news

News July 31, 2024

అందుకే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చా: రేవంత్

image

TG: చీల్చి చెండాడుతా అన్నవారు సభకు రావడం లేదని మాజీ CM కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సెటైర్లు వేశారు. ఆయన చీల్చి చెండాడుతారని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి వచ్చానని CM ఎద్దేవా చేశారు. ‘మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదని మొసలి కన్నీరు కారుస్తున్నారు. తొలి ఐదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మైనారిటీలు, మహిళలకు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ విషయం గుర్తుంచుకోవాలి’ అని ఆయన మండిపడ్డారు.

News July 31, 2024

బీఆర్ఎస్ ఆర్థిక కుట్ర ఏంటో అందరికీ తెలియాలి: CM రేవంత్

image

TG: బీఆర్ఎస్ హయాంలో MMTS సేవల్ని విమానాశ్రయం వరకు విస్తరించేందుకు అనుమతి ఎందుకివ్వలేదో ఆ పార్టీ నేతలు చెప్పాలని సీఎం రేవంత్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఆ పార్టీ చేసిన ఆర్థిక కుట్ర అందరికీ తెలియాలని పేర్కొన్నారు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామనో, హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా మార్చుతామనో తామెప్పుడూ చెప్పలేదన్నారు. అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.

News July 31, 2024

రూ.48 లక్షలకు ‘భారత రాజ్యాంగం’ 1950 నాటి కాపీ వేలం!

image

భారత రాజ్యాంగం మొట్ట మొదటి ఎడిషన్‌ను ఇటీవల వేలంలో రూ.48 లక్షలకు విక్రయించారు. ఇప్పటివరకూ జరిగిన వేలంలో ఇదే అత్యధికం. డెహ్రాడూన్‌లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం 1950లో ప్రచురించిన 1000 కాపీల్లో ఇది ఒకటి. దీనిపై బీఆర్ అంబేడ్కర్, నెహ్రూ, ప్రేమ్ బిహారీ నారాయణ్ సంతకాలను ముద్రించడం విశేషం. saffronart.comలో ఈనెల 24-26 మధ్య వేలం నిర్వహించారు. 1785నాటి భగవద్గీతను రూ.19.20 లక్షలకు విక్రయించారు.

News July 31, 2024

అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవండి: సోనియా

image

దేశంలో త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అతి నమ్మకం పనికిరాదని, కష్టపడి పనిచేస్తే లోక్‌సభ ఫలితాలే రిపీట్ అవుతాయని చెప్పారు. విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించినా మోదీ ప్రభుత్వంలో మార్పు రాలేదన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంట్ సెషన్స్‌కు మిస్ కావొద్దని సూచించారు.

News July 31, 2024

సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగమిస్తాం: సీఎం రేవంత్

image

TG: టీమ్ ఇండియా క్రికెటర్ సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. టీ20 వరల్డ్‌ కప్ గెలిచిన జట్టులో సిరాజ్ ఉండటం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. అన్ని మినహాయింపులతో ఆయనకు ఉద్యోగం ఇచ్చేలా క్యాబినెట్‌లో చర్చిస్తామని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో భారత్ సాధించిన చిరస్మరణీయ విజయాల్లో సిరాజ్‌ కీలక పాత్ర పోషించారు.

News July 31, 2024

కేరళలో ప్రళయం.. 163కి చేరిన మరణాలు

image

కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తులో మరణాల సంఖ్య 163కి చేరింది. ఇంకా 85 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. భారత సైన్యంతో పాటు NDRF బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ పరిస్థితిపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి జార్జి కురియన్ తెలిపారు. 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. కాగా ఇప్పటివరకు 89 మృతుల వివరాలను గుర్తించారు.

News July 31, 2024

HAMAS: అసలు ఎవరీ ఇస్మాయిల్ హనియే?

image

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారు. హనియే 1963లో గాజాలోని ఓ శరణార్థి శిబిరంలో జన్మించారు. 1980ల చివర్లో హమాస్‌లో చేరారు. హమాస్ ఫౌండర్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎన్నికయ్యారు. 2017లో హమాస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. అమెరికా అతడిని ఉగ్రవాదిగా గుర్తించడంతో ఖతర్‌లో నివాసముండేవారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన ముగ్గురు కుమారులూ చనిపోయారు.

News July 31, 2024

IPL: ముగ్గురు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల రిటైన్?

image

ఐపీఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీ ముగ్గురు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకునేలా BCCI అంగీకరించనున్నట్లు TOI తెలిపింది. నేడు జరిగే BCCI-IPL సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది. ఆయా ఫ్రాంచైజీలు రూ.కోట్లు వెచ్చించి యంగ్ ప్లేయర్లను తీర్చిదిద్దాయి. దీంతో వారిని వదిలిపెట్టేందుకు ఫ్రాంచైజీలు ఇష్ట పడటం లేదట. అందుకే క్యాప్‌డ్ ప్లేయర్లతోపాటు, అన్‌క్యాప్‌‌డ్ ప్లేయర్ల రిటెన్షన్‌కూ BCCI గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందట.

News July 31, 2024

కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది.

News July 31, 2024

రైల్వే ట్రాక్స్‌పై పూజలు.. ఎందుకంటే?

image

ముంబైలోని చెంబూర్ స్టేషన్ సమీపంలో గల రైల్వే ట్రాక్‌పై కొబ్బరి కాయలు కొడుతూ భక్తులు పూజలు చేస్తున్నారు. ఇది ప్రమాదకరమని ఓ వ్యక్తి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయడంతో భక్తులను అక్కడి నుంచి పంపించేశారు. అయితే, అక్కడ ఎందుకు పూజలు చేస్తున్నారని ఓ భక్తుడిని ప్రశ్నించగా.. గతంలో ఇక్కడే ఆలయం ఉండేదని, అప్పటి నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నామని భక్తులు RPF సిబ్బందికి తెలిపారు.