India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: డ్రగ్స్ నియంత్రణకు స్పెషల్ ఆపరేషన్లు చేపడుతున్నామని అబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ధూల్‌పేటలో నాటుసారా తయారీ నియంత్రించినట్లు మీడియాతో చెప్పారు. GHMC పరిధిలో ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ధూల్‌పేటలో ఉంటున్నాయన్నారు. డ్రగ్స్ నిరోధానికి 1000 మంది పోలీసులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. నిందితులకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆటకు కోచ్‌తో సంబంధం ఉండదని మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ‘కోచ్ లేకున్నా 1983లో భారత్ WC గెలిచింది. 2007లో లాల్‌చంద్, 2011లో గ్యారీ కిర్‌స్టెన్, 2023లో ద్రవిడ్ కోచ్‌గా ఉన్నారు. ఇలా కోచ్ ఎవరనేదాని కన్నా టీమ్ ఎలా ఆడిందనేదే ముఖ్యం. ఆటకు కోచ్‌తో సంబంధం ఉంటుందనుకోవడాన్ని మానాలి’ అని ట్వీట్ చేశారు. దీంతో ఢిల్లీ ప్లేయర్ గంభీర్ కోచ్‌గా రావడాన్ని ముంబై చూడలేకపోతోందంటూ ఆయనపై విమర్శలు వస్తున్నాయి.
పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల వేట షురూ అయింది. ఈ సీజన్‌లో తొలి పతకం సాధించిన జట్టుగా కజకిస్థాన్ నిలిచింది. 10 మీటర్ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ షూటింగ్ విభాగంలో ఆ జట్టు కాంస్యం సొంతం చేసుకుంది. మరోవైపు తొలి బంగారు పతకం సొంతం చేసుకున్న జట్టుగా చైనా నిలిచింది. ఫైనల్ పోరులో రిపబ్లిక్ ఆఫ్ కొరియాపై 16-12 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
శ్రీశైలం జలాశయంలోకి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు 62,262 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 121 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
మాస్ మహారాజ రవితేజ, భాగ్య శ్రీ బోర్సే జంటగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. టీజర్ వీడియోను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కానుండగా ఒకరోజు ముందు ప్రీమియర్ షోలుంటాయని చిత్రయూనిట్ పేర్కొంది.
ఏపీలో ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గత నెల మాదిరి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయనున్నారు. 1వ తేదీనే 99% పూర్తి చేయాలని, ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించాలని సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. పలు కారణాలతో పంపిణీ చేయలేని వారికి మరుసటి రోజు అందించాలన్నారు. ఈ మేరకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ నెల 31నే బ్యాంక్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలన్నారు.
పెరిగిన ప్రాపర్టీ వాల్యూ బట్టే LTCG Tax భారం ఉంటుందట. CAGR 10% మించితే 12.5%, తక్కువుంటే ఇండెక్సేషన్ విధానం బెటర్. Ex.2004లో ₹5L ప్రాపర్టీ 8% CAGRతో ₹23.30L అవుతుంది. ఇండెక్సేషన్ కాస్ట్ ₹16.6L అయితే LTCG ₹7.2L. దీనిపై 20% పన్ను ₹1.45L. కొత్తదాంట్లో LTCG ₹18.30Lపై ₹2.29L కట్టాలి. 12% CAGRతో ప్రాపర్టీ విలువ ₹48.23L, ఇండెక్స్ క్టాస్ ₹16L అవుతాయి. 20% కింద ₹6.3L, 12.5% కింద ₹1.03L Tax చెల్లించాలి.
TG: లాల్ దర్వాజా మహంకాళి బోనాల నేపథ్యంలో HYDలో 48 గంటల పాటు మద్యం షాపులు మూసి వేయాలని అధికారులు ఆదేశించారు. పాతబస్తీతో పాటు మరి కొన్ని చోట్ల రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 30న ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు సైబరాబాద్ పరిధిలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించారు.
ఒలింపిక్స్: 10M ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ పోటీల్లో భారత రెండు జట్లూ విఫలమయ్యాయి. కనీసం ఫైనల్‌కు వెళ్లలేకపోయాయి. క్వాలిఫయర్స్‌లో ఆఖరి వరకు పోరాడిన రమిత-అర్జున్ జోడీ (628.7) ఆరో స్థానంలో నిలిచింది. ఇక ఇలవేణి-సందీప్ జంట (626.3) 12వ స్థానానికి పరిమితమైంది. ఈ పోటీల్లో మన జట్లు పతకాలు సాధిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. క్వాలిఫయర్స్‌లో టాప్-2 జట్లు స్వర్ణం 3, 4 జట్లు కాంస్యం కోసం పోటీపడతాయి.
<<-se>>#Olympics2024<<>>
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేస్తుంటే చుక్కలు కనబడుతున్నాయని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోర్టల్ డౌన్ అవుతోందని కంప్లైంట్స్ చేస్తున్నారు. లాగిన్ అవ్వట్లేదని మరికొందరు వాపోతున్నారు. దేశంలో రిటర్న్స్ ఫైల్ చేసేది 2-3% మంది మాత్రమేనని అయినా ఈ సాంకేతిక సమస్యలేంటని పెదవి విరుస్తున్నారు. కాగా జులై 31లోపు రిటర్నులు దాఖలు చేయకపోతే రూ.5వేలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
Sorry, no posts matched your criteria.