news

News July 31, 2024

జులై 31: చరిత్రలో ఈరోజు

image

✒ 1951: నటుడు శరత్ బాబు జననం.
✒ 1964: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
✒ 1980: ప్రముఖ సింగర్ మహమ్మద్ రఫీ మరణం.
✒ 1880: హిందీ, ఉర్దూ కవి ప్రేమ్‌చంద్ జననం.
✒ 2004: ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మరణం.
✒ 2007: పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది.

News July 31, 2024

కొండచరియలు విరగడంతో జరిగిన విషాదాలు

image

✒ 1948లో అస్సాంలోని గువాహటిలో 500 మందికిపైగా దుర్మరణం.
✒ 1968లో బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో 1,000 మందికి పైగా చనిపోయారు.
✒ 1998లో UPలో మాప్లాలో 380 మంది మృతి.
✒ 2013లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో 4,200 గ్రామాలు కొట్టుకుపోయాయి. 5,700 మంది దుర్మరణం.
✒ 2014లో మహారాష్ట్రలోని మాలిన్‌లో 151 మంది మృతి.
✒ 2024లో కేరళలోని వయనాడ్‌లో 123 మంది మరణం.

News July 31, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 31, 2024

30 వేల మంది అమ్మాయిల మిస్సింగ్‌ ఆరోపణలు అబద్ధం: YCP

image

AP: రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు మాయమైనట్లు పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు చేసిన ఆరోపణలు అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసిందని వైసీపీ ట్వీట్ చేసింది. 2019 నుంచి 2023 వరకు 44,685 మిస్సింగ్ ఫిర్యాదులు రాగా, 44,022 మందిని ట్రేస్ చేసినట్లు లోక్‌సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని పేర్కొంది. ‘దీనిపై తప్పుడు ప్రచారాలు చేసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?’ అని ప్రశ్నించింది.

News July 31, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 31, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జులై 31, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:37 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:55 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:51 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:50 గంటలకు
✒ ఇష: రాత్రి 8.08 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 31, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: జులై 31, బుధవారం
✒ ఏకాదశి: మధ్యాహ్నం 3.55 గంటలకు
✒ రోహిణి: ఉదయం 10.12 గంటలకు
✒ వర్జ్యం: మధ్యాహ్నం 3.51 నుంచి సాయంత్రం 5.27 వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 11.48 నుంచి మధ్యాహ్నం 12.39 వరకు
✒ రాహుకాలం: మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు

News July 31, 2024

TODAY HEADLINES

image

* కేరళలో కొండచరియలు విరిగిపడి 120 మందికి పైగా మృతి
* ఒలింపిక్స్: షూటింగ్‌లో మనూ భాకర్‌కు మరో కాంస్య పతకం
* ఆగస్టు నెల పెన్షన్ నిధులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
* ఎస్సీల కోసం కొత్త పథకాలు రూపొందించాలి: సీఎం CBN
* TG: రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల
* TG: ఎల్లుండి కొత్త రేషన్ కార్డుల విధివిధానాలు ఖరారు: మంత్రి ఉత్తమ్
* TG: విద్యుత్ కమిషన్ నూతన ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ బి లోకుర్‌

News July 31, 2024

సూపర్ ఓవర్‌లో భారత్ ఘన విజయం

image

మూడో T20 సూపర్ ఓవర్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత లంక 3 బంతుల్లో 2 పరుగులే(అందులో ఒకటి వైడ్) చేసి 2 వికెట్లు కోల్పోయింది. సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. సూర్య తొలి బంతికే ఫోర్ కొట్టి అపురూప విజయాన్ని అందించారు. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లూ 137 రన్స్ చేయడంతో <<13742755>>మ్యాచ్ టై<<>> అయిన విషయం తెలిసిందే.

News July 31, 2024

భారత్-శ్రీలంక మ్యాచ్ టై

image

శ్రీలంక- భారత్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ టై అయ్యింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లూ 137 పరుగులే చేశాయి. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక ఒకానొక దశలో గెలిచేలా కనిపించింది. 15.2 ఓవర్లలో 110/2 స్కోరుతో బలంగా ఉన్న ఆ జట్టు.. ఆ తర్వాత 12 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయింది. గెలుపు కోసం చివరి ఓవర్‌లో 6 పరుగులు చేయాల్సి ఉండగా, ఆశ్చర్యకరంగా సూర్య బౌలింగ్ వేశారు. 5 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు.