India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇజ్రాయెల్‌కు కఠిన శిక్ష తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. తమ భూభాగంలో హనియేను చంపినందుకు ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకోవడం టెహ్రాన్ విధి అని పేర్కొన్నారు. ఇందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. కాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ చంపిన సంగతి తెలిసిందే.
పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ లక్ష్యసేన్ మరో విజయం ఖాతాలో వేసుకున్నారు. ఇండోనేషియా ఆటగాడు, వరల్డ్ నం.3 అయిన క్రిస్టీపై వరుస సెట్లలో 21-18, 21-12 పాయింట్ల తేడాతో గెలుపొందారు. దీంతో ఆయన ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. <<-se>>#Olympics2024<<>>
AP: సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు, కీలక అంశాలపై ఇరువురూ చర్చిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీలో కష్టపడిన వారందరినీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు.
దేశవ్యాప్తంగా నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.870 పెరిగి రూ.69,820కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.800 పెరిగి రూ.64,000గా నమోదైంది. ఇక వెండి ధర కూడా కేజీకి రూ.2000 పెరిగి రూ.91,000కు చేరింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.
పారిస్ ఒలింపిక్స్‌లో మరో భారత ప్లేయర్ పతకానికి చేరువయ్యారు. 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరారు. 590 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ఫైనల్లో సత్తా చాటి టాప్-3లో నిలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది. కాగా 3 పొజిషన్ షూటింగ్ అంటే పడుకొని, మోకాళ్లపై కూర్చొని, నిలబడి షూట్ చేయడం.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. ‘తన కులమేంటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారు’ అని నిన్న లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మోదీ ట్విటర్‌లో షేర్ చేశారు. దీంతో పంజాబ్ మాజీ సీఎం, ఎంపీ చరణ్‌జిత్ సింగ్ లోక్‌సభ జనరల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు.
ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో పీవీ సింధు విజయం సాధించారు. ఎస్తోనియాకు చెందిన క్రిస్టిన్‌పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో ఆమె గెలుపొందారు. దీంతో ఆమె రౌండ్-16(ప్రీ క్వార్టర్స్)కు చేరుకున్నారు.
TG: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం <<13745152>>రేవంత్<<>> వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని, సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు హుందాగా నిర్వహించి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని అడగడమే తాము చేసిన తప్పా అని నిలదీశారు.
ప్రముఖ సింగర్ చిన్మయి చేసిన పోస్టులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆమెతో పాటు హీరోయిన్ సమంత గురించి బూతులు మాట్లాడుతూ కించపరుస్తున్నారు. వీటిపై ట్విటర్‌లో హైదరాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ‘సోషల్ మీడియాలో యువత స్పందన, వారి భాష ఇలా ఉండొద్దు. బహుశా హైదరాబాద్ పోలీసులు దీన్ని గమనించలేదేమో. ఇలాంటి భాష ఎంతో భయంకరమైనది’ అని ఆమె ట్వీట్ చేశారు.
ఐపీఎల్ మెగా వేలానికి ముందు RCB ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, విల్ జాక్స్‌ను అట్టిపెట్టుకోనుందట. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, సిరాజ్, కామెరూన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్ సహా అందరూ ఈసారి వేలంలోకి వెళ్లనున్నట్లు సమాచారం. RTM ద్వారా వీరిలో ఒకరిని దక్కించుకోనున్నట్లు టాక్. కాగా ఇప్పటివరకు 17 సీజన్లు ముగిసినా ఒక్కసారి కూడా RCB టైటిల్ నెగ్గలేకపోయింది.
Sorry, no posts matched your criteria.