news

News July 9, 2024

కొత్త పింఛన్లకు అర్హుల జాబితాను సిద్ధం చేయండి: మంత్రి సీతక్క

image

TG: రాష్ట్రంలో కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. BRS ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్నవి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు. చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని, ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు.

News July 9, 2024

బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలు ఏకం కావాలి: భట్టి

image

TG: మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని నేషనల్ సాలిడారిటీ కమిటీ ఏర్పాటు సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ‘YSR హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కల్పించాం. ఆయన అందరికీ స్ఫూర్తి ప్రదాత. ప్రపంచపటంలో హైదరాబాద్ ఉందంటే అందుకు వైఎస్ చేపట్టిన కార్యక్రమాలే కారణం. మరో 2 దశాబ్దాలపాటు కాంగ్రెస్‌దే అధికారం’ అని స్పష్టం చేశారు.

News July 9, 2024

ఇకపై తిట్లు బంద్ చేద్దాం: బండి సంజయ్

image

TG: ఎన్నికలు ముగిశాయి కాబట్టి తిట్లు ఆపి ఇక అభివృద్ధిపై దృష్టి పెడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందేలా చూస్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాను అభివృద్ధి చేస్తా’ అని పేర్కొన్నారు.

News July 9, 2024

దివ్యాంగుల్ని కించపరిచే సీన్స్ ఉండొద్దు: సుప్రీం కోర్టు

image

సినిమాల్లో దివ్యాంగుల్ని కించపరిచే సీన్స్ ఉండటానికి వీల్లేదని సుప్రీం కోర్టు తాజాగా తేల్చిచెప్పింది. అవిటివాడు, స్పాస్టిక్ వంటి పదాలు సామాజిక వివక్షకు దారి తీస్తాయని అభిప్రాయపడింది. ఆంఖ్ మిచోలీ అనే హిందీ సినిమాల్లో దివ్యాంగుల్ని కించపరిచే సీన్స్ ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సినిమా స్క్రీనింగ్‌కు ముందే సెన్సార్ బోర్డు అభిప్రాయాల్ని తీసుకోవాలని సూచించింది.

News July 9, 2024

స్టార్ అవ్వాలంటే బికినీ వేసుకోవాలన్నాడు: మనీషా

image

తన కెరీర్ ఆరంభంలో ఓ ఫొటోగ్రాఫర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని నటి మనీషా కొయిరాలా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఓసారి ఫొటోషూట్‌కు వెళ్లాను. అక్కడ ఉన్న ప్రముఖ ఫొటోగ్రాఫర్ నా దగ్గరకు టూ పీస్ బికినీ తెచ్చి వేసుకోమన్నాడు. అది ధరిస్తేనే స్టార్ అవుతానన్నాడు. ఇవి ఈత కొట్టే సమయంలో తప్ప సినిమాల్లో ధరించనని తేల్చిచెప్పాను. తర్వాత నేను పెద్ద నటిని అయ్యాక అతడే నా ఫొటోలు తీశాడు’ అని తెలిపారు.

News July 9, 2024

ICC ఛైర్మన్‌గా జై షా?

image

ICC ఛైర్మన్‌గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్‌బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు క్రికెట్ బజ్ పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

News July 9, 2024

రేవంత్ గారూ.. మీకో అద్భుతమైన అవకాశం: ఉండవల్లి

image

AP: మంగళగిరిలో జరిగిన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. TG సీఎం రేవంత్ ఎదుట అద్భుతమైన అవకాశం ఉందని అన్నారు. ‘తెలుగు రాష్ట్రాల మధ్య శాశ్వత అనుబంధాన్ని కల్పించే అవకాశం మీకు వచ్చింది. సాంకేతికంగా రెండు రాష్ట్రాలే కానీ తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే సందేశాన్ని మీరు ఇవ్వాలి. షర్మిలను కలుపుకొని ముందుకెళ్లండి. మీకు YSR ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అని పేర్కొన్నారు.

News July 9, 2024

టీమ్ ఇండియాకు అప్పట్లో రివార్డు ఎంతంటే..

image

టీ20 కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2011లో వన్డే వరల్డ్ కప్ రివార్డుపై డిస్కషన్ నడుస్తోంది. అప్పట్లో ఆటగాళ్లు తలో రూ.2 కోట్లు పారితోషికంగా అందుకున్నారు. ఇక 2007లో తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు జట్టు మొత్తానికి కలిపి బోర్డు రూ.12 కోట్లు ఇచ్చింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీకి ఆటగాళ్లకు రూ.కోటి చొప్పున నజరానా దక్కింది.

News July 9, 2024

కరాచీ పౌరులకు జర్మనీ ఎంబసీ మూసివేత

image

పాకిస్థాన్‌లోని కరాచీలో జర్మనీ రాయబార కార్యాలయం అక్కడి పౌరులకు సేవల్ని నిలిపేసింది. కేవలం ఐరోపా సమాఖ్య(EU) పౌరులకు మాత్రమే ఇకపై సేవలందించనున్నట్లు ప్రకటించింది. భద్రతాకారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గడచిన కొన్ని రోజులుగా కరాచీవ్యాప్తంగా విదేశీయులు, పోలీసు అధికారులపై ఉగ్రదాడులు తీవ్రంగా పెరిగాయి. ఈక్రమంలోనే జర్మనీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

News July 9, 2024

ఢిల్లీ జట్టు కోసం ప్రాణాలిస్తా: సౌరవ్ గంగూలీ

image

ఢిల్లీ జట్టు కోసం ప్రాణమిస్తానంటూ వ్యాఖ్యానించారు ఆ జట్టు క్రికెట్ డైరెక్ట్, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. నిన్న ఆయన పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ధోనీ, యూవీ, జహీర్, హర్భజన్‌లో టీమ్ ఇండియా భవిష్యత్తును గంగూలీ చూశారంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ చేసింది. అందుకు సమాధానంగా ‘థాంక్యూ ఢిల్లీ.. ఈ జట్టు కోసం ప్రాణం ఇస్తా’ అని గంగూలీ ట్వీట్ చేశారు.