India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రూమర్ గర్ల్ ఫ్రెండ్ సోఫియా హయత్ సన్యాసినిగా మారారు. భౌతిక ఆనందాల కంటే ఆధ్యాత్మిక మార్గమే ఉత్తమమని ఆమె ఈ మార్గం ఎంచుకున్నారు. 2012 నుంచి మూడేళ్లపాటు రోహిత్, సోఫియా ప్రేమాయణం నడిపినట్లు టాక్. 2015లో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత రోహిత్.. రితికాను, సోఫియా.. వ్లాద్ స్టానెస్కూను పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన ఏడాదికే సోఫియా విడాకులు తీసుకున్నారు.
TG: గీత కార్మికుల రక్షణ కోసం ‘కాటమయ్య రక్ష’ పేరుతో కిట్లను బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రేపు అందించనుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్(మ) లష్కర్‌గూడ గ్రామంలో కిట్లు అందించనున్న సీఎం రేవంత్ ఆ తర్వాత గౌడన్నలతో కలిసి భోజనం చేస్తారు. ఒక్కో కిట్‌లో తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ ఉంటాయి. IIT హైదరాబాద్‌తో కలిసి ఓ ప్రైవేట్ సంస్థ ఈ కిట్లను రూపొందించింది.
AP: కువైట్‌లో అష్టకష్టాలు పడుతున్న ఓ తెలుగు వ్యక్తి ఆవేదనను <<13623419>>’VIRAL: కువైట్‌లో కష్టాలు.. కాపాడాలని వ్యక్తి వీడియో’<<>> శీర్షికతో Way2News ప్రచురించిన కథనం ప్రభుత్వాన్ని కదిలించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరలై మంత్రి లోకేశ్ వరకూ వెళ్లింది. వెంటనే ఆయన స్పందించి, అతడిని భారత్ తీసుకురావాలని భారత విదేశాంగ శాఖను కోరారు. తన కష్టంపై స్పందించిన వే2న్యూస్‌తో పాటు లోకేశ్‌కు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ ఫైనల్లో టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఆ జట్టు ఓవర్లన్నీ ఆడి 156/6కే పరిమితమైంది. షోయబ్ మాలిక్ (41) రాణించారు. కమ్రాన్ అక్మల్ (24), మక్సూద్ (21) ఫరవాలేదనిపించారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. వినయ్ కుమార్, పవన్ నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ తీశారు.
అంతర్జాతీయ డ్రగ్ డీలర్‌ను పట్టుకునేందుకు పోలీసులు టెక్నాలజీని వాడారు. రెండేళ్లుగా పరారీలో ఉన్న 50ఏళ్ల బ్రెజిలియన్ డ్రగ్ లార్డ్ రోనాల్డ్ రోలాండ్‌ను ఇన్‌స్టా పోస్ట్‌లోని లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు. తన భార్యతో కలిసి పారిస్, దుబాయ్, మాల్దీవుల్లో అతడు పర్యటించారు. అయితే వారున్న ప్రదేశాన్ని అతని భార్య ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అతణ్ని బ్రెజిల్‌లోని గ్వరూజ బీచ్ సిటీలో ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు.
AP: కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అత్యవసరమైతే 1070, 112, 18004250101 నంబర్లకు ప్రజలు ఫోన్ చేయాలని సూచించింది.
AP: విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను రూ.27వేల కోట్లతో ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని భావిస్తోంది. ఇదే అంశంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. పోర్టులను అనుసంధానిస్తూ రోడ్లు, వివిధ ప్రాజెక్టులు, లాజిస్టిక్ కారిడార్‌లను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని అధికారులకు సూచించారు.
TG: హీరో రాజ్‌తరుణ్‌పై నమోదైన కేసులో భాగంగా ఫిర్యాదు చేసిన లావణ్య స్టేట్‌మెంట్‌ను HYD నార్సింగి పోలీసులు రికార్డ్ చేశారు. 4 గంటల పాటు వివిధ అంశాలపై ఆమె నుంచి సమాచారం సేకరించారు. సోమవారం మరోసారి విచారణకు హాజరవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్ ఆచూకీ తెలపాలని పోలీసులను కోరినట్లు లావణ్య వెల్లడించారు.
నాలుగో టీ20లో జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. షార్ట్ ఫార్మాట్‌లో వికెట్ కోల్పోకుండా భారత్ ఛేదించిన అత్యధిక లక్ష్యం(153) ఇదే కావడం విశేషం. బంతుల మిగులు(28) పరంగానూ భారత్‌కు ఇదే పెద్ద విజయం. గతంలో పాక్ 200(vsఇంగ్లండ్), కివీస్ 169(vsపాక్), ఇంగ్లండ్ 169(vsఇండియా) పరుగుల లక్ష్యాలను వికెట్ చేజార్చుకోకుండా ఛేదించాయి.
AP: వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ సీఎం చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ సీఎం జగన్‌పై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో చంద్రబాబు దుష్ట సంప్రదాయం అనుసరిస్తున్నారు. మరోవైపు సూపర్ సిక్స్ అంటూ సూపర్ మోసాలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.