India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రుణమాఫీకి PM కిసాన్ మార్గదర్శకాలనే పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఐటీ చెల్లింపుదారులకు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే పిల్లల చదువులు, స్టడీ, హౌసింగ్ లోన్ల కోసం కొందరు రైతులు ఆదాయం తక్కువున్నా ఐటీ కడుతున్నారు. అలాంటివారితో పాటు ఐటీ పరిధిలోకి రాని ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వారంలోగా శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగులు తీయనుంది. కర్ణాటకలో భారీ వర్షాలతో వరద ఉద్ధృతి పెరగడంతో ఎగువన ఆల్మట్టి డ్యామ్ మరో 2 రోజుల్లో నిండనుంది. ఆ తర్వాత నారాయణపూర్ రిజర్వాయర్, జూరాల ప్రాజెక్టులు కూడా ఒకటి రెండు రోజుల్లోనే నిండనున్నాయి. దీంతో దిగువన ఉన్న శ్రీశైలానికి నీళ్లను విడుదల చేయనున్నారు. మరోవైపు తుంగభద్ర బేసిన్‌లోనూ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అవి కూడా శ్రీశైలం చేరనున్నాయి.
రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనేటర్ JD వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. దీంతో నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో ఆయన బరిలో ఉండనున్నారు. కాగా వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న వ్యక్తి. ఏపీకి చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. ఉష యేల్ వర్సిటీలో చదివేటప్పుడు వాన్స్‌తో పరిచయమైంది. అది ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఒడిశాలోని పూరీ భాండాగారంలో మరో రహస్య గది ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఈ గదిలో వెలకట్టలేని సంపద దాగి ఉన్నట్లు పేర్కొంటున్నారు. 1902లో బ్రిటిష్ అధికారులు ఈ గదిని అన్వేషించడానికి ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు. పూరీ రాజు కపిలేంద్రదేవ్ ఈ గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన బంగారు సింహాసనాలు, వడ్డాణాలు, పసిడి విగ్రహాలను దాచినట్లు చెబుతున్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌తో డోడా జిల్లాలో ముష్కరుల కోసం జవాన్లు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో అడవుల్లో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో నలుగురు సైనికులు వీరమరణం పొందారని పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా వారం రోజుల క్రితం జరిగిన ఉగ్రకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
TG: బీబీనగర్ ఎయిమ్స్‌లో వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. గత ఏడాది ఓ మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించాడు. వయసు పెరిగే కొద్ది ఆ తోక పెరగడంతో చిన్నారి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. అది వెన్నుపూసతో అనుసంధానమై బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఇటీవల బాలుడికి సర్జరీ చేసి తొలగించారు. నాడీవ్యవస్థకు అటాచ్ అవడంతో సమస్యలు ఎదురవుతాయని భావించినా ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
<<13600394>>నంద్యాల<<>>, <<13625931>>విజయనగరం<<>> జిల్లాల్లో బాలికలపై అఘాయిత్యాలు మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. కొత్తరెడ్డిపాలేనికి చెందిన 8వ తరగతి విద్యార్థిని(13) అదే గ్రామానికి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లోని మంచంపై శవమై కనిపించడం సంచలనం రేపుతోంది. బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో నాగరాజే అత్యాచారం, హత్య చేసి పరారయ్యాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: రేపటి నుంచి నెల్లూరు రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు ఈ పండుగ జరగనుంది. ఇక్కడ ఒకరి నుంచి మరొకరు రొట్టె మార్చుకుంటే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. చదువు రొట్టె, ఆరోగ్య, సంతాన, వివాహ రొట్టె ఇలా 12 రకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. దీనిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈసారి దాదాపు 20 లక్షల మంది వస్తారని అంచనా.
* ద్రావణాలను కలిపే సమయంలో మందు డబ్బాపై ఉన్న సూచనలు పాటించాలి.
* శుభ్రమైన నీటిని వినియోగించాలి
* చేతులకు గ్లౌజులు, తలకు టోపీ, ముఖానికి మాస్క్, కళ్లజోడు పెట్టుకోవాలి
* పిచికారీ చేస్తుండగా గుట్కా నమలడం, సిగరెట్ తాగడం లాంటివి చేయొద్దు
* పిచికారీ పూర్తయ్యాక చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి
* పొలం నుంచి ఇంటికెళ్లాక తలస్నానం చేయాలి
TG: డీఎస్సీ ఉద్యోగాలు పెంచాలని అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5వేలకు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు డిసెంబర్‌లో టెట్ నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల మొత్తం 1,25,058 ఉండగా 1.03 లక్షల మంది విధుల్లో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.