India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు చేపట్టారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై ఆయన తొలి సంతకం చేశారు. దీంతో స్థానిక సంస్థలకు రూ.250 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి.
బడ్జెట్ సమావేశాల చరిత్రలో బీజేపీ సర్కార్ తనదైన ముద్రవేసింది. సాయంత్రం 5గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టే బ్రిటిష్ సంప్రదాయానికి 1999లో వాజ్‌పేయీ సర్కార్ చెక్ పెట్టింది. ఉదయం 11గం.కు సమావేశాలు మొదలయ్యేలా చేసింది. 2019లో సూట్‌కేసులో బడ్జెట్ తెచ్చే సంప్రదాయానికి చెక్ పెట్టిన బీజేపీ సర్కార్ 2021లో డిజిటల్ బడ్జెట్‌కు నాంది పలికింది. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగాలూ (రెండున్నర గంటలపైనే) బీజేపీ హయాంలోనే నమోదయ్యాయి.
AP: ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేల సాయం అందిస్తామని పేర్కొంది. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది. గత ప్రభుత్వంలో ‘అమ్మఒడి’గా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీయే సర్కారు ‘తల్లికి వందనం’గా మార్చింది.
ఉక్రెయిన్‌పై పోరులో రష్యాకు సహకరించడం చైనా మానుకోవాలని నాటో దేశాలు హెచ్చరించాయి. రష్యాకు డ్రాగన్ మిలిటరీ సాయం అందించకున్నా మెరుగైన వాణిజ్య సంబంధాలను కొనసాగించిందని పేర్కొన్నాయి. మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి పరికరాలను చైనా అందిస్తుండటంతో రష్యాకు ఆయుధాల తయారీ సులభమవుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా సహకారం వల్ల ఐరోపా సహా రష్యా పొరుగు దేశాలకు ముప్పు పెరుగుతోందని తెలిపాయి.
రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదం మలుపులు తిరుగుతోంది. ఆమె ఫిర్యాదుతో నిన్న రాజ్‌పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు తాజాగా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు ఫైల్ చేశారు. రాజ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేసి, మాల్వీకి దగ్గరయ్యాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ కలిసి తనను డ్రగ్స్ కేసులోనూ ఇరికించారని ఆరోపించారు. రాజ్, మాల్వీ ‘తిరగబడరా సామి’ మూవీలో నటించారు.
TG: కేంద్ర మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని, ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని కోరారు. అందుకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం లేఖ విడుదల చేశారు. బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు సైతం సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాయి.
నీట్ యూజీ పేపర్ లీక్ కేసు విచారణను సుప్రీంకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన పలువురికి కేంద్రం, NTA అందించిన అఫిడవిట్‌లు అందకపోవడం, వారికి కొంత గడువు అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రశ్నపత్రం లీకేజీ విస్తృత స్థాయిలో జరగలేదని సీబీఐ కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలియజేసింది. మరోవైపు నీట్ పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని NTA పేర్కొంటోంది.
AP: అరాచకాలు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం నిలదొక్కుకునేందుకు తన వంతు బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. టీడీపీ హయాంలోనే పోలవరం 72 శాతం పూర్తి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు.
జియో ఐపీఓపై ట్రేడ్ వర్గాల్లో ప్రచారం సాగుతున్న వేళ జెఫరీస్ సంస్థ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2025లో జియో (రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్) మెగా ఐపీఓకు వెళ్లొచ్చన్న జెఫరీస్ ఆ విలువ ₹9.3లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. RIL షేర్ ప్రైస్ మీద జియో షేర్ 7-15% ఎక్కువ ఉంటుందని పేర్కొంది. కాగా జియో కనిష్ఠంగా 5% షేర్లను <<13570017>>ఐపీఓలో<<>> పెట్టినా ఆ విలువ ₹55వేలకోట్లు ఉంటుందని ఇటీవల జెఫరీస్ తెలిపింది.
AP RGUKT పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలైంది. ఛాన్స్‌లర్ ఆచార్య కేసిరెడ్డి లిస్టును విడుదల చేశారు. మొత్తం నాలుగు వేల సీట్లు ఉండగా ఈ ఏడాది ఏకంగా 53,863 దరఖాస్తులు వచ్చాయి. www.rgukt.in వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకుని నిర్ణీత తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు సూచించారు.
Sorry, no posts matched your criteria.