India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై మహారాష్ట్ర సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు UPSC పరీక్షకు హాజరుకాకుండానే ఉత్తీర్ణత సాధించినట్లు ధ్రువ్ పేరడీ X అకౌంట్‌లో పోస్టయ్యింది. బిర్లా బంధువు ఫిర్యాదు మేరకు BNS, IT సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. అయితే ధ్రువ్ మెయిన్ అకౌంట్‌కు దీనికి సంబంధం లేదని జర్నలిస్టులు ప్రస్తావించగా, ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
AP: ఆరడుగుల అబద్ధం చంద్రబాబు అని పేర్ని నాని చేసిన విమర్శలపై TDP నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఆరడుగుల నిజాయితీకి నిదర్శనం CBN అని, ఏపీని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. ఐదడుగుల తాచుపాము జగన్ అని, ఆయనకు తన మన భేదం లేదని విమర్శించారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారని ఆరోపించారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రానికి నిధుల కోసం సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు.
గుజరాత్‌లోని సబర్‌కాంతా జిల్లాలో ‘చాందిపుర వైరస్’ లక్షణాలతో నలుగురు చిన్నారులు చనిపోయారు. ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారు. వారి రక్తనమూనాలను పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు వైద్యులు పంపారు. రాబ్డోవిరిడే జాతి దోమలు, ఈగల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది సోకితే జ్వరం, ఫ్లూ, మెదడువాపు లక్షణాలు కనిపిస్తాయి. 1965లో మహారాష్ట్రలోని చాందిపురలో ఈ వైరస్‌ను గుర్తించడంతో అదే పేరు పెట్టారు.
సినిమా నటులపై అసభ్యకర వార్తలు పోస్ట్ చేస్తున్న 5 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయించినట్లు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. కాగా ఇటీవల పలు యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో అసభ్యకర వీడియోలు పోస్ట్ చేస్తున్న వారు 48 గంటల్లో వాటిని తొలగించాలని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారీ విరాళం అందించారు. ట్రంప్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న పొలిటికల్ యాక్షన్ కమిటీకి ఆయన ఈ డొనేషన్ అందజేశారు. కానీ ఎంత ఇచ్చారనే దానిపై క్లారిటీ రాలేదు. ఇటీవల జరిగిన డిబేట్‌లో బైడెన్‌పై ట్రంప్ పైచేయి సాధించారు. దీంతో ట్రంప్ ప్రచారానికి కార్పొరేట్లు భారీ విరాళాలు అందిస్తున్నారు.
TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను ఆర్టీఏ కట్టుదిట్టం చేయనుంది. దీంతో ఇక నుంచి డ్రైవింగ్ టెస్టు ప్రక్రియ కంప్యూటర్‌లో రికార్డు కానుంది. డ్రైవింగ్ సరిగా చేయకపోతే కంప్యూటరే రిజెక్ట్ చేస్తుంది. అధికారులను మ్యానేజ్ చేసే అవకాశం ఉండదు. ఫెయిలైతే నెల తర్వాత టెస్టుకు రావాల్సి ఉంటుంది. కొత్త పద్ధతుల్లో 5 ట్రాకులు(H, S, మలుపులు, ఎత్తుపల్లాలు, గతుకుల K) ఉంటాయి.
TG: రద్దీకి అనుగుణంగా వెయ్యి కొత్త బస్సులు కొనుగోలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మరో 1,500 బస్సులకు ఆర్డర్ ఇచ్చామన్నారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డితో కలిసి కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. తర్వాత మాట్లాడుతూ.. త్వరలో అన్ని జిల్లా కేంద్రాలకు AC బస్సులు, నియోజకవర్గ కేంద్రాల నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామన్నారు. RTC ఉద్యోగులకు 21% DA ఇచ్చామని, వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు సతీమణి కమ్‌లేశ్ ఠాకూర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. కాంగ్రెస్ తరఫున డెహ్రా నుంచి పోటీ చేసిన కమ్‌లేశ్ బీజేపీ అభ్యర్థి హోశ్యార్ సింగ్‌పై 9వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. గత 20 ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
ప్రపంచంలోనే మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం చేసిన తొలి నగరంగా గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్(D)లోని పాలిటనా నిలిచింది. ఈ సిటీలో మాంసం కోసం జీవాలను చంపడం, అమ్మడం, రవాణా చేస్తే చట్ట విరుద్ధమని, అతిక్రమిస్తే శిక్షలు తప్పవని స్థానిక అధికారులు నిబంధనలు తీసుకొచ్చారు. దుకాణాలను మూసేయాలంటూ జైనుల నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఇతర చోట్ల అమలు చేయనున్నారు.
AP: ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ, కమిటీలు ఏర్పాటు చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. ‘పవర్‌లోకి వచ్చేశామనే అలసత్వం వీడాలి. రోజూ ఇద్దరు మంత్రులు పార్టీ ఆఫీసులో ప్రజల వినతులు స్వీకరించాలి. నేతలెవరూ కక్షసాధింపులకు దిగొద్దు. YCP చేసిన తప్పులే మనం చేస్తే వారికి మనకు తేడా ఉండదు. కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల నుంచి చట్టపరంగా విముక్తి కలిగిద్దాం’ అని ముఖ్య నేతలతో సమావేశంలో CBN అన్నారు.
Sorry, no posts matched your criteria.