news

News July 17, 2024

రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు అధికారులు: మంత్రి తుమ్మల

image

TG: అర్హులైన రైతులకు రేషన్‌కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు అధికారులు వచ్చి పరిశీలిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 33 బ్యాంకులు రైతులకు రుణాలిచ్చాయని, నకిలీ పట్టా పాసు పుస్తకాలు పెట్టి లోన్లు తీసుకున్న వారిని గుర్తించామని చెప్పారు. రూ.లక్ష జీతం ఉన్న వారికి రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారు.

News July 17, 2024

ఏకాదశి పూజలో ఇది ఉండాల్సిందే..

image

ఇవాళ తొలి ఏకాదశి. ఉదయమే పవిత్రస్నానం ఆచరించి, శ్రీమహావిష్ణువును పూజించాలి. తులసి అంటే ఆయనకు చాలా ఇష్టం. అది లేనిదే విష్ణువు పూజ అంగీకారం కాదని భక్తుల విశ్వాసం. అందుకే పూజలో తులసి తప్పనిసరిగా ఉపయోగించాలి. ఏకాదశి వ్రతం విరమించే సమయంలోనూ తులసీదళం నోట్లో వేసుకోవాలి. ఇక విష్ణుమూర్తి ఉసిరి చెట్టుపై నివసిస్తాడని ప్రతీతి. ఏకాదశి వ్రతంలో ఉసిరికాయకు కూడా ప్రత్యేక స్థానం ఉంది.

News July 17, 2024

గుజరాత్‌లో చాందీపురా వైరస్ కలకలం.. 8 మంది మృతి

image

గుజరాత్‌లో <<13622079>>చాందీపురా<<>> వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 14 కేసులు నమోదవగా, 8 మంది మృతిచెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రిషికేశ్ పటేల్ తెలిపారు. రోగుల రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు పేర్కొన్నారు. ఈ వైరస్ దోమలు, ఇతర కీటకాల ద్వారా సోకుతుంది. బాధితుల్లో జ్వరం, మెదడువాపు, ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి.

News July 17, 2024

రేపు అకౌంట్లలో డబ్బులు జమ

image

TG: రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రేపు(గురువారం) రూ.లక్షలోపు లోన్ ఉన్న అన్నదాతల అకౌంట్లలో సా.4 గంటల వరకు ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. అదేరోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు జరపాలని నిర్ణయించింది. వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారు. పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగానే రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

News July 17, 2024

బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయండి: సీఎం చంద్రబాబు

image

AP: ఈనెల 23న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రకటించాలని కేంద్రమంత్రి అమిత్ షాను CM చంద్రబాబు కోరారు. నిన్న ఆయన ఢిల్లీలో షాతో భేటీ అయ్యారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ధ్వంసమైన రోడ్లు బాగు చేసేందుకు చేయూతనిచ్చి, కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని సీఎం విన్నవించారు.

News July 17, 2024

గిరిజన గ్రామాల్లో త్వరలో తారు రోడ్లు

image

AP: రాష్ట్రంలో 100కి పైగా జనాభా కలిగిన 149 గిరిజన ఆవాస ప్రాంతాల్లో తారు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలిదశలో రూ.280.53 కోట్లతో 130 రోడ్లు వేయనున్నారు. రెండో దశలో మరో 122 ఆవాస ప్రాంతాల్లో నిర్మించేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ‘పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ స్కీమ్ కింద నిర్మించే ఈ రహదారులకు కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు సమకూర్చనున్నాయి.

News July 17, 2024

రేపు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం రహస్య గది

image

ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదిని రేపు తెరవనున్నారు. ఇందుకోసం ఉ.9:51 నుంచి మ.12:15 వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. ఈనెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు తరలించి, వీడియోగ్రఫీ చేయించినట్లు అధికారులు తెలిపారు. రేపు రహస్య గదిలోని సంపదను మరో స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తారు. అనంతరం భాండాగారాన్ని మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తారు.

News July 17, 2024

మెడికల్ కాలేజీల్లో 872 పోస్టులు

image

TG: రాష్ట్రంలోని 8 కొత్త మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం 872 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు, పొరుగుసేవల విధానంలో వీటిని భర్తీ చేయనుంది. ప్రొఫెసర్‌కు ₹1.90L, అసోసియేట్ ప్రొఫెసర్‌కు ₹1.50L, సహాయ ప్రొఫెసర్‌కు ₹1.25L గౌరవ వేతనంగా చెల్లించనుంది. నారాయణపేట, జోగులాంబ గద్వాల, మెదక్, ములుగు, నర్సంపేట, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం కుత్బుల్లాపూర్‌లో ఈ కొత్త కాలేజీలు ఏర్పాటయ్యాయి.

News July 17, 2024

వచ్చే నెలలో ‘హిట్-3’ షూటింగ్ ప్రారంభం?

image

నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబోలో రానున్న ‘హిట్-3’ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. నాని నటించిన ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్‌తోనూ ఆయన ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.

News July 17, 2024

వాట్సాప్‌లో అందుబాటులోకి ‘ఫేవరెట్స్’ ఫీచర్

image

వాట్సాప్‌లో ‘ఫేవరెట్స్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మీరు ముఖ్యమైన కాంటాక్ట్స్‌కు వెంటనే కాల్ చేసేందుకు ఇది సాయపడుతుంది. ఇందుకోసం కాంటాక్ట్స్‌ను ఫేవరెట్స్ లిస్టులోకి యాడ్ చేసుకోవాలి. దీనికోసం యాప్‌లో ‘కాల్స్’ బటన్‌పై క్లిక్ చేయాలి. టాప్‌లో ‘Add to favorites’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కావాల్సిన నంబర్లను సెలక్ట్ చేసి యాడ్ చేయాలి. అవి కాల్స్ ట్యాబ్ క్లిక్ చేయగానే పైన కనిపిస్తాయి.