India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: వీధి కుక్కల దారుణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని వానితాళ్ల గ్రామంలో ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిని వీధికుక్కలు చంపి పలు భాగాలను తినేశాయి. పక్క ఇంట్లోనే ఉంటున్న కుమారులు వచ్చి చూసేసరికి ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. ఊళ్లో కుక్కల నోళ్లకు రక్తం ఉండటాన్ని వారు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
AP: ఇవాళ రాజధాని అమరావతికి ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్ నిపుణులు రానున్నారు. రెండు రోజుల పాటు వారు అమరావతి కట్టడాలను పరిశీలించనున్నారు. పునాదుల దశలో అసంపూర్తిగా ఉన్న భవనాల స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. సచివాలయం, హైకోర్టు భవనాలు, ఐఏఎస్, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాల నాణ్యతను అంచనా వేయనున్నారు. పరిశీలన అనంతరం నిపుణుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది.
TG: మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ నెలకొంది. దీంతో డబ్బు చెల్లించి టికెట్లు కొనేవారు సీటు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికై త్వరలో 300 సెమీడీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని TGSRTC నిర్ణయించింది. వీటిలో ఎక్స్‌ప్రెస్ కంటే 5-6% ఎక్కువ, డీలక్స్ కంటే 4% తక్కువగా ధరలు ఉంటాయి. ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే సీట్లూ ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో మహిళలకు ఉచితం కాదు.
తనపై ఈడీ దాడులు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇటీవల లోక్‌సభలో తాను మాట్లాడిన ‘చక్రవ్యూహం’ స్పీచ్ కొంతమందికి నచ్చలేదన్నారు. రైడ్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఈడీలో ఉన్న కొందరు చెప్పినట్లు తెలిపారు. ‘ఈడీని సాదరంగా ఆహ్వానిస్తున్నా. మీకోసం చాయ్, బిస్కట్లు సిద్ధంగా ఉన్నాయి’ అని రాహుల్ రాసుకొచ్చారు.
ఇప్పటికే 2పతకాలు సాధించిన మను భాకర్ ఇవాళ జరిగే ఉమెన్స్ 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్ ఈవెంట్లో పాల్గొంటారు. ఆమెతో పాటు ఈషా సింగ్ బరిలో ఉన్నారు. బ్యాడ్మింటన్ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్, మెన్స్ షూటింగ్‌లో అనంత్‌జీత్ పోటీ పడనున్నారు. ఆర్చరీ మిక్స్‌డ్-ధీరజ్, అంకిత, రోయింగ్ ఫైనల్-బల్‌రాజ్, షాట్‌పుట్-తజిందర్‌పాల్ బరిలో ఉన్నారు. మెన్స్ హాకీ టీమ్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. పూర్తి షెడ్యూల్ పైన ఫొటోల్లో..
పారిస్ ఒలింపిక్స్‌లో నిన్న భారత్‌కు కష్టంగా గడిచింది. ముఖ్యంగా తెలుగు ప్లేయర్లు దాదాపు రేసు నుంచి నిష్క్రమించారు. బ్యాడ్మింటన్‌లో PV సింధు, సాత్విక్-చిరాగ్, ప్రణయ్, బాక్సింగ్‌లో నిఖత్ జరీన్ ఓటమి చవిచూశారు. ఇక షూటింగ్‌లో సిఫ్త్ కౌర్, అంజుమ్ ఎలిమినేట్ అయ్యారు. 20Km నడకలో ప్రియాంక గోస్వామి తదుపరి దశకు చేరుకోలేకపోయారు. అయితే షూటింగ్ విభాగంలోనే స్వప్నిల్ బ్రాంజ్ గెలవడం కాస్త ఊరటనిచ్చింది.
AP: రాష్ట్రంలోని 35 ఇంజినీరింగ్ కాలేజీల్లో తొలిసారి ప్రవేశపెట్టిన బీబీఏ, బీసీఏ డిగ్రీ కోర్సుల కనీస ఫీజును రూ.18వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25, 2025-26కు ఈ ఫీజులు వర్తిస్తాయని ఉత్తర్వులిచ్చింది. మరోవైపు నిన్నటి నుంచి డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఆప్షన్ల ఎంపికకు 5వ తేదీ వరకు ఛాన్స్ ఉంటుంది. 10న సీట్లు కేటాయించి, 12 నుంచి క్లాసులు ప్రారంభిస్తారు.
AP: YCP నేత లక్ష్మీపార్వతికి గతంలో కేటాయించిన ఆంధ్ర యూనివర్సిటీ ‘గౌరవ ఆచార్యురాలు’ హోదా ఉపసంహరించుకుంటున్నట్లు వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ కిశోర్ బాబు తెలిపారు. ఆమెకు వర్సిటీలో పరిశోధకులకు మార్గదర్శకం అందించే బాధ్యతను కేటాయించారు. తాజాగా దానిని తెలుగు విభాగంలో మరొకరికి అప్పగించినట్లు వెల్లడించారు. లక్ష్మీపార్వతికి ఇప్పటివరకు వర్సిటీ నుంచి జీతం చెల్లించలేదని స్పష్టం చేశారు.
AP: నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. చాగలమర్రి(మ) చిన్నవంగలిలో అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిద్రలోనే మృతి చెందారు. మృతుల్లో దంపతులు గురుశేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్థులు వెలికితీస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా తడిచి, శిథిలావస్థకు చేరి కూలినట్లు తెలుస్తోంది.
AP: ACA (ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి నాయకత్వంలోని అపెక్స్ కౌన్సిల్ మూకుమ్మడిగా రాజీనామా చేసింది. దీంతో ACAను రాజకీయాలకు అతీతంగా ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. TDP MP కేశినేని చిన్ని ACA ప్రక్షాళన పనులు చూస్తున్నారట. ఈ నెల 4న విజయవాడలో జరిగే SGMలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. MSK ప్రసాద్, JC పవన్ ACAలో కీలకంగా వ్యవహరించనున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.