India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇవాళ కోపా అమెరికా <<13631595>>టైటిల్<<>> గెలుపుతో అత్యధిక ట్రోఫీలను(45) సొంతం చేసుకున్న ప్లేయర్‌గా ఘనత సాధించారు. ఇందులో 39 డొమెస్టిక్, క్లబ్ టైటిల్స్ కాగా, మిగతావి ఇంటర్నేషనల్, వరల్డ్ కప్ ట్రోఫీలు. ఈ జాబితాలో అల్వెస్-బ్రెజిల్(43), అషూర్-ఈజిప్ట్(39) టైటిల్స్‌తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కెరీర్‌లో 1,068 మ్యాచ్‌లు ఆడిన మెస్సీ 838 గోల్స్ చేశారు.
తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని తెలిపింది. ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రమాణికంగా తీసుకోనుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్‌ను నార్కోటిక్, SOT, రాజేంద్రనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రకుల్‌పైన కూడా డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 80,664 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,586 వద్ద స్థిరపడ్డాయి. ఫార్మా, ఆయిల్ & గ్యాస్ రంగాలు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. పీఎస్‌యూల్లో ONGC షేర్లు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. 2.5% వృద్ధితో షేర్ విలువ ₹314.70కు చేరింది. శ్రీరామ్ ఫైనాన్స్, SBIలైఫ్, బజాజ్ ఆటో, SBI షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
రాజ్యసభలో ఎన్డీఏ బలం తగ్గింది. తాజాగా నలుగురు BJP నామినేటెడ్ సభ్యుల పదవీకాలం పూర్తి కావడంతో ఆ సంఖ్య 101కి పడిపోయింది. మరోవైపు బీజేపీ బలం 86కు తగ్గింది. ఇండియా కూటమి బలం 87గా ఉంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య 225. ఈ క్రమంలో ఏవైనా బిల్లులకు ఆమోదం తెలపాలంటే NDA కూటమికి ఇతర సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. దీంతో YCP(11), అన్నాడీఎంకే(4) మద్దతు కీలకం కానుంది.
TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ MLC కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత జుడీషియల్ కస్టడీని జులై 22కు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేసింది.
జియో, ఎయిర్‌టెల్, VI ఇటీవల టారిఫ్ ఛార్జీలు భారీగా పెంచినా యూజర్లకు నాణ్యమైన సేవలు అందించడంలో విఫలమవుతున్నాయని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ తెలిపింది. కాల్ డ్రాప్, కనెక్షన్ సమస్యను 89% మంది ఎదుర్కొంటుండగా, 38% మందికి తరచూ ఈ ఇబ్బంది ఎదురవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా మెట్రో నగరాల్లోనూ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే 2022 నాటితో పోలిస్తే ఈ సమస్య స్వల్పంగా తగ్గినట్లు సర్వేలో తేలింది.
TG: KCRపై కాంగ్రెస్ MLA దానం నాగేందర్ విషం కక్కడం ఆశ్చర్యంగా ఉందని కుత్బుల్లాపూర్ BRS MLA <<13632893>>కేపీ.వివేకానంద<<>> అన్నారు. ‘దానం BRSలో ఉన్నప్పుడు KCRను కలిసినప్పుడల్లా ఆయన కాళ్లు మొక్కేవారు. దానం తీరును చూసి మేము కూడా నేర్చుకోవాలనుకున్నాం. HYDలో KCRకు ఉన్న చిన్న ఇల్లు సరిపోదన్నప్పుడు తన ఇంట్లో ఉండమని, తనను మీ కొడుకు అనుకోమని దానం అనేవారు’ అని KP వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ వార్నర్‌ను వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పరిగణనలోకి తీసుకోబోమని ఆస్ట్రేలియా సెలక్టర్ బెయిలీ స్పష్టం చేశారు. అతని కెరీర్ విజయవంతంగా సాగిందన్నారు. మూడు ఫార్మాట్లకు ఆయన సేవలు అందించినా ప్రస్తుతం జట్టు వేర్వేరు ఆటగాళ్లతో వెళ్తోందని తెలిపారు. అంతకుముందు జట్టుకు అవసరమైతే వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని వార్నర్ చెప్పారు.
ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో & స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్లాట్‌ఫామ్ ఫీజులను 20% పెంచేశాయి. ఈ నిర్ణయంతో కస్టమర్ ప్రతి ఆర్డర్‌పై రూ.1 అదనంగా చెల్లించాలి. దేశంలోని చాలా నగరాల్లో రూ.5 ఫీజు వసూలు చేస్తుండగా.. ఇది రూ.6కి పెరిగింది. రోజుకు 10 లక్షల కంటే ఎక్కువ బుకింగ్స్ జరుగుతుండగా ఈ ఫీజు ద్వారా కంపెనీలు రూ.60 లక్షలు పొందుతున్నాయి.
Sorry, no posts matched your criteria.