదే!

image

కేరళలో ప్రేయసితో సహా నలుగురు కుటుంబ సభ్యులను <<15571171>>దారుణంగా హత్య<<>> చేసిన ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రూ.65 లక్షల అప్పు ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిందితుడు అఫాన్ భావించినట్లు పోలీసులకు వెల్లడించాడు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వారిని హత్య చేశానని పేర్కొన్నారు. తాను చనిపోతే ప్రియురాలు ఒంటరి అవుతుందని ఆమెను చంపినట్లు విచారణలో వెల్లడించారు.

News March 1, 2025

రెండు రోజులు సెలవులు

image

AP: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ శుభవార్త చెప్పారు. వారు ఆటల పోటీల్లో పాల్గొనేందుకు వీలుగా 5, 6 తేదీలలో స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. మిగతా జిల్లాల్లోనూ సెలవులు ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు.

News March 1, 2025

ఇది ప్రభుత్వం కాదు సర్కస్: KTR

image

TG: SLBC ఘటనపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా ప్రకటన చేస్తున్నారని KTR మండిపడ్డారు. 8 మంది కార్మికుల ఆచూకీపై అధికారిక ప్రకటన చేయాలని CM రేవంత్‌ను డిమాండ్ చేశారు. ‘మృతదేహాలను గుర్తించామని ఒకరు, PM సంతాపం తెలపలేదని మరో MLA అంటున్నారు. ఇది సర్కస్‌లా ఉంది. కనీసం ఒక్కరైనా బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు. ఇదేనా మీరు కార్మికులకు ఇచ్చే గౌరవం? ఇదేనా మీ ప్రభుత్వంలో ప్రాణాలకుండే విలువ?’ అని ప్రశ్నించారు.

News March 1, 2025

విడాకుల వార్తలపై నటుడి భార్య స్పందనిదే

image

ప్రముఖ నటుడు, రాజకీయ నేత గోవిందాతో <<15584416>>విడాకుల<<>> వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎవరూ విడదీయలేరని, అలాంటి వారు ఎవరైనా ఉంటే తన ముందుకు రావాలన్నారు. ‘పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. మేం ఇంట్లో ఉంటే షార్టులు ధరించి తిరుగుతుంటాం. గోవిందా రాజకీయాల్లో ఉండటంతో ప్రముఖులు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఆయన మరో చోట అపార్ట్‌మెంట్ తీసుకుని ఉంటున్నారు’ అని చెప్పారు.