news

News August 1, 2024

స్కిల్ యూనివర్సిటీ బిల్లును స్వాగతిస్తున్నాం: బీజేపీ

image

TG: యువతలో నైపుణ్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీ బిల్లును స్వాగతిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. దీంతో నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూరుతుందన్నారు. సంబంధిత కోర్సుల్లో ఫుడ్ ప్రాసెసింగ్‌ను చేర్చాలని కోరారు. జిల్లా కేంద్రాలకు యూనివర్సిటీలను విస్తృతం చేస్తే ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం యువతను పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

News August 1, 2024

IPL-BCCI మీటింగ్‌లో షారుఖ్ vs నెస్‌వాడియా?

image

నిన్న ముంబైలో జరిగిన IPL-BCCI మీటింగ్‌లో మెగా వేలం, రిటెన్షన్‌పై వాడీ వేడీ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. KKR ఓనర్ షారుఖ్ ఖాన్ ఎక్కువ మందిని రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా PBKS ఓనర్ నెస్ వాడియా ఖండించారని, మెగా వేలం నిర్వహించాలని కోరినట్లు టాక్. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. మెగా వేలం నిర్వహణకు అత్యధిక ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరచలేదట.

News August 1, 2024

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంటే ఏంటి?

image

ఎస్సీ, ఎస్టీ కులాల్లో అంతర్గతంగా రిజర్వేషన్లు అందరికీ సమానంగా అందడం లేదనే వాదనతో ఈ వర్గీకరణ డిమాండ్ మొదలైంది. ఉదా.2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి AP ఎస్సీ జనాభా 1,38,78,078. అందులో మాదిగలు 67లక్షలు. మాలలు 55లక్షలు. అంటే మాలల కంటే మాదిగలు 12లక్షలు ఎక్కువ. అయితే జనాభాలో ఎక్కువున్న తమకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు అండం లేదనేది వాదన. అందుకే SCల్లోనూ A, B, C, D ఉప కులాలుగా <<13751609>>వర్గీకరించాలంటున్నారు<<>>.

News August 1, 2024

ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ అవసరమే: సుప్రీంకోర్టు తీర్పు

image

SC, ST రిజర్వేషన్ల వర్గీకరణపై MRPS దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం SC, ST వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. దీని వల్ల SC, STల్లోని వెనుకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని అభిప్రాయపడింది.

News August 1, 2024

అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో చెప్పారు. దీంతో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సాధ్యం కాదని, యువతకు స్కిల్స్ పెంపుపై పారిశ్రామికవేత్తలు, వీసీలతో చర్చించినట్లు పేర్కొన్నారు.

News August 1, 2024

All Time Record: నిఫ్టీ 25K, సెన్సెక్స్ 82K బ్రేక్

image

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నేడు సరికొత్త రికార్డులు సృష్టించాయి. NSE నిఫ్టీ తొలిసారి 25000 మార్క్ దాటింది. 24000 నుంచి మరో 1000 పాయింట్లు పెరిగేందుకు సూచీ కేవలం 25 సెషన్లే తీసుకుంది. BSE సెన్సెక్స్ మొదటి సారి 82000 స్థాయిని అధిగమించింది. 82129 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరి 1000 పాయింట్ల కోసం 11 సెషన్లే తీసుకుంది. ఇది All Time Record.

News August 1, 2024

OLYMPICS: అథ్లెట్లకు 2 లక్షల కండోమ్‌లు పంపిణీ

image

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు నిర్వాహకులు 2 లక్షలకుపైగా కండోమ్‌లు పంపిణీ చేశారు. పురుషులకు 2 లక్షలు, మహిళలకు 20 వేల కండోమ్‌లతోపాటు 10 వేల ఓరల్ డ్యామ్‌లు అందించారు. అథ్లెట్లు ఉత్సాహంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు వీటిని పంపిణీ చేశారు. కాగా 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి క్రీడాకారులకు వీటిని పంపిణీ చేస్తున్నారు.
<<-se>>#Olympics2024<<>>

News August 1, 2024

రేషన్ కార్డు లేని వారికి ALERT

image

TG: రుణమాఫీ కాలేదంటూ రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పాస్‌బుక్, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులో పేర్లు తేడాగా ఉండటంతో చాలామందికి మాఫీ కావడం లేదు. రేషన్ కార్డు లేని వారికి పూర్తిగా కావడం లేదు. అలాంటి వారికి గ్రామపంచాయతీలో కమిటీల ద్వారా త్వరలోనే కుటుంబ నిర్ధారణ చేశాక రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు చెప్పారు. ఇందుకోసం కొంత సమయం పడుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.

News August 1, 2024

ITR ఫైల్ చేశారా? ఇది మర్చిపోకండి

image

నిన్నటితో ITR ఫైల్ చేసేందుకు గడువు ముగిసింది. అయితే ట్యాక్స్‌ పేయర్లకు మరో అవకాశం ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినవారు దాన్ని 30రోజుల్లోపు ఈ-వెరిఫికేషన్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ-వెరిఫికేషన్ చేస్తే రీఫండ్ వస్తుంది. రీఫండ్ స్టేటస్‌ను incometax.gov.inలో చెక్ చేసుకోవచ్చు. ITRకు సంబంధించి సమస్యలుంటే 18001030025 లేదా 18004190025 నంబర్లను సంప్రదించవచ్చు.

News August 1, 2024

BJP చీఫ్‌గా దేవేంద్ర ఫడ్నవీస్?

image

BJP నేషనల్ చీఫ్‌గా మహారాష్ట్ర డిప్యూటీ CM ఫడ్నవీస్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని వారాల్లో ఫడ్నవీస్ డిప్యూటీ CM పదవికి రాజీనామా చేయనున్నారట. అటు ఇటీవల నీతి ఆయోగ్ మీటింగ్ ముగిసిన వెంటనే అన్ని రాష్ట్రాల BJP చీఫ్‌లతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్‌తో ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం.