India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో గ్రూప్-2,3 <<13602917>>పోస్టులు<<>> పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. HYD సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈ అంశాలపై సమావేశమై చర్చించారు. ‘గ్రూప్-2, 3కి ఒకే రకమైన సిలబస్ ఉన్నందున షెడ్యూల్ ప్రకారం నవంబర్‌లో గ్రూప్-3, ఆ తర్వాత గ్రూప్-2 నిర్వహించాలి. DSC, గ్రూప్-2 మధ్య కేవలం ఒక్క రోజు వ్యవధే ఉంది. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.
TG: పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డి అందించారు. పద్మశ్రీ గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్ సీఎం చేతులమీదుగా చెక్కులు అందుకున్నారు.
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ జయకేతనం ఎగురవేసింది. 183 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వేను 159/6కే కట్టడి చేసి 23 పరుగుల తేడాతో గెలిచింది. ఆ జట్టులో మయర్స్ హాఫ్ సెంచరీ(65*)తో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో సుందర్ 3, అవేశ్ 2, ఖలీల్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ 5 టీ20ల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది.
TG: రోడ్లపై స్వైర విహారం చేస్తున్న వీధి కుక్కల నియంత్రణకు వారంలోగా కమిటీని ఏర్పాటు చేయాలని GHMCని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వీధి కుక్కల దాడిలో బాలుడు చనిపోయాడని దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారించింది. ఈ అంశంపై ఉదాసీనంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టబోమని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
AP: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. ‘బుగ్గన రాజేంద్రనాథ్ పార్టీ మారడం లేదు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం’ అని స్పష్టం చేసింది. ఆయన బీజేపీలో చేరడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలపై మండిపడుతూ ట్వీట్ చేసింది.
AP: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. మెస్ ఛార్జీలు 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు మంత్రి దృష్టికి తెచ్చారు. ఏ విద్యార్థికి లోటు లేకుండా చూస్తామని మంత్రి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. త్వరలోనే ఖాళీలు భర్తీ చేసి సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు పూర్వవైభవం తెస్తామని వెల్లడించారు.
శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు KL రాహుల్ కెప్టెన్ పగ్గాలు చేపట్టనున్నట్టు సమాచారం. అటు T20 కెప్టెన్‌గా హార్దిక్ బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే హెడ్ కోచ్ గంభీర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో వన్డే, T20 కెప్టెన్లతోపాటు జట్టును కూడా ఎంపికచేయనున్నట్టు టాక్. ఈనెల 14లోగా దీనిపై స్పష్టత రానుంది. టీమ్‌ఇండియా లంకతో జులై 27 నుంచి 3 టీ20లు, ఆగస్టు 2 నుంచి 3వన్డేలు ఆడనుంది.
TG: రీజినల్ రింగ్ రోడ్డు అంశంలో కేంద్ర, రాష్ట్ర, NHAI మధ్య త్రైపాక్షిక ఒప్పందాన్ని వెంటనే పూర్తి చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. భూసేకరణకు ఎందుకు జాప్యమవుతోందని ఆయన కలెక్టర్లను ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసంతో భూములిచ్చేందుకు రైతులు ముందుకు రావడంలేదని అధికారులు సమాధానమిచ్చారు. మానవీయ కోణంతో వ్యవహరించి, రైతులకు ఎక్కువ పరిహారం దక్కేలా చూడాలని ఆదేశించారు.
TG, APలో పెద్ద సినిమాలు రిలీజైన వారం వరకు టికెట్ రేట్ల <<13602234>>పెంపునకు<<>> ప్రభుత్వాలు అనుమతించడంపై పలువురు అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. ప్రతీ సినిమాకు రేట్లు పెంచుకుంటే పోతే తాము అంతంత డబ్బులు పెట్టి ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని మూవీలకు ఫిక్స్‌డ్ టికెట్ ధరలు ఖరారు చేయాలని కోరుతున్నారు. ఇటీవల ‘కల్కి’, ఇప్పుడు ‘భారతీయుడు-2’కి రేట్లు పెంచారని గుర్తు చేస్తున్నారు.
ముంబై హిట్ అండ్ రన్ కేసు నిందితుడు, శివసేన(శిండే) నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షాకు కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దీంతో ఈనెల 16 వరకు పోలీసులు అతడిని విచారించనున్నారు. ఘటన తర్వాత మిహిర్ కారు నంబర్ ప్లేట్‌ను తొలగించాడని గుర్తించారు. అతడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని భావిస్తున్నారు. ఆయా విషయాలపై మిహిర్‌ను ప్రశ్నించనున్నారు. ఆదివారం మిహిర్ తన కారుతో ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మరణించింది.
Sorry, no posts matched your criteria.