news

News October 21, 2024

రెండున్నరేళ్ల క్రితం రీరిలీజ్.. వెయ్యి రోజులుగా స్క్రీనింగ్

image

గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘విన్నైతాండి వరువాయా’ 2010లో రిలీజై గొప్ప విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తమిళ నటుడు శింబు, త్రిష కాంబోలో ఈ మూవీ తెరకెక్కగా దీనిని తెలుగులో ‘ఏమాయ చేశావే’గా రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని రెండున్నరేళ్ల క్రితం రీరిలీజ్ చేయగా చెన్నైలోని అన్నానగర్ PVR థియేటర్‌లో స్క్రీనింగ్ అవుతోంది. నేటికి వెయ్యి రోజులు పూర్తవడంతో సినీ అభిమానులు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు.

News October 21, 2024

నాగచైతన్య-శోభిత పెళ్లి పనులు ప్రారంభం

image

అక్కినేని నాగచైతన్య, శోభిత త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 8న వీరి ఎంగేజ్మెంట్ జరగగా తాజాగా పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి శోభిత పసుపు దంచుతున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో వీరి పెళ్లి ఎప్పుడా అని అభిమానుల్లో చర్చ మొదలైంది.

News October 21, 2024

పత్తి రైతులను మోసం చేస్తే చర్యలు: మంత్రి తుమ్మల

image

TG: రాష్ట్రంలో అన్ని పంటలకు ప్రభుత్వమే మద్దతు ధర ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం(D) గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కష్టమైన నష్టమైనా ప్రభుత్వం పంట కొనుగోళ్లు చేస్తుందని చెప్పారు. పత్తి రైతులను మోసం చేసే ప్రైవేట్ వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

News October 21, 2024

స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్స్

image

బంగారం ధరలు మరోసారి పైపైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.220 పెరిగి రూ.79,640కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.200 పెరిగి రూ.73,000గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ దూసుకెళ్తోంది. నిన్నటి వరకు రూ.1,07,000 ఉండగా ఇవాళ మరో రూ.2000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేట్ రూ.1,09,000కి చేరింది.

News October 21, 2024

హైకోర్టులోనే తేల్చుకోండి: SC

image

TG: గ్రూప్-1 మెయిన్స్ రీషెడ్యూల్, జీవో 29 రద్దు పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. అటు ఫలితాల వెల్లడికి, నవంబర్ 20కి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయన్న HC వ్యాఖ్యలను కోట్ చేసింది.

News October 21, 2024

మీ జీవితంలో పరిచయమయ్యే ముగ్గురు వీరే: గోయెంకా

image

జీవన ప్రయాణంలో ఎదురయ్యే వ్యక్తుల గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘మీ జీవిత ప్రయాణంలో ఎవరినీ నిందించకండి. ఎందుకంటే, మంచి వ్యక్తులు మాత్రమే మీకు ఆనందాన్ని ఇస్తారు. చెడు వ్యక్తులు మీకు అనుభవాన్ని ఇస్తారు. చెత్తవారు మీకు గుణపాఠం చెబుతారు. ఉత్తమమైన వారు మీకు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోతారు’ అని పోస్ట్ చేశారు. గోయెంకా తెలిపిన వ్యక్తులు మీకూ పరిచయం అయ్యారా?

News October 21, 2024

సుప్రీంలో గ్రూప్-1 అభ్యర్థులకు దక్కని ఊరట

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల అంశంలో అభ్యర్థులకు చుక్కెదురైంది. పరీక్షల రీషెడ్యూల్, జీవో 29 రద్దుపై గ్రూప్-1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం తిరస్కరించింది. ఇవాళ జరిగే పరీక్ష కోసం అభ్యర్థులు కేంద్రాల్లోకి వెళ్లారని, ఇలాంటి సమయంలో తాము జోక్యం చేసుకోలేమని పిటిషన్‌ను కొట్టేసింది. ఈ అంశంలో మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చేందుకు నిరాకరించింది.

News October 21, 2024

పుతిన్‌ను భారత్ ఆపగలదు: బ్రిటన్ మాజీ ప్రధాని

image

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు మీడియేషన్ చేయగల క్రెడిబిలిటీ భారత్‌కు ఉందని బ్రిటన్ మాజీ PM డేవిడ్ కామెరాన్ అన్నారు. అవతలి భూభాగాన్ని ఫోర్స్‌తో ఆక్రమించకుండా పుతిన్‌ను ఆపగలదని చెప్పారు. మూడో హయాం ఆరంభంలో ఇంత ఎనర్జీతో మోదీ స్పీచ్ చూడటం చాలా బాగుందన్నారు. ‘ఇండియా సెంచరీ’ని తాను నమ్ముతానని, ఏదో ఒక దశలో దేశం అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుందన్నారు. UNSCలో భారత్‌కు పర్మనెంట్ సీట్ ఉండాల్సిందేనన్నారు.

News October 21, 2024

పాస్ ఓవర్ అంటే ఏంటి?

image

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై దాఖలైన పిటిషన్‌ విచారణను CJI చంద్రచూడ్ <<14413566>>పాస్‌ ఓవర్<<>> చేశారు. అడ్వకేట్లకు ఒకే సమయంలో వేర్వేరు కేసులు ఉన్నపక్షంలో ఏదైనా కేసును పాస్ ఓవర్ చేయమని కోర్టును కోరవచ్చు. అంటే ఆరోజు విచారణకు సిద్ధంగా ఉన్న కేసులన్నీ విచారించిన తర్వాత పాస్ ఓవర్ చేసిన కేసును విచారిస్తారు.

News October 21, 2024

ఎయిరిండియా ప్రయాణికులకు ఖలిస్థానీ ఉగ్రవాది వార్నింగ్

image

భారత విమానాలకు వరుస బెదిరింపుల నడుమ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తీవ్ర హెచ్చరికలు చేశాడు. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని వార్నింగ్ ఇచ్చాడు. గత ఏడాది కూడా ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా అతడిని 2020లో కేంద్రం టెర్రరిస్ట్‌గా ప్రకటించింది.