news

News August 1, 2024

‘SC వర్గీకరణను స్వాగతిస్తున్నాం’

image

AP: ఎస్సీ వర్గీకరణపై తీర్పును స్వాగతిస్తున్నట్లు దళిత నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, జవహర్ తెలిపారు. 30 ఏళ్ల పోరాటం నేటికి సాకారమైందని పేర్కొన్నారు. ‘మందకృష్ణ నాయకత్వంలో వర్గీకరణ సాధించడం చరిత్రలో నిలిచిపోతుంది. మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కింది. సుప్రీం తీర్పును యథాతథంగా రాష్ట్రాలు అమలు చేయాలి’ అని వారు వ్యాఖ్యానించారు.

News August 1, 2024

నిమ్స్‌లో దారుణం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్

image

TG: ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ సొంతూరికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. శ్రీను (50) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. శస్త్ర చికిత్స చేస్తుండగా మరణించారని వైద్యులు ప్రకటించి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. దీంతో వైద్యులపై అతడి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.

News August 1, 2024

చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు: మందకృష్ణ మాదిగ

image

ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణను అప్పటి సీఎం చంద్రబాబే చేశారని MRPS అధినేత మందకృష్ణ మాదిగ గుర్తుచేశారు. ‘అప్పట్లో చంద్రబాబు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు మా వాళ్లకు వచ్చేవి కాదు. ఆరోజు ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లే న్యాయం బతికింది. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు. వర్గీకరణ అమలు జరుగుతుంది. బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని మందకృష్ణ చెప్పారు.

News August 1, 2024

హెల్త్ పెన్షన్లు అందుకునే వారికి ఉచిత బస్సు ప్రయాణం!

image

AP: తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునే వారికి ఉచిత బస్సు పాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల గుండె, లివర్, కిడ్నీ జబ్బులు, తలసేమియా, పక్షపాతం, లెప్రసీ, హీమోఫిలియా సమస్యలున్న 51 వేల మందికి మేలు జరగనుంది. చికిత్స కోసం పట్టణాల్లోని ఆస్పత్రులకు వచ్చి వెళ్లేందుకు రోగులు రూ.200 నుంచి రూ.600 భరించాల్సి వస్తోంది. ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఈ ఖర్చు నుంచి ఉపశమనం లభించనుంది.

News August 1, 2024

గర్భంతో క్రీడల్లో పాల్గొనడం కొత్తేమీ కాదు!

image

ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌‌లో పాల్గొన్న ఈజిప్టు ఫెన్సర్ నడా హఫీజ్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇలా గర్భంతో ఉన్నవారు క్రీడల్లో పాల్గొనడం కొత్తేమీ కాదు. 2017లో సెరెనా విలియమ్స్ గర్భిణిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచారు. 2014లో అల్సియా మోంటానో(USA) గర్భిణిగా ఉండి 800 మీటర్ల రేస్‌లో పాల్గొన్నారు. అయితే పోడియంలో ఇద్దరికి బదులు ఈసారి ముగ్గురం పాల్గొన్నామని నడా హఫీజ్‌ చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది.

News August 1, 2024

స్టాక్ మార్కెట్ల మెసేజ్: అవన్నీ అపోహలేనా?

image

STCG, LTCG పన్నులు, ఇండెక్సేషన్ రద్దుతో ఇన్వెస్టర్లు, సామాన్యులు మార్కెట్లకు దూరమవుతారు.. ఇకపై దేశంలో పెట్టుబడులు కష్టమే, MSMEలను పట్టించుకోలేదు.. ఇవీ బడ్జెట్‌పై స్పందనలు. రుపీ పతనం, సూచీల క్రాష్‌ను ఇందుకు ఉదాహరణగా చూపారు. తీరాచూస్తే <<13751421>>నిఫ్టీ 25K, సెన్సెక్స్ 82K‌<<>> బ్రేక్ చేశాయి. అయితే మార్కెట్ వర్గాలు బడ్జెట్‌ను అబ్జార్బ్ చేసుకున్నాయని, ఎకానమీ ఫార్మలైజ్ అవుతోందన్నది విశ్లేషకుల ఒపీనియన్. మీ కామెంట్?

News August 1, 2024

రిజర్వేషన్ల వ్యవస్థ రెండో అడుగు వేయబోతుంది: మందకృష్ణ

image

న్యాయం, ధర్మం కోసం చేసిన పోరాటం ఫలించిందని సుప్రీం కోర్టు <<13751609>>తీర్పును<<>> ఉద్దేశించి మందకృష్ణ మాదిగ అన్నారు. మాల సోదరులు అధైర్యపడొద్దని, అందరినీ కలుపుకొని పోతామని చెప్పారు. రిజర్వేషన్ల వ్యవస్థ రెండో అడుగు వేయబోతుందని, అన్యాయానికి గురైన వర్గాల వైపే న్యాయస్థానం నిలబడిందని తెలిపారు. వర్గీకరణ‌కు సంబంధించిన జీవోలు వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

News August 1, 2024

సుప్రీం తీర్పుపై మందకృష్ణ భావోద్వేగం

image

ఎస్సీ, ఎస్టీల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు <<13751609>>తీర్పును<<>> ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్వాగతించారు. 30 ఏళ్ల పోరాటం ఫలించిందని భావోద్వేగానికి గురయ్యారు. వర్గీకరణ కోసం ప్రధాని మోదీ చొరవ చూపారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ బాధ్యతను భుజాన వేసుకున్నారన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన చట్టం వల్లే న్యాయం బతికిందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని అమరులకు, ఉద్యమకారులకు అంకితం ఇస్తున్నామన్నారు.

News August 1, 2024

గత తీర్పు ఏమని చెప్పిందంటే?

image

SC, ST కులాల ఉపవర్గీకరణకు సుప్రీం కోర్టు తాజాగా <<13751609>>గ్రీన్ సిగ్నల్<<>> ఇచ్చింది. EV చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్ కేసులో 2005లో సుప్రీం ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. SC/STలు సజాతీయ తరగతులు కావడంతో ఉప-వర్గీకరణ సాధ్యం కాదని ఆనాటి తీర్పు చెప్పింది. SC/ST ఉపవర్గీకరణ విషయంలో కేవలం రాష్ట్రపతికే అధికారం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని ఆ తీర్పు చెప్పింది.

News August 1, 2024

SC వర్గీకరణ: నెరవేరిన మందకృష్ణ కల

image

SC వర్గీకరణ అంటే గుర్తొచ్చేది మందకృష్ణ మాదిగ. విద్య, ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరుగుతోందని MRPS స్థాపించి ప్రజల్లో అవగాహన కల్పించారు. నాయకుల్ని తయారు చేశారు. నిరాహార‌దీక్షలు చేశారు. రాజకీయ నేతల్ని కలిసి పార్టీలకు మద్దతిచ్చారు. వేర్వేరు సంఘాలు ఏర్పడి విభజన రాజకీయాలు రాజ్యమేలినప్పుడు మొక్కవోని దీక్షతో ఒంటరిగా పోరాడారు. కన్నీరు కార్చారు. మొన్న మోదీకి మద్దతిచ్చారు. సుప్రీం తీర్పుతో విజయం చవిచూశారు.