India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింధూరంలో ‘అర్థశతాబ్దపు’ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఓ సిగరెట్ పెట్టెపై రాశారట. ఆ మూవీ దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ‘మూవీ ఫస్ట్ కాపీ చూశాక అటూ ఇటూ తిరుగుతున్నారు. ఏంటి గురువుగారూ అని అడిగితే పేపర్ ఇమ్మన్నారు. చేతిలో ఏం లేక రోడ్డుపై సిగరెట్ పెట్టెను తీసి ఇచ్చాను. దాని మీద లిరిక్స్ రాసి గంటలో పాట ఇచ్చారు. ఆయన చెప్పడం వల్లే ఈ పాట సినిమాలో పెట్టాం’ అని పేర్కొన్నారు.
TG: ప్రభుత్వోపాధ్యాయులకు సీఎం రేవంత్ హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ‘ఏ స్కూల్లోనైనా ఉపాధ్యాయులు లేకపోతే చర్యలుంటాయి. ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలిస్తున్నాం. వేతనం తీసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా పనిచేయాలి. తప్పుంటే ఉన్నతాధికారులపైనైనా చర్యలు తప్పవు. సెక్రటేరియట్ నుంచి పంచాయతీ వరకు ఫేస్ రికగ్నిషన్ ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.
ఎక్స్‌యూవీ 700 AX7 విడుదలై మూడేళ్లు పూర్తైన సందర్భంగా భారీ డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. గతంలో AX7 వేరియెంట్ ధర రూ.21.54 లక్షలుగా ఉండగా ఇప్పుడు రూ.19.49 లక్షలకే అందివ్వనున్నట్లు తెలిపింది. మంగళవారం నుంచే ఈ కొత్త ధర అందుబాటులోకి వచ్చిందని, 4 నెలలపాటు మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఎంపిక చేసిన వేరియెంట్లపై రూ. 2.2 లక్షల వరకు తగ్గింపు లభిస్తుందని స్పష్టం చేసింది.
వాట్సాప్‌లో త్వరలో ‘జూమ్ కంట్రోల్స్ ఫర్ ది కెమెరా’ అనే ఫీచర్ రానుంది. ఫీచర్‌లో భాగంగా యాప్‌లో కెమెరా రికార్డింగ్ దగ్గర బటన్‌ను తీసుకురానున్నారు. దీనిని ఉపయోగించి యూజర్లు తమకు అవసరమైనంత వరకు కెమెరాను జూమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం స్క్రీన్‌పై స్వైప్ చేసి జూమ్ చేసే ఆప్షన్ ఉంది. కానీ కొత్త ఫీచర్‌తో సులభంగా కచ్చితమైన జూమింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1794: బ్రిటిష్ వారితో విజయనగర రాజుల ‘పద్మనాభ యుద్ధం’
1846: కోవెలకుంట్ల ఖజానాపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దాడి
1856: ప్రముఖ పరిశోధకుడు నికోలా టెస్లా జననం
1916: ఉమ్మడి ఏపీ మాజీ సభాపతి దివంగత కోన ప్రభాకరరావు జననం
1928: భారత తొలి మహిళా జడ్జి జస్టిస్ అమరేశ్వరి జననం
1945: సినీ నటుడు కోట శ్రీనివాసరావు జననం
1949: మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జననం
తేది: జులై 10, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:27 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:48 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: జులై 10, బుధవారం
చవితి: ఉదయం 6.36 గంటలకు
మఖ: ఉదయం 09.55 గంటలకు
వర్జ్యం: సాయంత్రం 06.43-08.28 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 11.37-12.30 గంటల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.00- 01.30 గంటల వరకు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
✒ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్
✒ రష్యా సహకారంతో ఇంధన కొరతకు చెక్: PM
✒ AP: విద్యుత్ రంగంలో రూ.49,496 కోట్ల అప్పు: CBN
✒ 16న ఏపీ కేబినెట్ భేటీ.. పథకాల అమలుపై చర్చ
✒ 2026 నాటికి ‘భోగాపురం’ పూర్తి: రామ్మోహన్
✒ TG: పరీక్షలు వాయిదా వేస్తే యువతకే నష్టం: రేవంత్
✒ ఒక్కో మహిళకు రేవంత్ సర్కార్ రూ.20వేలు బాకీ: కిషన్‌రెడ్డి
✒ ‘రైతు భరోసా’పై రేపటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ
Sorry, no posts matched your criteria.