news

News July 9, 2024

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం రేవంత్

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ సభలో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తాం. కార్యకర్తల కోసం నేతలంతా పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా’ అని వ్యాఖ్యానించారు.

News July 9, 2024

పరీక్షలు వాయిదా వేస్తే యువతకే నష్టం: సీఎం రేవంత్

image

TG: DSC, గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్లపై CM రేవంత్ మహబూబ్‌నగర్ సభలో ధ్వజమెత్తారు. ‘పరీక్షలు తరచూ వాయిదా వేస్తే యువత నష్టపోతుంది. త్వరగా పరీక్షలు పూర్తయితే ఉద్యోగం రానివారు మరో ఉద్యోగం చూసుకుంటారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలిస్తే.. కోర్టు నోటిఫికేషన్‌ను రద్దు చేస్తుంది. పదేపదే పరీక్షలను రద్దు చేయించాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోంది’ అని CM ఆరోపించారు.

News July 9, 2024

HYD జూలో ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకున్న సింహం.. 20 నిమిషాల్లోనే!

image

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని ఎన్‌క్లోజర్ నుంచి ఆఫ్రికన్ లేడీ సింహం శిరీష తప్పించుకుంది. ఎన్‌క్లోజర్ శుభ్రం చేశాక డోర్లు సరిగ్గా మూయకపోవడంతో ఉదయం 10.20 గంటలకు శిరీష తప్పించుకుంది. అప్పటికే పక్షవాతంతో చికిత్స పొందుతోన్న ఈ సింహాన్ని 20 నిమిషాల తర్వాత ఎన్‌క్లోజర్‌లోకి చేర్చినట్లు అధికారులు తెలిపారు. గేట్లన్నీ మూసేసి సింహాన్ని బంధించామని, ఓ యానిమల్ కీపర్‌కి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.

News July 9, 2024

PMAY డబ్బు తీసుకొని.. లవర్స్‌తో వెళ్లిపోయిన 11మంది మహిళలు!

image

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొదటి విడతగా రూ.40వేలు అందుకున్న 11మంది వివాహితలు భర్తలను వదిలేసి తమ లవర్స్‌తో వెళ్లిపోయారట.
UPలోని మహారాజ్‌గంజ్‌ జిల్లాలో జరిగిందీ ఘటన. సదరు భర్తలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చిందట. దీంతో 2వ విడత డబ్బును అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. గతేడాదీ ఇలాగే రూ.50వేలు తీసుకొని నలుగురు మహిళలు లవర్స్‌తో పరారయ్యారు.

News July 9, 2024

రేపు ‘తంగలాన్’ ట్రైలర్ రిలీజ్

image

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ ట్రైలర్ రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 12 సెకన్లు ఉండనున్నట్లు టాక్. పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆగస్టు 15న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

News July 9, 2024

చైనా ఆఫీసుల్లో ఐఫోన్లు మాత్రమే వాడాలి: మైక్రోసాఫ్ట్

image

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైనా, హాంకాంగ్‌లోని తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలిచ్చింది. వర్క్ ప్లేస్‌లో వారంతా సెప్టెంబర్ నుంచి కచ్చితంగా ఐఫోన్స్ మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఉపయోగిస్తున్న వారికి ఐఫోన్‌లు అందజేస్తోంది. చైనాలో గూగుల్ సేవలు లేకపోవడం, ఆ దేశ మొబైల్స్ వాడటం వల్ల కంపెనీ డేటాకు ముప్పు ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది.

News July 9, 2024

T20WCలో క్రికెటర్ల మందు పార్టీ.. ఖండించిన శ్రీలంక బోర్డు

image

T20 వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే శ్రీలంక టీమ్ నిష్క్రమించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ టోర్నీలో కీలక మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు మందు పార్టీ చేసుకున్నారంటూ ఓ మీడియా సంచలన కథనం రాసింది. దీన్ని శ్రీలంక బోర్డు ఖండించింది. అమెరికాలో అలాంటి ఘటనలేవీ జరగలేదని స్పష్టం చేసింది. లంక ప్లేయర్లను అప్రతిష్ఠపాలు చేయడానికి ఆ వార్తను ప్రచురించిందని పేర్కొంది.

News July 9, 2024

‘మాకు ₹30వేల కోట్లు కావాలి’.. బిహార్ డిమాండ్‌తో కేంద్రంపై భారం!

image

బిహార్‌లో ప్రాజెక్టుల అభివృద్ధికి బడ్జెట్‌లో ₹30వేల కోట్లు కేటాయించాలని జేడీయూ సర్కార్ కేంద్రాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలతో జరిగిన ప్రీబడ్జెట్ మీటింగ్‌లో ఈ డిమాండ్ లేవనెత్తినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా మరో మిత్రపక్షమైన టీడీపీ సైతం ఇప్పటికే ₹లక్షకోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో NDA సర్కార్‌కు ఈ బడ్జెట్ రూపకల్పన సవాల్‌గా మారింది.

News July 9, 2024

లగ్జరీ బ్రాండ్స్ తయారీ-అమ్మకానికి మధ్య ఇంత వ్యత్యాసమా?

image

ఇటలీలో లగ్జరీ బ్రాండ్‌లపై జరిపిన దర్యాప్తులో అధికారులు విస్తుపోయే విషయాలను గుర్తించారు. దర్యాప్తులో Dior కంపెనీ ఒక్క హ్యాండ్‌బ్యాగ్‌కు తయారీదారులకు 53 యూరోలు (రూ.4700) చెల్లిస్తూ తన స్టోర్‌లో 2600 యూరోలకు (రూ.2.34 లక్షలు) అమ్ముతున్నట్లు తేలింది. అర్మానీ సంస్థ కూడా హ్యాండ్‌బ్యాగ్‌లను 93 యూరోలకు (రూ.8385) కొని 250 యూరోలకు (రూ. 22,540) విక్రయిస్తోంది. ఈ వ్యత్యాసం చూసి అధికారులే షాక్ అయ్యారట.

News July 9, 2024

రేపు విశాఖకు కుమారస్వామి.. స్టీల్ ప్లాంట్‌పై చిగురిస్తున్న ఆశలు

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి రేపు విశాఖకు రానున్నారు. ఈ నెల 11న స్టీల్ ప్లాంట్‌లో పర్యటించి, అధికారులతో సమీక్షించనున్నారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర BJP MPలు కేంద్రమంత్రిని కోరారు. తాజాగా ఆయనే పర్యటనకు వస్తుండటంతో స్టీల్‌ప్లాంట్ కార్మికుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.