India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నవంబర్ 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గ పర్యటనలో ఆయన మాట్లాడారు. 5 రోజుల పాటు జరిగే సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. అయితే తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందని మాజీ సీఎం జగన్ సభకు రావట్లేదన్నారు. అయితే ఈ సమావేశాలకు ఆయన వస్తారని వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీవిష్ణు, హసిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘స్వాగ్’ ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 4న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 5 పాత్రల్లో శ్రీవిష్ణు కనిపించగా ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా వచ్చే నెల 4న ఓటీటీలోకి రానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తల్లి మరణించిన బాధలో ఏడుస్తుండగా హీరో సుదీప్‌ను ఫొటోలు తీయడాన్ని ఆయన కూతురు శాన్వీ తప్పుబట్టారు. బాధలో ఉన్న వ్యక్తిపై ఇలా అమానుషంగా ప్రవర్తిస్తారని తనకు తెలియదన్నారు. కొందరు తన మొహంపైన కెమెరాలు పెట్టారని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి రీల్స్‌పై ఉన్న శ్రద్ధ ఎమోషన్స్‌ను అర్థం చేసుకోవడంలో లేదని రాసుకొచ్చారు.
TG: తొలిరోజు గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మ.2 గంటల నుంచి సా.5 వరకు పరీక్ష జరిగింది. జీవో 29ను రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లగా, ఎగ్జామ్స్ నిర్వహణకే అత్యున్నత న్యాయస్థానం మొగ్గు చూపింది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరిగాయి. ఈ నెల 27న ఎగ్జామ్స్ ముగియనున్నాయి.
రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర ప్లేయర్ పుజారా అదరగొట్టారు. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచులో డబుల్ సెంచరీ చేశారు. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 18 డబుల్ సెంచరీలు చేసిన భారత ప్లేయర్‌గా ఉన్నారు. గత కొంత కాలంగా ఫామ్ లేమి కారణంతో ఆయన టీమ్ ఇండియాకు దూరమయ్యారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆయన సత్తా చాటడం గమనార్హం. మరి పుజారాను మళ్లీ టీమ్‌లోకి తీసుకుంటారా?
తూర్పు లద్దాక్‌లో LAC వెంబడి పెట్రోలింగ్ విషయంలో భారత్-చైనా కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. కొన్ని వారాలుగా ఇరు దేశాల దౌత్యవేత్తలు, సైన్యాధికారులు జరిపిన చర్చల్లో పురోగతి సాధించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. 2020లో గాల్వన్‌లో తలెత్తిన ఉద్రిక్తతల పరిష్కారానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో భారత బలగాలు మరిన్ని పెట్రోలింగ్ పాయింట్లను యాక్సెస్ చేయగలవు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 29 వల్ల గ్రూప్-1 అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కేటీఆర్ అన్నారు. దీనిపై హైకోర్టులో తమ న్యాయవాదులతో కలిసి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లకు తూట్లు పొడవటం కంటే పెద్ద నేరం ఉండదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తప్పు అని నిరూపిస్తాం’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు HYD సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. తెలంగాణ CSకు కూడా నోటీసులిచ్చింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారని ఓ న్యాయవాది ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యిని వాడినట్లు మాట్లాడారని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరారు.
గాయం కారణంగా ఏడాదిగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న పేసర్ షమీ తాను పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధంగా ఉన్నట్లు సెలెక్టర్లకు సిగ్నల్ ఇచ్చారు. ‘నేను హాఫ్ రన్‌తో బౌలింగ్ ప్రారంభించా. 100 శాతం నొప్పి లేకుండా ఉన్నా. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లకు ఎలాంటి అస్త్రాలు కావాలనే దానిపై వర్క్ చేస్తున్నా. అంతకు ముందు రంజీట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
TG: గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. దోపిడీని ప్రశ్నించినందుకే తనను పక్కనపెట్టారని అన్నారు. ‘2014లో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఎన్ని? కేసీఆర్ నీతిమంతులైతే తమ ఆస్తుల వివరాల్ని వెల్లడించాలి’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదని, ఆ పార్టీల నేతలు అధికారం కోసం పోటీ పడుతున్నారని అన్నారు.
Sorry, no posts matched your criteria.