India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఇక చాలు సైలెంట్‌గా ఉండండి’ అని అర్థం వచ్చేలా ఆయన ఎమోజీని ట్వీట్ చేశారు. దీనిని ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ‘ఇక చాలు’ డైలాగ్‌తో పోలుస్తూ ప్రచారం ఆపమనే ప్రశాంత్ అలా ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఎదురొడ్డుతోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 231/3 రన్స్ చేసింది. మరో 125 రన్స్ వెనుకబడి ఉంది. కోహ్లీ 70, సర్ఫరాజ్ ఖాన్ 70*, రోహిత్ 52, జైస్వాల్ 35 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 రన్స్‌కే ఆలౌట్ కాగా కివీస్ 402 పరుగులు చేసింది.
నావి ఫిన్‌సర్వ్‌తో పాటు 3 NBFCs లోన్లు ఇవ్వకుండా RBI నిషేధం విధించడం ఫిన్‌టెక్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది. గ్రోత్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలన్న మైండ్‌సెట్టే వేటుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. రూల్స్ పాటించకపోవడం, ఇష్టారీతిన ఎక్కువ వడ్డీకి రుణాలివ్వడం, ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్, రుణ గ్రహీతల ఆర్థిక స్తోమత పట్టించుకోకపోవడం, ప్రాపర్‌గా లేని ఇన్‌కం అసెస్‌మెంట్లను RBI సీరియస్‌గా తీసుకుంది.
టెస్టుల్లో విరాట్ కోహ్లీ 9వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన హాఫ్ సెంచరీ దాటారు. ఈక్రమంలో ఈ ఘనత అందుకున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన క్రికెటర్లలో రెండో స్థానంలో ఆయన కొనసాగుతున్నారు. 596 ఇన్నింగ్స్‌లలో ఆయన 221 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో సచిన్(264) అగ్రస్థానంలో ఉన్నారు.
TG: గ్రూప్-1 అభ్యర్థుల కోసం ఎంతవరకైనా పోరాడతానని కేంద్రమంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. జీవో 29 ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గొడ్డలిపెట్టని ఆయన అభివర్ణించారు. మెయిన్స్‌ను రీషెడ్యూల్ చేసేవరకు ఉద్యమిస్తానని బండి వెల్లడించారు. మరోవైపు పరీక్ష వాయిదా వేయాలంటూ HYD అశోక్‌నగర్‌లో రోడ్లపైకి వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మరెవరూ నిరసనకు దిగకుండా అక్కడ భారీగా మోహరించారు.
TG: మూసీని కంపు చేసింది టీడీపీ, కాంగ్రెస్ అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక వ్యర్థాలు 90 శాతానికిపైగా మూసీలోనే కలుస్తున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందే మూసీ మురికి కూపంగా మారిందన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో డీపీఆర్ మూసీ కోసం రూ.16,634 కోట్లతో ప్రణాళికలు చేశామని పేర్కొన్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, గద్వాల్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, నారాయణ్‌పేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ నెల 21 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థులకు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో చుక్కెదురైంది. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. పరీక్షల నిర్వహణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అటు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండటంతో అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.
రాజకీయాల్లో బిజీగా ఉన్న Dy.CM పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్‌లో పాల్గొన్నారు. అందులోని ఫస్ట్ సింగిల్‌ను పాడినట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించగా, దానికి సంబంధించిన మరో న్యూస్ వైరలవుతోంది. స్టూడియోలో కాకుండా వీరమల్లు సెట్‌లో గంట వ్యవధిలోనే ఆయన పాటను రికార్డ్ చేసినట్లు సమాచారం. మరోవైపు NOV 10లోగా షూటింగ్‌ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టనున్నట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి.
హిందీ భాషకు మాసోత్సవాలు జరపడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలతో పాటు హిందీ మాసోత్సవాల్ని నిర్వహిస్తున్నారని పేర్కొంటూ PM మోదీకి లేఖ రాశారు. ‘రాజ్యాంగం ఏ భాషకూ జాతీయ భాష హోదా ఇవ్వలేదు. హిందీ భాషేతర రాష్ట్రాల్లో హిందీ మాసోత్సవాల నిర్వహణ సరికాదు. ఒకవేళ అలా నిర్వహించాలంటే ఆయా రాష్ట్రాల భాషలకూ ఉత్సవాలు చేయాలనేది నా సూచన’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.