news

News July 31, 2024

HCAపై ACB దాడులు

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఏసీబీ దాడులు చేసింది. ఉప్పల్ స్టేడియంలోని HCA పరిపాలనా భవనంలో సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. కాగా HCAలో నిధుల గోల్‌మాల్ జరిగినట్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అసోసియేషన్‌పై ఏసీబీ రైడ్స్ చేసినట్లు సమాచారం.

News July 31, 2024

నిర్మాతల మండలి తీరు కరెక్ట్ కాదు: కార్తి

image

ఈ ఏడాది నవంబరు 1 తర్వాత సినిమాల షూటింగ్‌కు అనుమతి లేదంటూ తమిళ సినీ నిర్మాతల మండలి తీర్మానించడంపై నడిగర్ సంఘం కోశాధికారి కార్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వేలాదిమంది కార్మికుల జీవితాలకు సంబంధించిన ఇలాంటి నిర్ణయాలను అన్ని సంఘాలతో చర్చించిన తర్వాతే తీసుకోవాలి. ఈ తీరు సరికాదు. ధనుష్‌పై చర్యలు తీసుకుంటామన్నారు కానీ ఇప్పటి వరకు మా సంఘానికి ఎటువంటి ఫిర్యాదు రాలేదు’ అని వెల్లడించారు.

News July 31, 2024

పూజలు చేసిన పామే కాటేసింది!

image

అలుగుల గంగవ్వ(65)కు తన ఇంటి ఆవరణలోని పుట్టలో విషపూరిత సర్పం ఉందని తెలుసు. అయినా సరే చాలా ఏళ్లుగా దాన్ని దైవంలా పూజిస్తోందావిడ. కానీ కాలనాగుకు కనికరం ఏముంటుంది? మంగళవారం ఆమె ఇల్లు అలుకుతున్న సమయంలో కాటేసింది. స్థానికులు గుర్తించి చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గంగవ్వ కన్నుమూసింది. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

News July 31, 2024

BRS పాపాలను మేం మోస్తున్నాం: శ్రీధర్ బాబు

image

TG: గత ప్రభుత్వం చేసిన పాపాలను ఇప్పుడు మోస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో అన్నారు. గ్రామాల్లో సొంత డబ్బులతో పనులు చేయించిన సర్పంచులు సంబంధిత బిల్లులకు మోక్షం రాక ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల్ని కచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ, పట్టణ అభివృద్ధి కోసం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

News July 31, 2024

105 ఓటములు.. శ్రీలంక చెత్త రికార్డు

image

అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక చెత్త రికార్డును మూటగట్టుకుంది. అత్యధిక మ్యాచ్‌లలో(105) ఓడిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్(104), వెస్టిండీస్(101), జింబాబ్వే(99) ఉన్నాయి. ఒక జట్టు చేతిలో అత్యధికసార్లు ఓడిన జాబితాలో రెండో స్థానంలో లంక నిలిచింది. పాక్ చేతిలో కివీస్ 23 సార్లు(44 మ్యాచ్‌లు), ఇండియా చేతిలో శ్రీలంక 22 సార్లు(32 మ్యాచ్‌లు) ఓడింది.

News July 31, 2024

చీటింగ్ కేసులో సినీ నిర్మాత అరెస్ట్

image

బ్యాంకును మోసగించిన కేసులో సినీ నిర్మాత షేక్ బషీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజర్‌తో కలిసి బషీద్ ఆ బ్యాంకును రూ.40 కోట్ల మేర మోసం చేశాడు. దీంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లరే అల్లరి, మెంటల్ పోలీస్, నోటుకు పోటు వంటి సినిమాలకు బషీద్‌ నిర్మాతగా వ్యవహరించారు. ‘ఎవడ్రా హీరో’ చిత్రంలో హీరోగా నటించారు. రాజంపేట కాంగ్రెస్ MP అభ్యర్థిగా పోటీ చేశారు.

News July 31, 2024

LIC, BAJAJకు మనూ భాకర్ నోటీసులు

image

ఎల్‌ఐసీ, బజాజ్ ఫుడ్స్, ఫిట్జీ వంటి సంస్థలకు ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ నోటీసులు పంపారు. అనుమతి లేకుండా ఆ సంస్థలు తన ఫొటోలు, వీడియోలు వినియోగించటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. సదరు సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. దాదాపు 24 సంస్థలు మనూ ఫొటోలు వినియోగించినట్లు IOS ఎండీ నీరవ్ తోమర్ తెలిపారు. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని ఆయన పేర్కొన్నారు.

News July 31, 2024

పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి.. APకి కేంద్రం తీపికబురు

image

AP: 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ అమల్లో 6.50 కోట్ల పనిదినాలను కేంద్రం అదనంగా కేటాయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తొలి విడతగా కేటాయించిన 15 కోట్ల పనిదినాలు జూన్ నెలాఖరుకే పూర్తయినందున అదనపు పనిదినాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన చెప్పారు. తమ విజ్ఞప్తికి కేంద్రం అంగీకరించిందని, దీని వల్ల 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పవన్ వెల్లడించారు.

News July 31, 2024

ఆ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని ఉపసంహరించండి: నితిన్ గడ్కరీ

image

లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18% GSTని ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. బీమా రంగానికి సంబంధించిన సమస్యలపై నాగ్‌పుర్ ఉద్యోగుల యూనియన్ తనకు మెమోరాండం ఇచ్చిందని లేఖలో తెలిపారు. కుటుంబాలకు రక్షణ కల్పించే వీటిపై పన్ను విధించడం సరికాదని యూనియన్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రూల్స్ సీనియర్ సిటిజన్లకు గందరగోళంగా ఉన్నాయన్నారు.

News July 31, 2024

అమరావతిలో XLRI క్యాంపస్

image

AP: దేశంలో టాప్ బిజినెస్ స్కూల్‌గా పేరొందిన జేవియర్ స్కూల్ ఆఫ్ బిజినెస్(XLRI) అమరావతిలో క్యాంపస్ ప్రారంభించనుంది. 5 వేల మంది విద్యార్థులు చేరేలా 50 ఎకరాల్లో రూ.250 కోట్లతో క్యాంపస్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది. 2019కి ముందు VIT యూనివర్సిటీకి సమీపంలో XLRIకు అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది. శంకుస్థాపన జరిగినా నిర్మాణాలు జరగలేదు. తాజాగా ప్రభుత్వం మారడంతో ఈ సంస్థ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది.