India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ తేది: ఆగస్టు 3, శనివారం
✒ చతుర్దశి: మధ్యాహ్నం 3.50 గంటలకు
✒ పునర్వసు: ఉదయం 11.58 గంటలకు
✒ వర్జ్యం: రాత్రి 8.27 నుంచి 10.09 వరకు
✒ రాహుకాలం: ఉదయం 9.00 నుంచి 10.30 వరకు
➦TG: టీచర్ల చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు: సీఎం రేవంత్
➦TG:అసెంబ్లీలో దానం నాగేందర్ బూతులు.. BRS ఆగ్రహం
➦నిరుద్యోగులను రెచ్చగొట్టి గెలిచారు: కేటీఆర్
➦TG:ఉద్యోగ నియామకాల క్యాలెండర్ విడుదల
➦AP: ఎక్సైజ్ శాఖలో అక్రమాలపై సీఐడీ విచారణకు చంద్రబాబు ఆదేశం
➦AP: రాజధాని రైతులకు కౌలు, పెన్షన్ మరో ఐదేళ్లు పొడిగింపు
➦ఆరోగ్య శ్రీ కొనసాగుతుంది: మంత్రి సత్యకుమార్
➦భారత్- శ్రీలంక తొలి వన్డే మ్యాచ్ టై
పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు ఈరోజు అదరగొట్టారు. మన పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి 52ఏళ్ల చరిత్రను తిరగరాసింది. షూటింగ్‌లో మనూ భాకర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. తాజాగా యంగ్ షట్లర్ లక్ష్యసేన్ బ్యాడ్మింటన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిచి సెమీఫైనల్స్‌కు చేరారు. దీంతో మరో 3 పతకాలపై ఆశలు చిగురించాయి. అయితే ఆర్చరీలో బ్రాంజ్ మెడల్ పోరులో ధీరజ్-అంకిత జోడీ ఓడి నిరాశపర్చింది. <<-se>>#Olympics2024<<>>
స్ట్రాబెర్రీలను ఇష్టంగా తినే చాలామంది వాటిపైన ఉండే సీడ్స్‌తో కాస్త ఇబ్బంది ఫీలవుతుంటారు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే అవి సీడ్స్ కావని, వాస్తవానికి అవన్నీ పండ్లు అని పరిశోధకులు తెలిపారు. అకీన్స్ అనే పిలిచే వీటి లోపలే విత్తనాలుంటాయి. అంటే ఒక స్ట్రాబెర్రీ తింటే వందల ఫ్రూట్స్ తిన్నట్లు. ఈ అకీన్స్‌ను కలిపి ఆధారంగా ఉండేదే ఎర్రటి కండ భాగం. దీని సైజ్ పెరిగినా అకీన్స్ మాత్రం దాదాపు సమాన పరిమాణంలోనే ఉంటాయి.
వయనాడ్(కేరళ) బాధితులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వాలంటీర్లు అండగా నిలుస్తున్నారు. ఘటనా స్థలంలోనే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ సిబ్బందితో కలిసి అక్కడికి కొట్టుకొచ్చిన చెట్లు, రాళ్లు, బురదను తొలగిస్తున్నారు. సర్వస్వం కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.
టీ20 మ్యాచ్ <<13764423>>టై<<>> అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం కచ్చితంగా సూపర్ ఓవర్ నిర్వహించాలి. కానీ వన్డేల్లో ఆ రూల్ లేదు. సూపర్ ఓవర్ అనేది ఆట పరిస్థితులు, మ్యాచ్ టైమింగ్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే నాకౌట్ మ్యాచుల్లో మాత్రమే సూపర్ ఓవర్ నిర్వహిస్తున్నారు. అయితే 2020లో జింబాబ్వే-పాకిస్థాన్ వన్డేలో ఒకే ఒకసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. ప్లేయింగ్ కండిషన్లను బట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు.
AP: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య విజ్ఞప్తి చేసింది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు నిర్దేశించిన సమయంలో మాత్రమే క్యూ లైన్లలోకి రావాలని సూచించింది. కేటాయించిన సమయం కంటే ముందుగా వచ్చిన వారిని క్యూ లైన్లలోకి అనుమతించరని తెలిపింది. భక్తులు గమనించి సహకరించాలని కోరింది.
రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని RJ శేఖర్ బాషా, ప్రీతి హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్యతో తమకు మూడేళ్లుగా పరిచయం ఉందని, డ్రగ్స్ విషయంలో ఇప్పటికీ కాల్స్ చేస్తూ ఇబ్బందులు పెడుతోందని తెలిపారు. కాగా, ప్రీతి ఆరోపణలను లావణ్య ఖండించారు. ఆమెకే డ్రగ్స్, గంజాయి అలవాటు ఉందని చెప్పారు.
AP: ఆరోగ్య శ్రీ తొలగిస్తామంటూ YCP అసత్య ప్రచారాలు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం కొనసాగుతుందని, తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం ఆస్పత్రులకు రూ.2100 కోట్ల బకాయిలు పెట్టిన మాట వాస్తవమా? కాదా? YCP నేతలు చెప్పాలని నిలదీశారు. కేంద్రం 17 వైద్యకళాశాలలను 2020లో ప్రకటిస్తే వాటిని పూర్తి చేయలేని అసమర్థుడు జగన్ అని మండిపడ్డారు.
TG: ఈ ఏడాది వినాయక చవితికి ప్రతిష్ఠించబోయే మహాగణపతి విగ్రహ నమూనాను ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు విడుదల చేశారు. 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి గణేషుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కుడి వైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివ పార్వతుల కళ్యాణ ఘట్టాలను ఏర్పాటు చేయనున్నారు. గణేశుడి విగ్రహం వద్ద అయోధ్య బాలరాముడు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.
Sorry, no posts matched your criteria.