India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 26 నుంచి పారిస్ ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. కాగా ఒలింపిక్స్ చరిత్రలో అమెరికా అత్యధికంగా 2,629 మెడల్స్ సాధించింది. భారత్‌కు 35 పతకాలు వచ్చాయి. 1896-1, 1928-1, 1932-1, 1936-1, 1948-1, 1952-2, 1956-1, 1960-1, 1964-1, 1968-1, 1972-1, 1980-1, 1996-1, 2000-1, 2004-1, 2008-3, 2012-6, 2016-2, 2020-7 చొప్పున ఇండియాకు పతకాలు వచ్చాయి. మరి ఈ సారి భారత్‌కు ఎన్ని పతకాలు వస్తాయో కామెంట్ చేయండి.
భారత ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా మనోలో మార్క్వెజ్‌ను AIFF నియమించింది. స్పెయిన్‌కు చెందిన మార్క్వెజ్ ఐఎస్‌ఎల్‌లో ఇప్పటికే హైదరాబాద్ ఎఫ్‌సీ, ఎఫ్‌సీ గోవాకు కోచ్‌గా వ్యవహరించారు. ఆయన ఆధ్వర్యంలోనే హైదరాబాద్ ఎఫ్‌సీ ఐఎస్ఎల్ విజేతగా నిలిచింది. ప్రస్తుతం గోవా హెడ్ కోచ్‌గా ఉంటూనే భారత్‌కూ సేవలు అందించనున్నారు.
అనారోగ్యంతో ఉన్న ఓ యువతి తలలోకి మాంత్రికుడు 22 సూదులు గుచ్చాడు. ఈ ఘటన ఒడిశాలోని సింధికేళాలో జరిగింది. రేష్మ అనే యువతి తరచూ అనారోగ్యానికి గురవుతోంది. దీంతో ఆమె తండ్రి విష్ణు బెహరా మాంత్రికుడు తేజ్ రాజ్ దగ్గరికి తీసుకెళ్లారు. అతడు చికిత్స నెపంతో ఆమె తలలోకి 22 సూదులు గుచ్చాడు. నొప్పితో విలవిల్లాడిపోయిన రేష్మను ఆస్పత్రికి తరలించగా 8 సూదులు బయటికి తీశారు. పోలీసులు నిందితుడు తేజ్‌ను అరెస్ట్ చేశారు.
నీట్-పీజీ పరీక్ష కేంద్రాల ఆప్షన్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వెబ్‌సైట్‌లో కేంద్రాల ఆప్షన్ ఇచ్చుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోంది. ఎల్లుండి గడువు ముగియనుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీనికి అధికారులు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
AP: భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని ఘాట్ రోడ్లను మూసేశారు. పాడేరు, అరకు, చింతపల్లి, మారేడుమిల్లి ఘాట్‌రోడ్లను రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు క్లోజ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(EPFO) వెబ్‌సైట్ తరచూ సాంకేతిక సమస్యలతో వినియోగదారుల సహనానికి పరీక్ష పెడుతుంటుంది. ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని EPFO ఆఫీసర్ల అసోసియేషన్ కేంద్రానికి లేఖ రాసింది. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ సమస్య ఇటీవల తీవ్రమైందని తెలిపింది. మెరుగైన సేవలు అందించేందుకు తమ సాఫ్ట్‌వేర్, హార్డ్ వేర్, ఐటీ మ్యాన్ పవర్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరముందని పేర్కొంది.
AP: పల్నాడు జిల్లా వినుకొండ <<13650476>>హత్య<<>> గంజాయి వల్లే జరిగిందని వైసీపీ నేతలే ఒప్పుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ పెంచి, పోషించిన గంజాయి, డ్రగ్స్ సంస్కృతి వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో శ్వేతపత్రాల్లోని వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఢిల్లీ వెళ్తామని డ్రామాలు ఆడుతున్నారని TDP ఎంపీలతో సమావేశంలో విమర్శించారు.
తనకు విమానంలో జిందాల్ స్టీల్ సీఈవో <<13660340>>దినేశ్ కుమార్<<>> పోర్న్ వీడియోలు చూపించి, లైంగికంగా వేధించారని అనన్య అనే యువతి చేసిన ఫిర్యాదుపై ఆ సంస్థ స్పందించింది. దినేశ్ కుమార్ 2023 మార్చి 28న కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించింది. అయితే దినేశ్ ప్రస్తుతం ఇదే కంపెనీకి చెందిన వాల్కన్ గ్రీన్ స్టీల్‌లో CEOగా ఉండగా ఆయనపై విచారణ జరిపి సెలవుపై పంపినట్లు తెలుస్తోంది.
AP: కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని ఎంపీలకు CM చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. TDP పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో మాట్లాడారు. ‘మంత్రులను వెంటబెట్టుకుని కేంద్రమంత్రుల్ని కలవాలి. విభజన హామీల పరిష్కారానికి కృషి చేయాలి’ అని సూచించారు. ఢిల్లీలో జగన్ ధర్నా అంశం ప్రస్తావనకు రాగా.. ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు, మనమేం చేయాలనేదే ముఖ్యమని CM అన్నారు. AP అభివృద్ధి కోసం పోటీపడి పని చేయాలన్నారు.
TG: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద రావడంతో నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. చెరువు పూర్తి సామర్థ్యం 514 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.
Sorry, no posts matched your criteria.