news

News October 21, 2024

₹1,000 కోట్ల‌కు స‌గం వాటా అమ్మేసిన క‌ర‌ణ్‌ జోహార్‌

image

బాలీవుడ్‌లో భారీ డీల్ కుదిరింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్‌కు చెందిన ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌లో 50% వాటాను బిజినెస్ టైకూన్ అదార్ పూనావాలా ₹1,000 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. మిగిలిన వాటా క‌లిగిన క‌ర‌ణ్ సంస్థను న‌డిపిస్తారు. ఐకానిక్ ప్రొడక్ష‌న్స్ హౌస్‌లో భాగ‌స్వామ్యమైనందుకు పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు. ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌ను ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చుతామని క‌ర‌ణ్ పేర్కొన్నారు.

News October 21, 2024

గ్రూప్-1 మెయిన్స్‌కు 72.4% హాజరు

image

TG: ఇవాళ జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 72.4% హాజరు నమోదైంది. మెయిన్స్‌కు మొత్తం 31,383 అభ్యర్థులు అర్హత సాధించగా, నేడు 22,744 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ ఎగ్జామ్స్ ఈనెల 27 వరకు కొనసాగనున్నాయి. జీవో 29 రద్దు చేయాలని, పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, తాము జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

News October 21, 2024

బాధితులకు ఎల్లుండి జగన్ పరామర్శ

image

AP: మాజీ సీఎం జగన్ ఈ నెల 23న గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటిస్తారని వైసీపీ వెల్లడించింది. టీడీపీ కార్యకర్త దుర్మార్గం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన తెనాలికి చెందిన యువతి కుటుంబాన్ని తొలుత పరామర్శిస్తారని తెలిపింది. తర్వాత బద్వేలులో హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని కలుసుకుని ధైర్యం చెబుతారని పేర్కొంది. అనంతరం ఆయన పులివెందులకు వెళ్తారని ఓ ప్రకటన విడుదల చేసింది.

News October 21, 2024

రాజ‌స్థాన్‌లో బీజేపీకి అగ్నిప‌రీక్ష‌

image

రాజ‌స్థాన్‌లో 7 అసెంబ్లీ స్థానాల‌కు Nov 13న జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లు BJPకి అగ్నిప‌రీక్ష‌లా ప‌రిణ‌మిస్తున్నాయి. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ ఇక్క‌డ 11 సీట్ల‌ను కోల్పోయింది. దీంతో ఇప్పుడు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లు అధికార BJP, కాంగ్రెస్‌ల బలాన్ని ప్రదర్శించనున్నాయి. BJP అన్ని అస్త్రాలు సంధిస్తోంది. గెలిచే అవ‌కాశం ఉన్న‌వారికే టికెట్లు కేటాయిస్తోంది. అలాగే కుటుంబ స‌భ్యుల‌నూ బ‌రిలో దింపుతోంది.

News October 21, 2024

మాకు రాష్ట్రాలతోకాదు దేశాలతోనే పోటీ: లోకేశ్

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ కేంద్ర మంత్రి జయంత్ చౌధురి, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నైపుణ్య గణనకు సహకరించాలని, కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను APలో ఏర్పాటుచేయాలని కోరారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. అనంతరం ICEA ప్రతినిధులతోనూ చర్చించారు. పరిశ్రమలు ఏర్పాటుచేసే వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. తమకు రాష్ట్రాలతోకాదు దేశాలతోనే పోటీ అని చెప్పారు.

News October 21, 2024

ఫోన్ అడిక్షన్ పోవాలంటే..

image

* మీరు ఎక్కువగా టైమ్ కేటాయించే సోషల్ మీడియా/గేమింగ్ యాప్స్‌ను ఫోన్‌లో నుంచి డిలీట్ చేయాలి.
* యాప్స్ వాడకానికి టైమ్ లిమిట్ పెట్టుకోవాలి.
* స్క్రీన్ టైమ్ ట్రాకింగ్ యాప్స్‌ను వాడాలి. దీని వల్ల ఎంతసేపు ఫోన్‌తో గడిపారో తెలుస్తుంది.
* డైనింగ్/బెడ్ రూమ్‌కు ఫోన్ తీసుకెళ్లొద్దని రూల్ పెట్టుకోవాలి.
* ఫోన్‌పై నుంచి దృష్టిని మరల్చడానికి రీడింగ్, వాకింగ్ వంటివి చేయాలి.

News October 21, 2024

పోలీస్ స్కూలులో స్థానికులకు 15% అడ్మిషన్లు: సీఎం

image

TG: రంగారెడ్డి(D) మంచిరేవులలో ఏర్పాటు కానున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూలులో స్థానికులకు 15% అడ్మిషన్లు ఇవ్వాలని CM రేవంత్ నిర్ణయించారు. గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలోని 50 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ స్కూలులో వచ్చే విద్యాసంవత్సరం 5 నుంచి 8 వరకు తరగతులను ప్రారంభించనున్నారు. పోలీసు, ఫైర్, ఎస్‌పీఎఫ్, జైళ్ల శాఖల ఉద్యోగుల పిల్లలకు ఈ స్కూలు ద్వారా విద్యను అందించనున్నారు.

News October 21, 2024

అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: ప్రభుత్వం

image

AP: అమరావతి నిర్మాణానికి రూ.11వేల కోట్ల నిధులిచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఢిల్లీలో హడ్కో అధికారులతో సమావేశమయ్యారు. అమరావతి మొదటి విడత పనుల పూర్తికి రూ.26వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, ఇప్పటికే ప్రపంచబ్యాంకు, ఏడీబీ రూ.15వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయని ప్రభుత్వం వివరించింది.

News October 21, 2024

మ‌హిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం

image

UP కాన్పూర్‌లో ఓ మ‌హిళా కానిస్టేబుల్‌పై ప‌రిచ‌య‌స్థుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అయోధ్యలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తున్న బాధితురాలు కర్వా చౌత్ జ‌రుపుకొనేందుకు కాన్పూర్ బ‌య‌లుదేరింది. అక్క‌డి నుంచి స్వ‌గ్రామానికి వెళ్తుండ‌గా పొరుగింటి ధర్మేంద్ర ఆమెకు బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. తీరా మార్గ‌మ‌ధ్య‌లో ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. నిందితుడిని ప‌ట్టుకున్న‌ట్టు పోలీసులు సోమ‌వారం తెలిపారు.

News October 21, 2024

నెలలోపే OTTలోకి వేట్టయన్?

image

జ్ఞానవేల్ డైరెక్షన్‌లో రజినీకాంత్ నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వేట్టయన్ మూవీ నెలలోపే OTTలోకి రానున్నట్లు సమాచారం. OCT 10న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రూ.130 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఈ క్రమంలో NOV 7-9 మధ్య అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్. ఈ చిత్రంలో అమితాబ్, ఫహాద్, రానా, దుషారా విజయన్ నటించారు.