India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో సెటైర్లు వేశారు. ‘కేసీఆర్ రేపటి నుంచి చీల్చి చెండాడుతా అన్నారని తొమ్మిదిన్నరకే అసెంబ్లీకి వచ్చి కూర్చున్నా. ఏం చెండాడారు సార్? ఆయనకు వచ్చే మొహం లేక హరీశ్‌ను పంపించారు. చీల్చి చెండాడే మొనగాడు కేంద్రం అన్యాయం చేస్తే ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదు?’ అని ప్రశ్నించారు.
వర్షాకాలంలో ఎక్కువగా నొరో వైరస్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని GHMC హెచ్చరించింది. ఈక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ వంటివి ఈ వ్యాధి లక్షణాలు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగండి. ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించింది.
‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన హీరోయిన్ త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది గొప్ప నటీనటులతో వర్క్ చేయడం వల్ల తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందరిలాగే తాను కూడా ‘యానిమల్ పార్క్’ మూవీ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. మరోవైపు సినీరంగంలో విమర్శలు సహజమని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వీటిని ఎదుర్కొంటూనే ఉంటారని పేర్కొన్నారు.
TG: బడ్జెట్‌పై బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ తీసుకొచ్చినట్లు తెలిపారు. సత్యదూరమైన మాటలతో భ్రమలు కల్పించవద్దన్నారు. గత ప్రభుత్వం మద్యం దుకాణాల వేలం గడువు కన్నా ముందే ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొంత మంది చేతుల్లో BRS పాలకులు పెట్టారని మండిపడ్డారు.
TG: పాలమూరు జిల్లా దుస్థితికి BRS పార్టీనే కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ‘కరీంనగర్లో ఓడిపోతా అని తెలిసి కేసీఆర్ పాలమూరుకు వచ్చి ఎంపీగా పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించాం. కానీ ఆయన పాలనలో పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలమూరు-రంగారెడ్డి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పదేళ్లుగా పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో వలసలు పెరిగాయి’ అని విమర్శించారు.
భారత్‌కు తొలి క్షిపణిని అందించి మిస్సైల్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నారు అబ్దుల్ కలాం. రాష్ట్రపతిగానూ పనిచేసిన ఆయన పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. 1931, అక్టోబరు 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. 2015 జులై 27న స్వర్గస్థులయ్యారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న బిరుదులు ఆయన పేరు ముందు చేరి మరింత ఇనుమడించాయి. నేడు ఆ మహనీయుని వర్ధంతి.
TG: కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను రాజకీయ కక్షతో నిలిపివేయొద్దని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్‌ను కొనసాగించాలన్నారు. అవసరమైతే ఆ పథకాల ముందు కేసీఆర్ పేరును తొలగించాలన్నారు. రాజకీయాల కోసం గర్భిణులను ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. రేపటి భవిష్యత్తును దెబ్బతీయొద్దని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో మాతాశిశు మరణాల రేటును తగ్గించామని గుర్తు చేశారు.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 16 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. 2013 మే 1 నుంచి 2017 జులై 31 మధ్యలో జన్మించిన వారే అప్లై చేసుకునేందుకు అర్హులు. జనవరి 18న ఆన్లైన్లో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. WEB SITE: <
ఒలింపిక్స్ చరిత్రలో మహిళా అథ్లెట్ల ప్రయాణం చాలా ప్రత్యేకం. తొలి ఒలింపిక్స్‌లో (1896) ఒక్క వనిత కూడా బరిలోకి దిగలేదు. కొత్త ఒలింపిక్స్‌కు ప్రాణం పోసిన పియరీ కౌబెర్టినే ‘ఒలింపిక్స్‌లో మహిళలు ఏంటి?’ అని అనేశారట. మహిళలు పాల్గొంటే గేమ్స్ ఆసక్తికరంగా ఉండవని కొట్టిపారేశారు. కానీ ఎట్టకేలకు 1900లో తొలిసారిగా మహిళలకు ఒలింపిక్స్ తలుపులు తెరుచుకున్నాయి. ఐదు క్రీడల్లో 22 మంది మహిళలు పాల్గొన్నారు. <<-se>>#Olympics2024<<>>
1976 వరకు 20%లోపే ఉన్న మహిళల సంఖ్య క్రమంగా పెరిగింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఈ సంఖ్య 48%కు చేరింది. 11,420 అథ్లెట్లలో 5,457 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో వీరి సంఖ్య దాదాపు 50% (5,416)కు చేరడంతో ఇది లింగ సమానత్వం సాధించిన తొలి ఒలింపిక్స్ అని నిర్వహకులు చెబుతున్నారు. ఇక భారత్ విషయానికొస్తే అబలలే మనల్ని ప్రపంచం ముందు తలెత్తుకునేలా చేసిన సందర్భాలు ఎన్నో! <<-se>>#Olympics2024<<>>
Sorry, no posts matched your criteria.