news

News August 2, 2024

బంగ్లాలో వాట్సాప్, ఇన్‌స్టా, యూట్యూబ్ బ్యాన్!

image

బంగ్లాదేశ్ ప్రభుత్వం వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌, టిక్‌టాక్‌పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 12.15గంటలకు ఈ యాప్స్ పని చేయడం మానేసినట్లు సమాచారం. అయితే ఎందుకు బ్యాన్ చేసిందనే కారణాలు తెలియాల్సి ఉంది.

News August 2, 2024

సూపర్ ఓవర్ ఉంటుందా? లేదా?

image

భారత్-శ్రీలంక తొలి వన్డే టైగా ముగియడంతో సూపర్ ఓవర్ ఉంటుందా? ఉండదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇవాళ సూపర్ ఓవర్ ఉండదని అంపైర్లు ప్రకటించారు. కాగా, భారత్-శ్రీలంక మూడో టీ20 కూడా టై అయింది. అప్పుడు సూపర్ ఓవర్ ద్వారా భారత్ విజేతగా నిలిచింది. కానీ ఈ మ్యాచులో సూపర్ ఓవర్ నిర్వహించలేదు.

News August 2, 2024

BREAKING: భారత్VSశ్రీలంక మ్యాచ్ టై

image

శ్రీలంక, భారత్ మధ్య జరిగిన తొలి వన్డే టై అయ్యింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేయగా భారత్ కూడా అదే స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ ‌శర్మ(58) హాఫ్ సెంచరీతో రాణించారు. అక్షర్ పటేల్(33), కెఎల్.రాహుల్(31), శివం దూబే(25), కోహ్లీ(24), అయ్యర్(23) ఫరవాలేదనిపించారు. 47.5 ఓవర్లలో 230 రన్స్ చేసిన భారత్ ఆలౌటైంది. కాగా వన్డే క్రికెట్ చరిత్రలో ఇది 44వ టై మ్యాచ్.

News August 2, 2024

ఉత్కంఠ.. భారత్ గెలుస్తుందా?

image

భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ దూకుడుగా ప్రారంభించిన టీమ్ ఇండియా వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. టీమ్ ఇండియా గెలవాలంటే 42 బంతుల్లో 26 రన్స్ కావాలి. మరో 3 వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ స్కోర్ 42 ఓవర్లలో 205/7. మరి ఈ మ్యాచులో భారత్ గెలుస్తుందా? కామెంట్ చేయండి.

News August 2, 2024

ఆర్-5 జోన్‌పై న్యాయ పరిశీలన చేస్తున్నాం: నారాయణ

image

AP: అమరావతిలో వివాదాస్పదమైన ఆర్-5 జోన్‌పై సీఎం చంద్రబాబుతో జరిగిన సమీక్షా సమావేశంలో చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, న్యాయ పరిశీలన తర్వాత ఆర్-5 జోన్‌పై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కాగా అమరావతిలో R-5 జోన్ ఏర్పాటు చేసిన గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 50 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించింది. స్థానికేతరులకు స్థలాలివ్వడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు.

News August 2, 2024

90 దేశాల కంటే ఒక్కడు సాధించిన మెడల్స్ ఎక్కువ

image

అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫిల్ప్స్ ఒలింపిక్స్‌లో 28 మెడల్స్ సాధించారు. ఇందులో 23 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అతడి కంటే 90 దేశాలు తక్కువ పతకాలు సాధించాయి. అందులో ముఖ్యమైన 5 దేశాలు ఇవే: నైజీరియా (27), సెర్బియా (25), ట్రినిడాడ్ అండ్ టొబాగో (19), ఇజ్రాయెల్ (15), పాకిస్థాన్ (10).
<<-se>>#Olympics2024<<>>

News August 2, 2024

దానం మాట్లాడితే తప్పేం ఉంది?: CM రేవంత్

image

TG: 30ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న MLA దానం సభలో మాట్లాడితే తప్పేంటని CM రేవంత్ ప్రశ్నించారు. HYDలోని ప్రతి సమస్యా తెలిసిన వ్యక్తిని మాట్లాడవద్దనే అధికారం ప్రతిపక్షానికి లేదన్నారు. గతంలో కోమటిరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు చేసినట్లు తాము చేయలేమా? అన్నారు. అరడజను మందిని సస్పెండ్ చేస్తేనే బుద్ధి వస్తుందన్నారు. పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వెళ్లిన దానంకు మైక్ ఇవ్వడాన్ని BRS వ్యతిరేకించింది.

News August 2, 2024

ఇండో- US స్పేస్ మిషన్‌కు ప్రధాన వ్యోమగామి ఎంపిక

image

ఇండో-యూఎస్ సంయుక్తంగా చేపడుతున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ మిషన్‌కు ప్రధాన వ్యోమగామిగా శుభాన్షు శుక్లాను ఇస్రో ఎంపిక చేసింది. ఈయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో 1985లో జన్మించారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్‌‌లో ఫైటర్ కాంబాట్ లీడర్‌, పైలట్‌గా పని చేస్తున్నారు. అలాగే బ్యాక్ అప్ ఆస్ట్రొనాట్‌గా కేరళకు చెందిన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను ఇస్రో ఎంపిక చేసింది.

News August 2, 2024

మద్యంపై CM చంద్రబాబు కీలక ఆదేశాలు

image

AP: గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుందని మండిపడ్డారు. సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తామని CM వెల్లడించారు.

News August 2, 2024

వయనాడ్ విపత్తు: సైంటిస్టులు మాట్లాడొద్దన్న ‘కేరళ ఆర్డర్’ వెనక్కి

image

వయనాడ్ విపత్తుపై సైంటిస్టులు మాట్లాడకుండా, పరిశోధనలు చేయకుండా తీసుకొచ్చిన ఆర్డర్‌ను కేరళ సర్కారు వెనక్కి తీసుకుంది. విమర్శలకు తలొగ్గింది. ‘సైంటిఫిక్ కమ్యూనిటీ స్టడీస్ అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు. మీరు అభిప్రాయాలు చెప్పొద్దనే ఈ నిర్ణయం. ఈ సమస్యాత్మక సందర్భంలో మీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటే ప్రజలు భయపడొచ్చు’ అని ఆగస్టు 1న CS వేణు అన్నారు. కాగా ఈ విపత్తులో మానవ తప్పిదం ఉందని కొందరి వాదన.