news

News July 17, 2024

టెస్టుల్లోకి రింకూ సింగ్?

image

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ త్వరలోనే టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా రింకూ ఆటపై భారత మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘T20WC సమయంలో నెట్స్‌లో రింకూ బ్యాటింగ్ చూసినప్పుడు అతనిలో ఓ టెస్ట్ క్రికెటర్ ఉన్నాడనిపించింది. టెస్టు ఫార్మాట్ ఆడగలిగే సత్తా ఆయనకు ఉంది. త్వరలోనే రింకూ టెస్టుల్లో అరంగేట్రం చేస్తారు’ అని రాథోడ్ వ్యాఖ్యానించారు.

News July 17, 2024

‘సర్దార్ 2’ సెట్లో ప్రమాదం.. స్టంట్ మ్యాన్ మృతి

image

కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న ‘సర్దార్ 2’ మూవీ సెట్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్టంట్ మ్యాన్ ఎజుమలై మరణించారు. చెన్నైలో ఫైట్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎజుమలై 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డారు. దీంతో ఆయన ఛాతీ భాగంలో తీవ్రగాయం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 17, 2024

విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్ అంటే?

image

J&Kలో ఉగ్రమూకలను కట్టడి చేసేందుకు 1995లో నాటి కేంద్ర ప్రభుత్వం ఈ విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్ తీసుకొచ్చింది. సెన్సిటివ్ ప్రాంతాల్లో గ్రామస్థుల స్వీయ రక్షణ కోసం ఇవి ఏర్పాటయ్యాయి. మాజీ జవాన్/పోలీస్ ఈ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తారు. గ్రామానికి గరిష్ఠంగా 15 మందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. 2023కి ఈ విలేజ్ గ్రూప్స్ సంఖ్య 4,153గా ఉంది. <<13645609>>తాజా<<>> పరిస్థితులతో J&Kలో ఈ గ్రూప్స్ కీలకంగా మారే అవకాశం ఉంది.

News July 17, 2024

ఎమ్మెల్యేలను లాక్కున్నా పార్టీకి ఏం కాదు: హరీశ్ రావు

image

TG: కొందరు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా BRSకు ఏమీ కాలేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. వైఎస్సార్ హయాంలోనూ ఎమ్మెల్యేలను లాక్కున్నా తమ పార్టీ అలాగే ఉందని చెప్పారు. పటాన్ చెరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గూడెం మహిపాల్ రెడ్డిని మూడు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిందని గుర్తుచేశారు. రుణమాఫీ అమలులో నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News July 17, 2024

‘విడుదల పార్ట్ 2’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

image

విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘విడుదల పార్ట్ 2’. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లను గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది. ‘విడుదల’కు కొనసాగింపుగా ఈ చిత్రం వస్తోంది. సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు.

News July 17, 2024

కుక్కల దాడిలో బాలుడి మృతి.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: కుక్కల దాడిలో బాలుడి <<13644434>>మృతి<<>> తనను కలచివేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్/టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. వీధి కుక్కల దాడులకు కారణాలను విశ్లేషించడానికి పశువైద్యులు, బ్లూక్రాస్ సంస్థల ప్రతినిధులతో కమిటీ వేయాలని సీఎం చెప్పారు.

News July 17, 2024

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలను తరిమికొట్టిన స్థానికులు!

image

జమ్మూకశ్మీర్‌లో మరోసారి అలజడి సృష్టిద్దామనుకున్న ఉగ్రమూకలను అక్కడి స్థానికులు తిప్పికొట్టారు. ఇటీవల నలుగురు జవాన్లను ముష్కరులు బలి తీసుకున్న దోడా జిల్లా దెస్సా ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది. మలన్ గ్రామంలో ఈరోజు ఉదయం విలేజ్ డిఫెన్స్ గ్రూప్ పరారీలో ఉన్న ఉగ్రవాదులను గుర్తించి కాల్పులు జరిపింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో గ్రామస్థులు ఎవరూ గాయపడలేదు.

News July 17, 2024

‘నవోదయ’ దరఖాస్తులు ప్రారంభం

image

దేశంలోని నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి(2025-26)లో ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్‌ 16 వరకు ఇది కొనసాగనుంది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఫేజ్-1 ఎగ్జామ్ నవంబర్‌లో, ఫేజ్-2 ఎగ్జామ్ జనవరి-2025లో జరగనున్నాయి. ఫిబ్రవరి-2025లో ఫలితాలు విడుదల కానున్నాయి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News July 17, 2024

మళ్లీ పెరిగిన టమాటా ధరలు

image

టమాటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజుల కిందట రూ.100కు చేరిన కేజీ టమాటా.. ఇటీవల కాస్త తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లలో కేజీ టమాటా రూ.50-60కి లభించింది. ఇప్పుడు మరోసారి రూ.80(గ్రేడ్-ఏ)కి చేరింది. వర్షాలకు దెబ్బతినడం, సరఫరా సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పైపైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. మరి మీ ప్రాంతంలో టమాటా రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి.

News July 17, 2024

ఈక్విటీ మార్కెట్లకు సెలవు… MCX ట్రేడింగ్ ఎప్పుడంటే?

image

మొహర్రం సందర్భంగా ఈరోజు ఈక్విటీ, డెరివేటివ్ విభాగాల్లో ట్రేడింగ్‌కు ఎక్స్‌ఛేంజీలు సెలవు ప్రకటించాయి. ఇన్వెస్టర్లు ఈరోజు స్టాక్స్, బాండ్లను కొనుగోలు/విక్రయించడానికి అవకాశం ఉండదు. మరోవైపు మల్టీ కమొడిటీ ఎక్స్‌ఛేంజీలోనూ మార్నింగ్ సెషన్ అందుబాటులో ఉండదు. MCX తిరిగి సాయంత్రం ప్రారంభమవుతుంది. సా.గం.5 నుంచి రాత్రి గం.11.30 వరకు ట్రేడింగ్ ఉంటుంది. పెట్రోల్, గోల్డ్ మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి.