India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP, TGలో నడిచే 12 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా <
AP: వైసీపీ పాలనను విమర్శించాననే కక్షతో 2021లో తన హత్యకు కుట్ర పన్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తన పుట్టినరోజు నాడే అంతమొందించేందుకు ప్రయత్నించారని చెప్పారు. తనపై హత్యాయత్నం చేసిన వారందరికీ శిక్ష పడాలని ఆయన కోరారు. కూటమి అధికారంలోకి రాకపోయుంటే తనను ఇప్పటికే చంపేసేవారని చెప్పారు.
AP: రాజధాని అమరావతిలోని కట్టడాల పటిష్ఠతపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. సచివాలయాల ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాల బేస్‌మెంట్లు, ఐఏఎస్, ఎన్జీఓల సముదాయాల పటిష్ఠతపై స్టడీ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వీటి పటిష్ఠత నిర్ధారణ బాధ్యతలను ఐఐటీ చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ఐఐటీ చెన్నై ఇచ్చే నివేదిక ఆధారంగా భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ఇంగ్లండ్ పేసర్ గుస్ అట్కిన్సన్ అరుదైన రికార్డు సృష్టించారు. ఆరంగేట్ర టెస్టులోనే 12 వికెట్లు తీసిన ఆరో బౌలర్‌గా, బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్(12/106) నమోదు చేసిన మూడో పేసర్‌గా ఘనత సాధించారు. విండీస్‌పై టెస్టులో ఈ రికార్డును నమోదు చేశారు. 1890లో ఫాస్ట్ బౌలర్ ఫ్రెడ్ మార్టిన్(ENG)vsAUS 12, 1972లో బాబ్ మాస్సీ(AUS)vsENG 16 వికెట్లు తీశారు. కాగా విండీస్‌పై ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ENG విజయం సాధించింది.
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి(CEO)గా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సీఈవోగా ముకేశ్ కుమార్ మీనా పనిచేశారు.
TG: EAPCET కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు జులై 13వ తేదీతో ముగియనుంది. ఆప్షన్ల నమోదుకు జులై 15వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇప్పటివరకు 99,170 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించగా, 60వేల మంది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. జులై 19లోగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత జులై 23లోగా విద్యార్థులు కాలేజీల్లో ఫీజు చెల్లించి, వెబ్‌సైటు ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యాదివస్’గా <<13615795>>ప్రకటించడంపై<<>> AICC అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు. ‘రాజ్యాంగాన్ని రద్దుచేసి మనుస్మృతిని తీసుకురావాలని BJP-RSS ప్రయత్నిస్తున్నాయి. తద్వారా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులవారి హక్కులపై దాడి చేయాలని చూస్తున్నాయి. అందుకే రాజ్యాంగమనే పవిత్రమైన పదానికి హత్య అనే పదాన్ని జతచేసి అంబేడ్కర్‌ను అవమానిస్తున్నాయి’ అని ఖర్గే ధ్వజమెత్తారు.
సైబర్ నేరగాళ్లు ఇండియా పోస్టు పేరుతో ప్రజలకు లింకులు పంపిస్తూ డబ్బులు దోచేస్తున్నారు. ‘పోస్టల్‌లో మీకు పార్సిల్ వచ్చింది. అడ్రస్ సరిగా లేకపోవడంతో డెలివరీ చేయలేదు. చిరునామా అప్డేట్ చేసుకోండి. లేదంటే ప్యాకేజీ రిటర్న్ చేస్తాం’ అని లింక్‌లను పంపుతున్నారు. ఇలాంటి వాటిని క్లిక్ చేయొద్దని PIB ఫ్యాక్ట్ చెక్ ప్రజలను హెచ్చరించింది. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది.
పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ2025లో పాల్గొనకూడదని భారత్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. టోర్నీ నుంచి భారత్ వైదొలిగితే అది శ్రీలంకకు కలిసి వస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయిన లంకకు ఛాన్స్ వస్తుంది. ఇందులో ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఆడాల్సి ఉంది. PAKలో కాకుండా ఎక్కడ నిర్వహించినా తామూ పాల్గొంటామని భారత్ అంటోంది.
Sorry, no posts matched your criteria.