news

News October 21, 2024

‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ న్యూ లుక్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ ‘రాజా సాబ్’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా ఎల్లుండి టైటిల్ ట్రాక్ విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త లుక్‌లో ప్రభాస్ అదిరిపోయారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ కానుంది.

News October 21, 2024

జగన్ బీజేపీకి దత్తపుత్రుడు: షర్మిల

image

AP: మాజీ సీఎం YSR మానస పుత్రిక ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. గత YCP ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూసిందన్నారు. ‘YSR తన జీవితం మొత్తం మత పిచ్చి BJPని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ గారు దత్తపుత్రుడు. అలాంటి వాళ్లకు YSR ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటు’ అని దుయ్యబట్టారు.

News October 21, 2024

Stock Market: లాభాలు నిలుపుకోలేక నష్టాల్లోకి

image

ఆరంభ లాభాల‌ను మార్కెట్లు నిలుపుకోలేకపోయాయి. ఉద‌యం 100 పాయింట్ల లాభంతో ప్రారంభ‌మైన నిఫ్టీ చివ‌రికి 72 పాయింట్లు న‌ష్టపోయి 24,781 వ‌ద్ద స్థిర‌ప‌డింది. అటు సెన్సెక్స్‌ 81,450 ప‌రిధి దాట‌లేక 73 పాయింట్ల న‌ష్ట‌పోయి 81,151 వ‌ద్ద స్థిర‌ప‌డింది. BSeలో 9 మాత్ర‌మే గ్రీన్‌లో ముగిశాయి. Bajaj Auto, Hdfc Bank, Asian Paint, M&M టాప్ గెయినర్స్. Tata Consum, Kotak Bank, Bajaj Finsv, BPCL, IndusInDBK టాప్ లూజర్స్.

News October 21, 2024

మీరూ ‘హాలోవీన్’ సెలబ్రేట్ చేసుకున్నారా?

image

హాలోవీన్ అంటే ఏంటో తెలుసా? సుమారు 2 వేల ఏళ్ల క్రితం బ్రిటన్, ఐర్లాండ్, ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉండే ‘సెల్ట్స్’ జాతి ప్రజలు దీనిని స్టార్ట్ చేశారు. NOV నుంచి చలికాలం మొదలై వివిధ రకాల వ్యాధులొస్తుండేవి. దానికి ముందురోజే OCT 31న అంతా ఒక దగ్గర చేరి మంటలు వేసి విచిత్ర వేషధారణలతో అతీత శక్తులని తరిమివేయాలనే ఆలోచనతో ఈ ఆచారం మొదలుపెట్టారు. ‘ఆల్ హాలోస్ డే’గా పిలిచేదాన్ని ‘హాలోవీన్’గా మార్చారు.

News October 21, 2024

అలాంటి వారు ఇక‌ నో ఫ్లై జాబితాలో: రామ్మోహ‌న్ నాయుడు

image

విమానాల‌కు న‌కిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపడాన్ని నేరంగా ప‌రిగ‌ణించేలా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ చేయనున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. అలాగే బాంబు బెదిరింపుల‌కు పాల్ప‌డిన వారిని నో ఫ్లై జాబితాలో చేర్చ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇప్ప‌టిదాకా 75 సంస్థ‌ల‌కు బెదిరింపులు వ‌చ్చాయి. ఈ బెదిరింపుల విషయంలో ఒకేర‌క‌మైన భాష‌ను ఉప‌యోగిస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

News October 21, 2024

నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్

image

AP: ఓ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించారు. సురేశ్ ప్రోద్బలంతోనే ఈ వివాదం జరిగిందనే బంధువుల ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 21, 2024

రైలులో టపాసులు తీసుకెళ్లొచ్చా?

image

దీపావళి సమీపిస్తోంది. చాలామంది పట్టణాల నుంచి సొంతూళ్లకు వెళుతుంటారు. ఈక్రమంలోనే బాణసంచా కొని ట్రైన్‌లో తీసుకెళదామనుకుంటారు. అయితే రైల్వే సేఫ్టీ రూల్స్ ప్రకారం మండే స్వభావం ఉన్న ఫైర్ క్రాకర్స్‌ను రైలులో తీసుకెళ్లడం నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్‌ స్టవ్స్, సిలిండర్స్, యాసిడ్స్ వంటివి కూడా తీసుకెళ్లడానికి అనుమతి లేదు.

News October 21, 2024

CSKతోనే ధోనీ.. ఆ జట్టు సీఈవో ఏమన్నారంటే?

image

ఐపీఎల్‌లో CSK తరఫున ఎంఎస్ ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ కూల్ జట్టుకు ఆడాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే దీనిపై ధోనీ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఈ నెల 31లోపు నిర్ణయాన్ని వెల్లడిస్తానని MS చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా CSKలో తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

News October 21, 2024

రతన్ టాటా నాకూ సలహాలిచ్చేవారు: బ్రిటన్ మాజీ PM

image

చంద్రుడి సౌత్‌పోల్‌లో రోవర్‌ను దించిన చంద్రయాన్3 సహా అనేక అంశాల వల్ల భారత్‌పై వెస్ట్ దృష్టికోణం మారిందని బ్రిటన్ మాజీ PM డేవిడ్ కామెరాన్ అన్నారు. జాగ్వార్‌ను టాటా కొనడంతో UKలో జపాన్‌ పెట్టుబడుల్ని భారత్ దాటేసిందన్నారు. ‘టాటా పెట్టుబడి నాకో వేకప్‌ కాల్‌. ప్రపంచ స్థాయికి భారత ఎకానమీ ఎదిగిందని, గొప్ప పనులు చేయబోతోందని గ్రహించాను. నేను PMగా ఉన్నప్పుడు రతన్ టాటా నాకు సలహాదారుగా ఉండేవారు’ అని అన్నారు.

News October 21, 2024

గ్రూప్1 అభ్యర్థులకు విషెస్ చెప్పిన CM

image

TG: మరికాసేపట్లో గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు చెప్పారు. ఎటువంటి ఆందోళన చెందకుండా, పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. ‘ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.