India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సీఎం రేవంత్ రెడ్డిపై రెండు అంశాల మీద అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కు బీఆర్ఎస్ శాసనసభా పక్షం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందించింది. విద్యుత్ మీటర్లపై సభను తప్పుదోవ పట్టించారని, మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడారని పేర్కొంది. ఈ అంశాలపై సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
TG: రాష్ట్రంలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క జులైలోనే 800 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 2,071 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేసింది. HYD, RR, మేడ్చల్, సంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో లారా వ్యాప్తి ఎక్కువగా ఉందని ప్రకటించింది. దోమల వ్యాప్తి జరగకుండా అన్ని జిల్లాల్లో అధికారులు చర్యలు చేపట్టారు.
యూజర్లు BSNL సిమ్‌లను 4Gకి అప్‌గ్రేడ్ చేసుకోవాలని యాజమాన్యం సూచించింది. దశలవారీగా 4Gని ప్రవేశపెట్టినప్పటికీ కొందరు 2G, 3G సిమ్‌లే వాడుతున్నారని తెలిపింది. దీనివల్ల వారికి నెట్‌వర్క్ సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. సమీపంలోని BSNL ఆఫీస్/ రిటైలర్ వద్ద ID ప్రూఫ్స్ ఇచ్చి ఫ్రీగా కొత్త సిమ్‌లను తీసుకోవచ్చు. మీరు ఉపయోగించే సిమ్ టైప్ తెలుసుకోవడానికి ఫోన్ నుంచి ‘SIM’ అని 54040 నంబర్‌కు మెసేజ్ చేయాలి.
TG: నిజాం పాలన ముగిసిన అనంతరం ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివిధ రెవెన్యూ చట్టాల వల్ల ముస్లింలే ఎక్కువగా నష్టపోయారని అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్‌లో ఇప్పుడున్న ఐఎస్‌బీ, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల భవనాలన్నింటినీ వక్ఫ్ బోర్డు స్థలాల్లోనే కట్టారు. ఐటీ పార్కు కోసం ల్యాంకో సంస్థకు భూమి ఇస్తే అందులో ఇళ్లు నిర్మించింది. చంచల్‌గూడ జైల్లోనూ 30 ఎకరాల భూమి వక్ఫ్‌దే’ అని పేర్కొన్నారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామున అమెరికాకు బయలుదేరారు. ఆయన వెంట ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి సహా పలువురు అధికారులు ఉన్నారు. పెట్టుబడుల నిమిత్తం న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు. అక్కడి నుంచి రెండు రోజుల పర్యటనకు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు వెళ్లి తిరిగి ఈ నెల 14న రాష్ట్రానికి రానున్నారు.
AP: అమరావతిలో టీడీపీ తొలి సర్కారు ప్రారంభించిన భవనాల నిర్మాణం వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత నిలిచిపోయిన సంగతి తెలిసిందే. IIT-H నిపుణులు తాజాగా వాటిని పరిశీలించారు. భవన పటిష్ఠతలో కీలకమైన ఇనుప చువ్వలు తీవ్రంగా తుప్పుపట్టాయని తెలిపారు. వాటిని తొలగించిన లేదా శుభ్రం చేసిన తర్వాతే భవనాల సామర్థ్యంపై ఓ అంచనాకు రాగలమన్నారు. సమగ్ర అధ్యయనం చేసి త్వరలోనే నివేదిక సమర్పిస్తామని స్పష్టం చేశారు.
APలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీంతో రేషన్ షాపుల్లో మరిన్ని సరకులు తక్కువ ధరకు అమ్మాలని CM సూచించారు. TDP హయాంలో రేషన్‌లో ఇచ్చిన సరకులను మళ్లీ పునరుద్ధరించాలని చెప్పారు. వ్యవసాయ, సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
AP: SC వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్‌లో వెంటనే అమలుచేయాలని MRPS రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బ్యాక్‌లాగ్ పోస్టుల్ని భర్తీ చేయాలని ఆయన కోరారు. 15శాతం ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగ అనుబంధ ఉపకులాలకు 7శాతం, మాల అనుబంధ ఉపకులాలకు 6శాతం, రెల్లి వర్గాలకు 1శాతం, ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ, ఇతర అనుబంధ కులాలకు 1శాతం ఇచ్చేలా వర్గీకరణ అమలుచేయాలని కోరారు.
AP: తిరుమల శ్రీవారిని జులైలో 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో శ్యామలరావు తెలిపారు. హుండీ ఆదాయం రూ.125 కోట్లు లభించిందన్నారు. అలాగే 1.04 కోట్ల లడ్డూలను విక్రయించామన్నారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఆగస్టు 15-17 మధ్య పవిత్రోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు.
TG: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో కలిసి నేడు అమెరికాకు బయలుదేరనున్నారు. రేపు మంత్రి శ్రీధర్, 5న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా USకు వెళ్తారు. 10వ తేదీ వరకు అక్కడ వివిధ రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల యజమానులతో సమావేశమవుతారు. 11 నుంచి 13 వరకు సౌత్ కొరియాలో పర్యటించి హ్యుందాయ్, సామ్‌సంగ్, ఎల్జీ తదితర సంస్థల ప్రతినిధులతో చర్చిస్తారు.
Sorry, no posts matched your criteria.