India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: పోస్ట్ గ్రాడ్యుయేషన్(PG)లో బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్ టైమ్ ఛాన్స్’ను తీసుకొచ్చింది. 2000-2001 నుంచి 2018-19 మధ్య ఓయూతో పాటు అనుబంధ కాలేజీల్లో పీజీ చదివి సకాలంలో 4 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోలేని వారికి అవకాశం కల్పించారు. గతంలో హాల్ టికెట్, మార్కుల మెమోల కాపీలను జతపర్చి ఆగస్టు 16వరకు ఫీజు చెల్లించవచ్చు. పూర్తి <
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజుల నుంచి మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఐసొలేషన్‌లో ఉన్నారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి కూడా ఆయన వెళ్లరని సమాచారం. కాగా అక్షయ్ నటించిన ‘సర్ఫిరా’ ఇవాళ థియేటర్లలో విడుదలైంది.
ఉత్తరాది రాష్ట్రాల ప్రజలను పిడుగులు వణికిస్తున్నాయి. ఇటీవల యూపీలో పిడుగుల ధాటికి ఒకే రోజు 38 మంది <<13607894>>చనిపోగా<<>>, బిహార్‌లోనూ గత 24 గంటల్లో 25 మంది మృత్యువాతపడ్డారు. మరో 39 మంది గాయపడ్డారు. బాధితుల కుటుంబాలకు సీఎం నితీశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. వర్షాలు, పిడుగులు పడే సమయంలో ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు.
TG: న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ లాంటి ఐకానిక్ ప్లేస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. HYDలోని రాయదుర్గంలో నెలకొల్పే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. టీస్క్వేర్ నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా మారనుంది. ఇప్పటివరకూ పలువురి సెలబ్రిటీల బర్త్ డేలు, మూవీ అప్డేట్స్‌ను టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించేవాళ్లు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 22న వెల్లడించనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కాగా కవితపై ఛార్జిషీట్ లోపభూయిష్టంగా ఉందని ఆమె తరఫు లాయర్లు వాదించారు. డిఫెక్టివ్ ఛార్జిషీట్ ఉన్నప్పుడు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని వారు పేర్కొన్నారు. ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ కోర్టుకు నివేదించింది.
AP: హామీలను అమలుచేయని చంద్రబాబును కాపాడేందుకు ఇంతలా దిగజారిపోవాలా? అని APCC చీఫ్ షర్మిలను వైసీపీ ప్రశ్నించింది. ‘2019 మేనిఫెస్టోలో ఏముందో నీకు తెలియదా? ఇచ్చిన మాటమేరకు దాన్ని అమలు చేయడం ప్రజలు చూడలేదా? అమ్మకు వందనంపై మోసపూరిత GOను ప్రశ్నించడం మాని YCPపై <<13615198>>నిందలా?<<>> YSR విగ్రహాల విధ్వంసంపైనా మీరు నోరు మెదపలేదు’ అని Xలో ఫైరయ్యింది.
ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశంగా భారత్ 21వ శతాబ్దం చివరిదాకా కొనసాగుతుందని యునైటెడ్ నేషన్స్ తాజా నివేదిక పేర్కొంది. దేశ జనాభా 2060 నాటికి 1.7 బిలియన్లకు చేరుతుందని, ఆ తర్వాత ఈ శతాబ్దం చివరి నాటికి 1.5 బిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది. చైనా జనాభా 2054 నాటికి 1.21 బిలియన్లకు, 2100 నాటికి 633 మిలియన్లకు తగ్గుతుందని పేర్కొంది. ప్రస్తుతం భారత జనాభా 1.45M, చైనా జనాభా 1.41M ఉందని తెలిపింది.
TG: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆరే వారిని కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని ఆరోపించారు. అవినీతి కేసుల నుంచి బయట పడేందుకు కేటీఆర్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని విమర్శించారు. పోలీసుల ద్వారా నిరుద్యోగులను సీఎం రేవంత్ అణచివేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఎంపీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ పెట్టిన కేసులో సీఎం కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీని ఈ నెల 25 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఇవాళ మనీలాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర <<13613456>>బెయిల్<<>> ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో కస్టడీ పొడిగించినందున ఆయన తిహార్ జైలులోనే ఉండనున్నారు.
వాట్సాప్‌లో ‘ట్రాన్స్‌లేట్ మెసేజ్’ అనే ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని ద్వారా చాట్ సెక్షన్‌లోనే మెసేజ్‌లను ఒక భాషలో నుంచి మరో భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ లైవ్ ట్రాన్స్‌లేషన్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుందని, మెసేజులు మాత్రం సెక్యూర్డ్‌గా ఉంటాయని వాబీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునేందుకు లాంగ్వేజ్ పాక్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.