India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జర్మనీలో దీర్ఘ శ్రేణి క్షిపణుల్ని మోహరించాలని నిర్ణయించిన అమెరికాకు రష్యా తీవ్ర హెచ్చరికలు చేసింది. అగ్రరాజ్యం అలా చేస్తే తాము అణు క్షిపణుల్ని రంగంలోకి దించేందుకు ఏమాత్రం వెనుకాడమని తేల్చిచెప్పింది. ‘అది కరెక్టేనని వారు భావిస్తే మేం కూడా స్పందిస్తాం. ఎటువంటి పరిమితులు లేకుండా ఆయుధాలను మోహరించి ప్రతిదాడులు చేస్తాం. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా ఇది మాకు తప్పదు’ అని స్పష్టం చేసింది.
యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఆయనతో కలిసి పనిచేయడం కష్టమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఇటీవల US ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ తాము గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధంపై పట్టించుకోమన్నారు. దీనిపై జెలెన్ స్కీ స్పందిస్తూ వారు మా గురించి పట్టించుకోకపోయినా మేము USతో కలిసి పని చేస్తామని చెప్పారు. మరోవైపు తాను గెలిస్తే యుద్ధానికి పరిష్కారం తీసుకొస్తానని ట్రంప్ అన్నారు.
AP: వైఎస్ జగన్‌కు దమ్ముంటే ఆయన హయాంలో జరిగిన అఘాయిత్యాలపై PM మోదీకి లేఖ రాయాలని హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. ‘వివేకా హత్య కేసు దర్యాప్తు, డాక్టర్ సుధాకర్‌ను హింసించి చంపడం, జడ్జి రామకృష్ణపై దాడి వంటి ఘటనలపై విచారణ కోరుతూ జగన్ లేఖ రాయాలి. శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన ట్వీట్ చేయడం హాస్యాస్పదం’ అని పేర్కొన్నారు. YCP వర్గాలు రెచ్చగొట్టినా కూటమి శ్రేణులు సంయమనం పాటించాలని సూచించారు.
TG: ఆగస్టులో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను సెప్టెంబర్ లేదా డిసెంబర్‌కు వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. DSC పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్-2 ఉండటంతో వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్ల నేపథ్యంలో సర్కార్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు MP కిరణ్, MLC వెంకట్ కూడా అభ్యర్థుల డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. దీంతో పరీక్షలు వాయిదా పడే ఛాన్స్ కనిపిస్తోంది.
AP: గోదావరికి వరద పోటెత్తుతోంది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.80 అడుగులకు చేరడంతో అధికారులు 175 గేట్లను ఎత్తారు. 3లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అటు వరద ఉద్ధృతి నేపథ్యంలో లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. మరోవైపు గోదావరికి వరద పెరగడంతో దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది.
TG: రూ.లక్ష రుణమాఫీలో నల్గొండ జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. అత్యధికంగా ఈ జిల్లా నుంచి 83,124 మంది రైతుల క్రాప్ లోన్లు రూ.454.49 కోట్లు మాఫీ అయ్యాయి. ఆ తర్వాత సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2,781 మంది రైతుల క్రాప్ లోన్లు రూ.12.23 కోట్లు మాఫీ అయ్యాయి. నియోజకవర్గాల వారీగా ఆందోల్ తొలి స్థానంలో ఉండగా, అత్యల్పంగా మల్కాజిగిరిలో ఒక్కరికే రుణమాఫీ అయింది.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,223 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,549 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు సమకూరింది.
AP: <<13656916>>పెద్దవాగు<<>> కట్ట తెగడంతో ఏలూరు జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు అర్ధరాత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వరద ఉద్ధృతికి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా రాకపోకలు నిలిచిపోయాయి.
TG: రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వానలు పడతాయని IMD <<13657926>>హెచ్చరించింది<<>>. ఈనేపథ్యంలో రానున్న 2 గంటల్లో ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్, MBNR, నాగర్‌కర్నూల్, NLG, నారాయణపేట్, నిర్మల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
పుదుచ్చేరిలో సుందర్‌రాజన్ అనే సామాజిక వేత్త విద్యుత్ ఛార్జీల భారంపై వినూత్న నిరసన తెలిపారు. గోచీ, నామాలతో విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి బిల్లు చెల్లించారు. బిల్లులతో ప్రజల గోచీని కూడా అధికారులు దోచేసేలా ఉన్నారని చెప్పేందుకే ఇలా నిరసన తెలిపానని ఆయన పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో రాయితీలు లభిస్తున్నా, తమ వద్ద మాత్రం దారుణంగా వసూలు చేస్తున్నారని రాజన్ వాపోయారు.
Sorry, no posts matched your criteria.