news

News July 17, 2024

రైతు కుటుంబాలన్నీ రుణవిముక్తి పొందాలి: సీఎం రేవంత్

image

TG: రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ రెడ్డి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి జీవితాల్లో సుఖసంతోషాలు, సకల శుభాలు కలగాలని ప్రార్థించారు. ప్రభుత్వం తీసుకున్న రూ.2లక్షల రుణమాఫీ నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణవిముక్తి పొందాలని ఆకాంక్షించారు. అటు కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యతకు వారధిగా మొహర్రం నిలుస్తుందన్నారు. గ్రామాల్లో హిందూ, ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపు నిర్వహించడాన్ని CM గుర్తు చేసుకున్నారు.

News July 17, 2024

ప్రజలందరికీ ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలు కలగాలి: చంద్రబాబు

image

AP: తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ప్రజలందరికీ ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అటు పవిత్ర మొహర్రం నేపథ్యంలో ముస్లిం సోదరసోదరీమణులకు శుభం జరగాలనే అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు. సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన ఇమామ్ హుస్సేన్ జీవితం ఆదర్శమని కొనియాడారు.

News July 17, 2024

వారికి జీతాలు విడుదల

image

AP: కేజీబీవీ టీచర్లు, సీఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు సమగ్రశిక్ష పరిధిలోని ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న మే, జూన్ నెలలకు సంబంధించి రూ.122.23 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఉద్యోగుల జీతాలకు రూ.105.2కోట్లు, విద్యార్థుల భోజన నిర్వహణ ఖర్చులకు రూ.17.02 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

News July 17, 2024

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ రేసులో ఉన్న తెలుగు చిత్రాలివే..

image

✿ సలార్
✿ బేబీ
✿ బలగం
✿ దసరా
✿ హాయ్ నాన్న
✿ మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి
✿ సామజవరగమన
☛ మరి మీ ఓటు ఏ సినిమాకో కామెంట్ చేయండి.

News July 17, 2024

ఆధార్ లేనివారికి అలర్ట్

image

AP: ఆధార్ నమోదు కోసం ఈనెల 23 నుంచి 27 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 0-5 ఏళ్లలోపు వారికి కొత్త ఆధార్ నమోదుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1.36 కోట్ల మంది డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ప్రత్యేక శిబిరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

News July 17, 2024

త్వరలో ఫేమ్-3 అమలు: కేంద్ర మంత్రి

image

ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్ పథకం మూడో దశను త్వరలోనే అమలు చేస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు. వచ్చే బడ్జెట్లో దీనిపై ఎలాంటి ప్రకటన ఉండబోదన్నారు. ఫేమ్-3 అమలుపై మంత్రిత్వ శాఖల నుంచి సిఫార్సులు అందాయని తెలిపారు. హైబ్రిడ్ వాహనాల పన్ను తగ్గింపుపై ప్రధాని అధ్యక్షతన నిర్ణయం తీసుకుంటామన్నారు. దానికి అనుగుణంగా ఆర్థిక శాఖ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.

News July 17, 2024

ఆసుపత్రి నుంచి కవిత డిశ్చార్జ్

image

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జ్ అయ్యారు. ఆమెను పోలీసులు తిహార్ జైలుకు తరలించారు. జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతుండటంతో నిన్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

News July 17, 2024

ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర?

image

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు ఆ దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందించింది. ఇటీవల జరిగిన దాడికి ముందే ఈ నివేదికను ఇచ్చింది. దీంతో ట్రంప్‌కు సీక్రెట్ సర్వీస్ భద్రతను పెంచింది. ట్రంప్‌పై కాల్పులు జరిపిన మాథ్యూ క్రూక్స్‌కు ఇరాన్‌తో ఎలాంటి సంబంధం లేదని అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు ట్రంప్‌పై కాల్పుల వెనుక ఉక్రెయిన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

News July 17, 2024

సెప్టెంబర్ 26న యూఎన్‌లో మోదీ ప్రసంగం!

image

ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26న సభను ఉద్దేశించి ప్రసంగించే వారి ప్రాథమిక జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. తుది జాబితా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. యూఎన్ సాధారణ మండలి సమావేశాలు సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు జరగనున్నాయి. కాగా మోదీ చివరి సారిగా 2021 SEPTలో జరిగిన వార్షిక సమావేశాల్లో యూఎన్ వేదికపై ప్రసంగించారు.

News July 17, 2024

ఘోరం.. బాలుడిని పీక్కుతిన్న కుక్కలు

image

TG: HYD శివారు జవహర్‌నగర్‌లో దారుణం జరిగింది. ఏడాదిన్నర బాలుడు విహాన్ నిన్న రాత్రి ఇంటిబయట ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. జుట్టును నోట కరుచుకొని ఈడ్చుకెళ్లాయి. కుక్కులు పీక్కుతినడంతో విహాన్ శరీరం ఛిద్రమైంది. జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి. బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. రాష్ట్రంలో కుక్కల దాడులు పెరిగినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.