news

News July 18, 2024

రుణమాఫీ.. రైతులకు పోలీసుల విజ్ఞప్తి

image

తెలంగాణ ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను జమ చేయనుంది. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రైతుల అకౌంట్ ఖాళీ చేసేందుకు ఫేక్ మెసేజ్‌లు, APK ఫైల్స్ పంపిస్తున్నారు. ఈక్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని లింక్స్, APK ఫైల్స్‌ను ఓపెన్ చేయొద్దని, ఓటీపీలు చెప్పొద్దని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ క్రైమ్‌కు గురైతే 1930కి ఫోన్ చేయాలని, <>https://cybercrime.gov.in<<>> వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

News July 18, 2024

ఛార్జీల ఎఫెక్ట్: BSNLకు పెరుగుతున్న సబ్‌స్క్రైబర్లు!

image

ప్రైవేటు రంగ టెలికం సంస్థలు ఛార్జీలను పెంచడంతో BSNLకు ఆదరణ పెరుగుతోంది. ఈ నెల 3,4 తేదీల్లో ప్రైవేటు ఆపరేటర్ల ఛార్జీల ప్రకటనల తర్వాత బీఎస్ఎన్ఎల్‌కు సబ్‌స్ర్కైబర్లు పెరగడం ప్రారంభమైంది. గడచిన 2వారాల్లోనే 2.5 లక్షలమంది పోర్టబిలిటీ ద్వారా, 25 లక్షలమంది కొత్త కనెక్షన్ల ద్వారా ఆ సంస్థలోకి వచ్చినట్లు ఎకనమిక్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. BSNLలో రూ.108కే అపరిమిత కాల్స్, డేటా ఉండటం విశేషం.

News July 18, 2024

పల్నాడు హత్య ఘటన అత్యంత దారుణం: రోజా

image

AP: పల్నాడు(D) వినుకొండలో YCP కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపడం దారుణమని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘మీకు ప్రజలు అధికారం ఇచ్చింది సంక్షేమం చేయమని చంద్రబాబు గారు. ఇలా ప్రత్యర్థి పార్టీ నాయకులను, కార్యకర్తలను చంపడానికి కాదు’ అని ట్వీట్ చేశారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసంతో ఏపీని హత్యాంధ్రప్రదేశ్‌‌గా మార్చారని ఆరోపించారు.

News July 18, 2024

రాహుల్ గాంధీని సన్మానిద్దాం: CM రేవంత్

image

TG: రైతులకు పంట రుణ మాఫీ చేసిన శుభ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని త్వరలో సన్మానిద్దామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ రైతు రుణమాఫీకి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాహుల్‌ను సన్మానించేందుకు ఈ నెలాఖరున వరంగల్‌లో భారీ సభ నిర్వహిద్దామని, దానికి లక్షలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు.

News July 18, 2024

చైల్డ్ పోర్న్ చూడటం నేరం కాదు: కర్ణాటక HC

image

కేవలం చైల్డ్ పోర్న్ చూడటం నేరంగా పరిగణించలేమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. తన క్లయింట్ చైల్డ్ పోర్న్ చూశారని, కానీ దాన్ని సర్క్యులేట్ చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. IT చట్టంలోని సెక్షన్ 67B ప్రకారం అతడు పోర్న్‌ను ప్రచురించడం/ప్రసారం చేయలేదని పేర్కొన్న కోర్టు అతడికి ఉపశమనం కలిగించింది. కాగా 50 నిమిషాల పాటు చైల్డ్ పోర్న్ చూశాడనే కారణంతో 2022 మార్చిలో ఈ కేసు నమోదైంది.

News July 18, 2024

BREAKING: రైతు రుణమాఫీ ప్రారంభం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర సచివాలయంలో బటన్ నొక్కి రూ.6,098 కోట్ల నిధులను రిలీజ్ చేశారు. దీని వల్ల తొలి విడతలో రూ.లక్ష వరకు లోన్ తీసుకున్న 11.08 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి కలగనుంది. ఈ నెలాఖరులోగా రూ.లక్షన్నర, ఆగస్టులో రూ.2 లక్షల వరకు మాఫీతో ప్రక్రియ పూర్తి చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు.

News July 18, 2024

గెట్ రెడీ.. అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి ‘ఆడు జీవితం’

image

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సూపర్ హిట్ మూవీ ‘ఆడు జీవితం’ ఇవాళ అర్ధరాత్రి నుంచి OTTలోకి అందుబాటులోకి రానుంది. జులై 19 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కేరళ నుంచి సౌదీకి వలస వెళ్లిన ఒక కూలీ పడే కష్టాలే ఈ చిత్ర కథాంశం. మార్చి 28న థియేటర్లలో రిలీజవగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

News July 18, 2024

రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు: సీఎం

image

TG: రైతు రుణమాఫీ చేసేందుకు రేషన్ కార్డు ప్రామాణికం కాదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. భూమి ఉండి, బ్యాంకులో పాస్ బుక్ పెట్టి లోన్ తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. రేషన్ కార్డు తప్పనిసరి అని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొలి విడతలో రూ.6,098 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం చెప్పారు.

News July 18, 2024

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు

image

‘డబుల్ ఇస్మార్ట్’లోని ‘మార్ ముంతా చోడ్ చింతా’ సాంగ్‌పై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు.. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. BRS నేతలు రజితారెడ్డి, సతీష్ కుమార్ ఎల్బీనగర్ డీసీపీకి కంప్లైట్ ఇచ్చారు. ఐటెం సాంగ్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడి డైలాగ్‌ ‘ఏం చేద్దాం అంటావ్ మరి’ని ఎలా వాడుతారంటూ మండిపడ్డారు. ఇవి తమ మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News July 18, 2024

20న నీట్ ఫలితాలు విడుదల చేయండి: సుప్రీంకోర్టు

image

ఈ నెల 20వ తేదీన నీట్ యూజీ ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరోజు మధ్యాహ్నం 12 గంటలలోపు రిజల్ట్స్ ప్రకటించాలంది. పరీక్షా కేంద్రం, నగరాల వారీగా ఫలితాలను ఇవ్వాలని పేర్కొంది.
పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలు వెల్లడించేటప్పుడు విద్యార్థులు వివరాలు కనిపించకుండా చూడాలంది. నీట్- యూజీ సంబంధిత పిటిషన్‌లపై <<13652777>>విచారణ<<>>ను జులై 22కి వాయిదా వేసింది.