India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: గన్నవరం TDP ఆఫీసుపై గతంలో జరిగిన దాడి కేసులో మాజీ MLA వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందులో 71వ నిందితుడిగా వంశీని పోలీసులు చేర్చారు. మరోవైపు గత నెల 7 నుంచి వంశీ ఎక్కడున్నారనే సమాచారం లేదు.
హైదరాబాద్‌లో జనవరి-మార్చి త్రైమాసికంతో పోల్చితే ఇళ్ల విక్రయాలు 14% తగ్గాయని రియల్ ఎస్టేట్ సంస్థ ప్రాప్ టైగర్ వెల్లడించింది. 14,298 యూనిట్ల అమ్మకాల నుంచి 12,296 యూనిట్లకు పడిపోయిందని తెలిపింది. దేశంలోని పలు ప్రముఖ నగరాల్లో జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 6శాతం తగ్గాయట. ఇళ్ల అమ్మకాల్లో అహ్మదాబాద్, కోల్‌కతా, ముంబై, పుణేల్లో తగ్గుముఖం కనిపిస్తే బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో వృద్ధి కనిపించింది.
శ్రీలంకతో వన్డే సిరీస్‌తో శ్రేయర్ అయ్యర్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అయ్యర్‌పై హెడ్ కోచ్ గంభీర్ సానుకూలంగా ఉన్నారట. BCCIతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా అయ్యర్ వ్యవహరిస్తుండగా.. ఈ ఏడాది KKR మెంటార్‌గా గంభీర్ పని చేశారు. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న ఆదేశాలను పాటించకపోవడంతో అయ్యర్‌పై BCCI వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ నమోదు చేసిన కేసుపై పూర్తిస్థాయి విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. మరోవైపు సీబీఐ కేసులో సీఎంకు ఇంకా బెయిల్ రాలేదు. దీంతో ఆయన కస్టడీలోనే ఉండనున్నారు.
తనను కలవాలంటే ప్రజలు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాలని మండి ఎంపీ కంగనా రూల్ పెట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌కు పర్యాటకులు వస్తుంటారని, కాబట్టి స్థానికులేనని నిర్ధారించేందుకు ఆధార్ తేవాలని ఆమె తెలిపారు. అలాగే తాము ఏ పని మీద కలుస్తున్నామో లేఖ కూడా రాయాలన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ ఫైరయ్యారు. ‘ప్రజల్ని కలవడం ప్రజాప్రతినిధుల బాధ్యత. దానికి ID అవసరం లేదు’ అని ఫైరయ్యారు.
TG: ఇంజినీరింగ్‌లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా(BFSI) కోర్సును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఈ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉండటంతో బీటెక్‌లో దీనిని మైనర్ డిగ్రీగా ప్రవేశపెట్టనుంది. BFSI ప్రతినిధులు ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థుల్ని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. విద్యార్థులు తమ టెక్నికల్ బ్రాంచీతో పాటే ఈ కోర్సునూ చదవొచ్చు. రాష్ట్రంలో ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.
AP: ఐపీఎస్ అధికారి PV.సునీల్ కుమార్‌పై గుంటూరులోని నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో తనను కస్టడీకి తీసుకున్న సమయంలో సునీల్ కుమార్ హత్యాయత్నం చేశారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. దీంతో సునీల్ కుమార్, తదితరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. RRRను అరెస్టు చేసినప్పుడు సునీల్ కుమార్ సీఐడీ డీజీగా ఉన్నారు.
TG: మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం అర్హులైన మహిళలకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులు అందించనుంది. ఆ కార్డులు కొత్త ఐ-టిమ్ మెషీన్లపై స్వైప్ చేసి ‘జీరో’ టికెట్ పొందాలి. ప్రస్తుతం మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే కండక్టర్ జీరో టికెట్ ఇస్తున్నారు. మరి స్మార్ట్ కార్డులు వచ్చాక ఆధార్ కార్డు చూసి టికెట్లు జారీ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
TG: తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్‌కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంపై పోలీసులు ట్వీట్ చేశారు. ‘సోషల్ మీడియాలో, డిజిటల్ వేదికల్లో అసభ్యకరమైన, విద్వేషకరమైన వ్యాఖ్యలు జైలు గోడల మధ్య బందీకి దారి తీస్తాయి. సమాజంలో స్నేహపూర్వక వాతావరణానికి ఇబ్బంది కలిగించకుండా మనుషులమనే విచక్షణతో ప్రవర్తించాలి. సోషల్ మీడియాలో మీ, మీ కుటుంబ వ్యక్తిగత ఫోటోలు పోస్ట్ చేయకండి’ అని కోరారు.
AP: తిరుమల పుణ్యక్షేత్రం ఆకతాయిలకు ఆవాసంగా మారిందని వైసీపీ విమర్శించింది. కంపార్ట్‌మెంట్‌లలో ఆకతాయిలు<<13609377>> ప్రాంక్<<>> చేస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకున్న ఘటనపై మండిపడింది. ‘ఇన్ని ఏళ్లలో ఎన్నడూ జరగని విధంగా కొండపై ఇలాంటివి జరుగుతున్నాయంటే.. కూటమి ప్రభుత్వం చేతగానితనం వల్లేనని ప్రజానీకం అంటోంది. టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు?’ అని Xలో ప్రశ్నించింది.
Sorry, no posts matched your criteria.